Budget Laptops: తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ కావాలా.. రూ.30 వేల లోపు బెస్ట్‌ ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Budget Laptops: తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ కావాలా.. రూ.30 వేల లోపు బెస్ట్‌ ఇవే!

    Budget Laptops: తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ కావాలా.. రూ.30 వేల లోపు బెస్ట్‌ ఇవే!

    July 13, 2023

    ఈ కాలంలో ల్యాప్‌టాప్‌ల వినియోగం బాగా పెరిగిపోయింది. ఉద్యోగులే కాకుండా ఇతరులు కూడా వీటిని వినియోగిస్తున్నారు. అన్ని రకాల పనులకు ల్యాప్‌టాప్‌ని వాడుతున్నారు. అయితే, ల్యాప్‌టాప్‌ని కొనుగోలు చేయాలంటే బాగా వెచ్చించాల్సి ఉంటుంది. కానీ, కనీస అవసరాల కోసం ల్యాపీని వాడే వారు అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయలేరు. అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ లెవెల్ ల్యాప్‌టాప్స్. బిజెనెస్‌కి, పర్సనల్ పనులకు, చదువులకు ల్యాపీని వాడాలని భావించే వారు రూ.30 లోపే కొనుగోలు చేయవచ్చు. మెరుగైన ఫీచర్లతో బడ్జెట్ ధరలో ఉన్న ల్యాప్‌టాప్‌లేంటో చూసేద్దామా. 

    AVITA Laptop

    అవిటా ల్యాప్ టాప్‌లు వివిధ వేరియంట్లలో రూ.30వేల లోపు అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌కు FHD యాంటీ గ్లేర్ స్క్రీన్, నారో బెజిల్స్ ఉన్నాయి. ఇది విండోస్10 ఓఎస్‌ని కలిగి ఉంది. స్క్రీన్ సైజ్ 14 ఇంచులు ఉంటుంది. సెలెరాన్400 ప్రొసెసర్‌తో వస్తోంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 25,000గా ఉంది.

    BUY NOW

    HP CHROMEBOOK 

    హెచ్‌పీ క్రోమ్‌బుక్ సన్నగా ఉండి క్యారీ చేసేందుకు చాలా సులువుగా ఉంటుంది. టచ్‌స్క్రీన్‌తో వస్తున్న ల్యాపీ ఇది. 14 అంగుళాల స్క్రీన్‌ని కలిగి ఉంది. సెలెరాన్ ఎన్4020 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. దీని ధర రూ. రూ.25,199.

    BUY NOW

    Lenovo Ideapad Slim 3

    తక్కువ బడ్జెట్‌లో ల్యాప్‌టాప్‌ కావాలనుకునే వారికి లెనోవో ఐడియాప్యాడ్‌ స్లిమ్‌3 మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ఇది ఇంటెల్‌ సెలెరాన్‌ N4020 ప్రాసెసర్‌, 4GB RAM, 256 SSD స్టోరేజ్‌ కలిగి ఉంది. అలాగే ఈ ల్యాప్‌టాప్‌ను 15.6 అంగుళాల స్క్రీన్‌తో తీసుకొచ్చారు. ప్రస్తుతం మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.30,000 వరకూ ఉంది. 

    BUY NOW

    ASUS VivoBook 15

    ASUS VivoBook 15 కూడా తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్‌ ల్యాప్‌టాప్.  ఇది డ్యూయెల్‌ కోర్‌ సెలెరాన్‌ ఎన్‌3350 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 4GB RAMను దీనికి అమర్చారు. విండోస్‌ 10 హోమ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది. ఈ ల్యాప్‌ టాప్‌ 15.6 అంగుళాల స్క్రీన్‌ కలిగి ఉంది. మార్కెట్‌లో దీని ధర రూ. 29,000. 

    BUY NOW

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version