• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • YCP ఎమ్మెల్యే కూతురు ప్రేమవివాహం

    ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూతురు పల్లవి ప్రేమవివాహం చేసుకుంది. ఓ ఆలయంలో ఎమ్మెల్యే తన కూతురికి వివాహం జరిపించారు. ప్రొద్దుటూరుకు చెందిన ఆర్టీసీ మెకానిక్ కుమారుడు పవన్‌ను పల్లవి చదువుకునే రోజుల నుంచే ప్రేమిస్తోంది. ఈ క్రమంలో పల్లవి కులాంతర వివాహానికి తన తండ్రిని ఒప్పించింది. రిజిస్ట్రార్ ఆఫీస్‌లో నిరాడంబరంగా పెళ్లి చేసుకుంది. కూతురు ప్రేమకు విలువనిచ్చిన ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిని ప్రజలు అభినందిస్తున్నారు. Orey rachamallu… “Shatruvulu ekkado undaru ra mana kompallone … untaaru” ani Rao … Read more

    శ్రీవారి సేవలో షారుక్ ఖాన్

    తిరుమల శ్రీవారిని బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన బాలీవుడ్ నటుడు ఈ ఉదయం స్వామివారి సుప్రభాతసేవలో షారుక్ పాల్గొన్నారు. షారుక్‌తో పాటు నటి నయనతార సైతం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు. రేపు షారుక్- నయన్ జంటగా నటించిన జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈక్రమంలో చిత్రబృదం స్వామివారిని దర్శించుకున్నారు. #WATCH | Andhra Pradesh: Actor Shah Rukh Khan arrives in Tirupati He will visit … Read more

    రూ.50 కోట్లు విలువైన డ్రగ్స్‌ సీజ్‌

    HYD: రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టయింది. విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో 5 కిలోల కొకైన్‌ లభ్యమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.50 కోట్లు. ఓ సూట్‌కేస్‌తోపాటు మహిళలు వినియోగించే నాలుగు హ్యాండ్‌బ్యాగ్‌ల అడుగు భాగంలో ఈ సరకును పొడిరూపంలో దాచారు. లావోస్‌ నుంచి సింగపూర్‌ మీదుగా హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు డ్రగ్స్‌ తీసుకొచ్చాడు. హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం తిరిగి దిల్లీకి వెళ్లే ప్రయత్నంలో ఉన్న నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. Sleuths of DRI seized 5 … Read more

    హైదరాబాద్‌లో పెట్రోల్ బదులు నీళ్లు

    హైదరాబాద్‌లోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్‌కు బదులు నీళ్లు వచ్చాయి. దీంతో వాహనదారులు పెట్రోల్ బంక్ యాజమాన్యంతో గొడవకు దిగారు. ఇబ్రహీంపట్నంలోని శేరిగూడలో ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు నీళ్లు వచ్చాయి. వాహనదారులు పెట్రోల్ పోయించుకుని కొంత దూరం వెళ్లగానే వాహనాలు మొరాయించాయి. దీంతో అనుమానం వచ్చిన వారుపెట్రోల్ బంకు యాజమాన్యాన్ని నిలదీశారు. బాటిల్‌లో పోసి పరిశీలించగా సగం నీళ్లు వచ్చాయి. దీంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ కొట్టిస్తే నీళ్లు వస్తున్నాయి హైదరాబాద్ – ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి శేరిగుడాలోని … Read more

    బెల్లంపల్లి PSలో నిందితుడు మృతి

    తెలంగాణలోని బెల్లంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ నిందితుడు ఫిట్స్‌తో మృతి చెందాడు. అతడు కుప్పకూలిపోవడం సీసీ కెమెరాలో రికార్డైంది. కీర్తి అంజి(27) అనే యువకుడు ఇటీవల ఓ మహిళ ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు. విచారణ కోసం అంజి పోలీస్ స్టేషన్‌లోని కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేదని యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారు. బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిట్స్ వచ్చి నిందితుడు మృతి మంచిర్యాల … Read more

