• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐఫోన్ 15 అమ్మలేదని సిబ్బందిపై దాడి

    ఐఫోన్ 15పై ఉన్న క్రేజ్ కొట్లాటకు దారి తీసింది. స్టోర్ సిబ్బందిని ఐఫోన్ ప్రియులు చితకబాదారు. ఈ ఘటన ఢిల్లీలోని క్రోమా స్టోర్‌లో జరిగింది. ఐఫోన్ 15 ప్రో మొబైల్‌ను అమ్మడం కుదరదు అన్నందుకు క్రోమా సిబ్బందిపై దాడి చేసినట్లు తెలిసింది. దీనిపై క్రోమా స్టోర్ స్పందిస్తూ.. స్టాక్ లేకపోవడం వల్లే అమ్మడం లేదని చెప్పుకొచ్చింది. సిబ్బందిపై దాడి చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. https://x.com/TeluguScribe/status/1705484270578655478?s=20

    క్షమాపణలు చెప్పిన పోలీస్ జంట

    సోషల్ మీడియాలో తమ ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ కావడంపై సీపీ ఆనంద్‌కు లేడీ ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగత వేడుకల్లో యూనిఫాం గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సీపీ ఆనంద్ అన్నారు. కొత్త దంపతులు జీవితకాలం ప్రేమతో కలిసి ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు. పంజాగుట్ట పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న లేడీ ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ చేసుకున్న ప్రీ వెడ్డింగ్ షూట్‌లో యూనిఫాం, ప్రభుత్వ వాహనాలు వాడటంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. https://x.com/fpjindia/status/1703795784997822685?s=20

    అసెంబ్లీలో విజిల్స్ వేసిన బాలకృష్ణ

    ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సభలో వీడియోలు తీసినందుకు అచ్నెన్నాయుడు, బి అశోక్‌లను సభా సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు చంద్రబాబును విడుదల చేయాలని బాలకృష్ణ నిరసన తెలిపారు. సభలో విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. స్పీకర్ వారించినా విజిల్స్ ఆపలేదు. https://x.com/DailyCultureYT/status/1705076094767186193?s=20

    అక్కినేని కోసం చొక్కా చింపుకున్నా: మోహన్ బాబు

    అక్కినేని శతజయంతి వేడుకల్లో పాల్గొన్న మోహన్‌బాబు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తిరుపతిలో చదివేటప్పుడు అక్కినేని గారి సినిమా వందరోజుల పంక్షన్‌లో ఆయన్ను చూసేందుకు చొక్కా చింపుకుని మరి వెళ్లాను. నాగేశ్వరరావు గారి మరుపురాని మనిషి సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఓ సందర్భంలో అన్నపూర్ణమ్మ గారు అక్కినేని గారి ముందు నేను బాగా నటిస్తానని చెప్పారు. అసలే వాడికి పొగరెక్కువ ఎందుకు పొగుడుతున్నావ్ అని కసురుకున్నారు అని చెప్పుకొచ్చారు. https://x.com/NtvTeluguLive/status/1704372184297123899?s=20

    Jr.NTR vs TDP: చంద్రబాబు అరెస్టును పట్టించుకోని తారక్‌.. మౌనం వెనక అసలు కారణం అదేనా!

    తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ద్వారా ఆయన వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని సీఐడీ (CID) అభియోగాలు మోపింది. అంతేగాక ఆయన్ను అరెస్టు చేసింది. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్‌ సైతం విధించింది. ప్రస్తుతం ఈ పరిణామాలే జూ.ఎన్టీఆర్‌కు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఎన్టీఆర్‌ మౌనంగా ఉండిపోవడంపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి … Read more

    మా కుటుంబానికి ఇది కష్టకాలం: భువనేశ్వరి

    చంద్రబాబు భద్రతపై ఆయన సతీమణి నార భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవారు. కుటుంబంకంటే ప్రజలే తనకు ముందర అనేవారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తిని ఆయన నిర్మించిన జైలులోనే కట్టిపడేశారు. ప్రజాపోరాటానికి ఏపీ ప్రజలంతా సహకరించాలి. మా కుటుంబానికిది కష్టకాలం ఇది. రాష్ట్రప్రజలంతా చంద్రబాబుకు అండగా ఉండాలి’ అని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. https://x.com/GlintInsights/status/1701619853613039855?s=20

    చంద్రబాబు కన్వాయ్ నిలిపివేత.. తీవ్ర ఉద్రిక్తత

    పల్నాడు- చిలకలూరిపేటలో చంద్రబాబు కాన్వాయ్ నిలిచిపోయింది. పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించడంతో పోలీసులు కాన్వాయ్‌ను నిలిపివేశారు. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం జగన్ దిష్టి బొమ్మను తగలబెట్టిన కార్యకర్తలు రోడ్లపైకి పెద్ద పెద్ద టైర్లను మోహరించి నిప్పు పెట్టారు. దీంతో చిలుకలూరిపేట- విజయవాడ హైవేపై పెద్దఎత్తున ట్రాఫిక్ స్థంభించింది. ట్రాఫిక్‌ క్లియర్ చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. చిలకలూరిపేటలో పెద్ద ఎత్తున బయటకు వచ్చిన ప్రజలు, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు.. #WeWillStandWithCBNSir#ChandrababuNaidu#G20India2023 pic.twitter.com/SmyPYcJIF0 — iTDP Official (@iTDP_Official) September … Read more

    ఏపీ వ్యాప్తంగా టెన్షన్… టెన్షన్

    చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. తమ అధినేతను విడుదల చేయాలని మహిళా కార్యకర్తలు వైజాగ్‌లో పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ సైతం కేబీఆర్ పార్క్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. #WATCH | Andhra Pradesh | TDP … Read more

    చంద్రబాబు ఆరోగ్యం బాలేదు: లాయర్లు

    చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన తరఫు లాయర్లు స్పందించారు. ‘చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించాం. హైబీపీ, షూగర్ ఉంది. బేయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించాం. కేసుతో సంబంధం లేని సెక్షన్లను చంద్రబాబుపై నమోదు చేశారు. న్యాయపోరాటం చేస్తాం’ అని పేర్కొన్నారు. సిల్క్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ??? ????????-Former Andhrapradesh CM Chandrababu Naidu arrested in the Skill development case. #Chandrababunaidu#G20India #tdp #CBN #TDPAndrapradesh … Read more

    మరో బాలుడిపై వీధికుక్క దాడి

    హైదరాబాద్‌లో మరోసారి వీధికుక్కలు రెచ్చిపోయాయి. ఓ బాలుడిపై దాడి చేసి చెవి కొరికాయి. టపాచబుత్రకు చెందిన ఓ మహళ తన కుమారుడితో కలసి వీధిలో నడచి వెళ్తోంది. ఈ క్రమంలో వెనుక నడిచి వస్తున్న పిల్లాడిపై ఓ వీధికుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ చిన్నారి చెవిని కొరికివేసింది. వెంటనే అప్రమత్తమైన బాలుడి తల్లి కుక్కను తరిమివేసింది. వెంటనే బాలుడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ బాలుడి సర్జరీకి రూ.3 లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. Stray dog menace haunts Hyderabad once again. … Read more