• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నారాయణకు మరోసారి నోటీసులు

    అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణకు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే బెయిల్ మీద ఉన్న నారాయణను విచారణకు హాజరు కావాల్సిందిగా వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అక్టోబర్ 4న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ఇదే కేసులో నారా లోకేష్‌ను ఇటీవల ఏ14గా చేరుస్తూ సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

    మహాత్మునికి సీఎం జగన్ నివాళి

    గాంధీ జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మహాత్మునికి నివాళులర్పించారు. రాష్ట్రంలో సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం అని చెప్పారు. గ్రామ/వార్డు, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశామన్నారు. మునుముందు కూడా గాంధీ చూపిన మార్గంలోనే నడుస్తాం అని పేర్కొన్నారు. మహాత్ముడి ఆశయాల సాధనగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు.

    అభ్యర్థుల ఎంపికపై షా, కిషన్ రెడ్డి భేటీ

    ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, పార్టీలో పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రేపు నిజామాబాద్ వేదికగా జరగనున్న మోదీ సభపై చర్చించారు. తెలంగాణలో మరిన్ని ప్రధాని సభలు పెట్టాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి మహబూబ్‌ నగర్ సభలో పసుపు బోర్డును మోదీ ప్రకటించిన నేపథ్యంలో నిర్మల్, కరీంనగర్‌లో ప్రధాని బహిరంగ సభలు పెట్టాలని బీజేపీ యోచిస్తోంది.

    పవన్ పూటకో మాట: అంబటి

    అవినీతిలో మునిగి తేలినవాళ్లు జైళ్లో మహాత్మగాంధీ జయంతి రోజున దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఇలాంటి దీక్షలు చేస్తున్నవారిని చూస్తే మహాత్ముడి ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. పవన్ పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. మొన్నటిదాక బీజేపీతో పొత్తు అని ఇప్పుడు టీడీపీతో మాత్రమే పొత్తు అని అంటున్నారని చురకలు అంటించారు. కేవలం కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పవన్ సభలు పెడుతున్నారని ఆరోపించారు.

    యువకుడి పొట్టలో గర్భాశయం

    ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడి పొట్టలో గర్భాశయాన్ని గుర్తించారు వైద్యులు. యువకుడి తల్లిదండ్రుల అనుమతితో గర్భాశయాన్ని తొలగించారు. కొద్దిరోజులుగా యువకుడు నిరంతరం కడుపునొప్పితో బాధపడుతుండే వాడు. కాళ్లు కూడా వాపునకు గురయ్యాయి. దీంతో ఆస్పత్రికి వెళ్లగా, పరీక్షించిన డాక్టర్లు అతనిలో గర్భాశయం ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు 300వరకు నమోదైనట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

    శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల వరకు సమయం పడతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 88,623 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 43,934 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

    నేడు జైలులో చంద్రబాబు దీక్ష

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో ఈరోజు నిరశన దీక్ష చేపట్టనున్నారు. సత్యమేవ జయతే పేరుతో ఏపీలోని అన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలు నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. మరోవైపు నారా భువనేశ్వరి ఈరోజు రాజమండ్రి క్వారి సెంటర్‌లో నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన చేపట్టనున్నారు. అనంతరం ఆమె ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ముఖ్యనేతలందరూ పాల్గొంటారు.

    5 నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర?

    చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టాలని యోచిస్తున్నారు. ఈనెల 5న కుప్పం నుంచి ప్రారంభించి రాయలసీమ జిల్లాల్లో కొనసాగించాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న భువనేశ్వరి.. టీడీపీ చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. కార్యకర్తల్లో ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు. స్కిల్ స్కాం కేసులో కోర్టు తీర్పును అనుసరించి బస్సు యాత్రకు ప్లాన్ చేయనున్నట్లు తెలిసింది.

    జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వండి: పవన్

    ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. నాల్గో విడత వారాహి యాత్రలో ఆయన మాట్లాడుతూ.. ‘స్వయంగా నేను గెలవకున్నా.. నిలబడి పోరాడుతున్నానంటే నా నిబద్ధత ఏంటో అర్థం చేసుకోండి. జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వండి. మళ్లీ జగనుకు ఓటేస్తే పరుస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. సమస్యలపై మాట్లాడుతోంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. అవనిగడ్డ ప్రాంతంలో ఇసుక దోపిడీ వల్ల 76 మంది ప్రాణాలు కొల్పోయారు. ఏపీ భవిష్యత్ కోసం ఈసారి సరైన వ్యక్తులకు … Read more

    టీడీపీ-జనసేనదే అధికారం: పవన్

    వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఎన్నికల్లో సీఎం జగన్‌ ఓటమి ఖాయమని జోష్యం చెప్పారు. ‘ డీఎస్‌సీ కోరుకుంటున్న నిరుద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 30 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ‘యువత భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ అనుకుంటా. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్‌ అంటున్నారు. టీడీపీ-జనసేన అధికారంలోకి రావడం ఖాయం’’ అని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.