    మైనంపల్లి ఆడియో లీక్: వైరల్

    మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆడియో కాల్ లీకైంది. ప్రస్తుతం ఈ ఆడియో కాల్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘‘మోదీ, కేసీఆర్, కేటీఆర్‌లకు కూడా నేను భయపడను. నేను తలచుకుంటే ఎవరినైనా మర్డర్ చేయగలను. టీడీపీలో ఉన్నప్పుడు నేను ఒక్కడినే సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్ధతిచ్చాను. మహేందర్ రెడ్డి, రేవంత్‌రెడ్డిలకు కూడా అప్పట్లో వార్నింగ్ ఇచ్చా. బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లో తిరగలేవని చెప్పా.’’ అంటూ తీవ్ర పదజాలంతో మైనంపల్లి మాట్లాడారు. రేవంత్ రెడ్డిని తొక్కుతానాన్న మైనంపల్లి హన్మంతరావు.. ఆడియో వైరల్ నేను కేసీఆర్, కేటీఆర్, మోడీ ఎవరికీ … Read more

    భోరున ఏడ్చేసిన BRS ఎమ్మెల్యే

    స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భోరున ఏడ్చేశారు. ఎమ్మెల్యేను ఓదారుస్తూ పక్కనున్నవారు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిన్న సీఎం కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో రాజయ్యకు టికెట్ రాలేదు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన రాజయ్య.. అంబేడ్కర్ విగ్రహం ముందు మోకరిల్లి వెక్కి వెక్కి ఏడ్చాడు. కాగా కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ గీత దాటనని రాజయ్య స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో అంబేడ్కర్ విగ్రహం ముందు పడుకొని … Read more

    BRS తొలి జాబితా ఇదే

    వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీఆర్ఎస్ తన తొలి జాబితా విడుదల చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో పూర్తి జాబితా ప్రకటించారు. మొత్తం 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను కేటాయించారు. నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. మరో 4 రోజుల్లో ఈ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు. జనగామ, గోషామహల్, నాంపల్లి, నర్సాపూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. పూర్తి జాబితా కోసం YouSay Webపై క్లిక్ చేయండి. రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను (115 … Read more

    మంత్రి హరీశ్‌కు BRS ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

    మంత్రి హరీశ్ రావుకు మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మైనంపల్లి మాట్లాడుతూ ‘‘నేను ఎక్కడ పోటీ చేయాలో చెప్పడానికి హరీశ్ ఎవరు? నేను మల్కాజ్‌గిరి.. నా కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తాం. ఎవరు అడ్డుకుంటారో చూస్తా. హరీశ్ కీప్‌నకు కూడా టికెట్ కేటాయిస్తున్నారు. అలాంటప్పుడు మా ఇంట్లో రెండు టికెట్లు ఎందుకివ్వరు. సిద్దిపేటలో హరీశ్‌ను ఓడిస్తా.’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Talks in political circles—that BRS Malkajgiri MLA … Read more

    ఊత కర్రలు వచ్చేశాయ్!

    తిరుమలలో కాలినడకన వెళ్లే భక్తుల కోసం టీటీడీ ఊతకర్రలు సిద్ధం చేసింది. భక్తుల ఆత్మరక్షణ కోసం ఊతకర్రలు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున ఊతకర్రలు దిగుమతి చేసుకుంది. వీటిని త్వరలోనే కాలినడక భక్తులకు అందజేయనున్నారు. కాగా ఇటీవల తిరుమల కాలినడక మార్గంలో చిరుతల సంచారం ఎక్కువైంది. ఓ ఆరేళ్లను పాపను కూడా చిరుత చంపేసింది. దీంతో చిరుతల నుంచి రక్షణ కోసం ఊతకర్రలు అందించనుంది. తిరుమలలో కాలి నడకన వెళ్లే భక్తులకు ఊతకర్రలు ఇచ్చేందుకు సిద్దమవుతోన్న … Read more