• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వారాహి యాత్రపై పేర్నినాని విమర్శలు

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాల్గో విడత వారాహి యాత్రపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ యాత్ర కేవలం కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కమ్మ, బీసీలు, ఇతర సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన టైంలో పవన్‌కు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసి చారిత్రక తప్పిదం చేస్తున్నారని ఆరోపించారు.

    తట్ట పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ

    మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహి కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం ఓ గంట శ్రమదానం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫిట్‌నెస్‌ ట్రైనర్ బైయాన్‌పురియాతో కలిసి ప్రధాని మోదీ శ్రమదానం చేశారు. స్వయంగా చీపురు పట్టి చెత్తను బుట్టల్లోకి ఎత్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా ఉంది. https://x.com/narendramodi/status/1708383866711642496?s=20

    కాంగ్రెస్‌కు కీలక నేత రాజీనామా

    మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు. మెదక్ టికెట్ ఆశించిన తిరుపతి రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కుమారుడు.. మైనంపల్లి రోహిత్‌కు టికెట్ ఇస్తారన్న ప్రచారంతో మనస్తాపం చెందారు. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేస్తున్న తనను కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వటం పట్ల అలకబూనారు. అధిష్ఠానంతో చర్చించాక కూడా హామీ దక్కకపోవడంతో తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యచరణను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.

    BIGBOSS7: రతిక రోజ్ ఎలిమినేట్

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో నాలుగోవారం నామినేషన్లలో భాగంగా రతిక రోజ్ ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. నామినేషన్‌లో తేజ, యావర్, గౌతమ్, శుభశ్రీ, ప్రియాంక ఉండగా.. తక్కువ ఓట్లు వచ్చిన రతిక ఎలిమినేట్ అయినట్లు సమాచారం. హౌస్‌లో పల్లవి ప్రశాంత్‌తో లవ్ ట్రాక్ నడిపి.. ఆ తర్వాత అతన్ని చులకనగా మాట్లాడటం, తొలినుంచి సపోర్ట్ చేస్తున్న శివాజికి వెన్నుపోటు పొడవటం వంటివి ఆమె నెగిటివిటిని పెంచాయి. దీంతో రతిక నాల్గోవారం ఎలిమినేట్ అయింది.

    పాక్‌ను చిత్తు చేసిన భారత్

    ఆసియా గేమ్స్‌- హాకీలో పాకిస్తాన్‌పై 10-2 గోల్స్ తేడాతో భారత హాకీ జట్టు గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో పాక్‌ను చిత్తు చేశారడు. తాజా విజయంతో గ్రూప్‌ ఏలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 10 స్వర్ణాలు, 14 రజతాలు, 14 కాంస్యాలు లభించాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 216 పతకాలతో చైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

    శ్రీవారి దర్శనానికి 24 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని అన్నీ కంపార్టుమెంట్లు నిండి కల్యాణవేదిక వరకు భక్తులు వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 87,081 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 41,575 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    ఈరోజు, రేపు వర్షాలు

    వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈరోజు రేపు హైదరాబాద్ సహా వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, ఖమ్మం, సిద్ధిపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనున్నట్లు అంచనా వేసింది.

    చంద్రబాబుపై మరో కేసు

    చంద్రబాబుపై వరుస కేసులు పెడుతూ వైసీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని సుప్రీంకోర్టును మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆశ్రయించారు. తెలంగాణ ఏసీబీ ఛార్జిషీట్‌లో 22 సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావన ఉందని గుర్తు చేశారు. ఈ కేసు విచారణ పురోగతిపై ఆరా తీయ్యాలని కోర్టును కోరారు. అక్టోబరు 3న ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది. ఇప్పటికే స్కిల్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో చంద్రబాబు ముద్దాయిగా ఉన్నారు.

    తెలంగాణకు నేడు ప్రధాని మోదీ

    తెలంగాణకు నేడు ప్రధాని మోదీ రానున్నారు. మహబూబ్‌నగర్‌లో తెలంగాణ బీజేపీ ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. కాంగ్రెస్‌పై కూడా తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ రెండూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యం లేని కుటుంబ పార్టీలు’ అంటూ విమర్శించారు.

    రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు

    తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన బాలాపూర్ లడ్డు వేలం ఈసారి కూడా రికార్డు ధర పలికింది. తుర్కయాంజల్‌కు చెందిన దయానంద్ రెడ్డి రూ.27 లక్షలకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. వేలం పాటలో స్థానికులు, స్థానికేతరులతో కలిపి మొత్తం 56 మంది పాల్గొన్నారు. రూ.1,116తో ప్రారంభమైన లడ్డూ వేలం రూ.27 లక్షల వద్ద ముగిసింది. 1994 నుంచి లడ్డూ వేలం పాట నిరంతరాయంగా కొనసాగుతోంది. తొలిసారి రూ.450కి స్థానిక రైతు కొలను మోహన్ రెడ్డి చేజిక్కించుకున్నారు. https://x.com/NtvTeluguLive/status/1707282234183647687?s=20