• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గోపీచంద్‌ని ఆటపట్టించిన ప్రభాస్

    బాలయ్య అన్‌స్టాపబుల్ షో సీజన్ 2 లో ప్రభాస్-గోపీచంద్ ఎపిసోడ్‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆహా గోపీచంద్‌కి చెందిన గ్లింప్స్‌ని విడుదల చేసింది. ఇందులో గోపీచంద్ సరదాగా కనిపించారు. ‘2008లో కాదు సర్..’ అని గోపీచంద్ అంటుంటే.. ‘రేయ్..’ అని ప్రభాస్ అనడంతో నవ్వులు పూచాయి. అనంతరం గోపీ‌చంద్‌ని ప్రభాస్ ఆటపట్టిస్తుంటే బాలయ్య మధ్యలో నిలుచుండటం వంటివాటితో గ్లింప్స్ సరదాగా సాగిపోయింది. వీక్షకులను ఆకట్టుకుంటున్న ఈ గ్లింప్స్‌కు సంబంధించిన ప్రోమోను త్వరలోనే విడుదల చేయనున్నారు.

    ప్రభాస్, Nbk వీడియో గ్లింప్స్

    అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్, బాలయ్య unstoppable ఎపిసోడ్ కు సంబంధించి గ్లింప్స్ వచ్చేసింది. ప్రభాస్ క్యూట్ లుక్ లో అదిరిపోయాడు. ఏం చెబుతున్నవ్ డార్లింగ్ అంటూ ప్రభాస్ మాట్లాడటం గ్లింప్స్ కే హైలైట్ గా అనిపించింది.

    బాలయ్య…మజాకా !

    అన్‌స్టాపబుల్‌ సిరీస్‌తో బాలకృష్ణ దుమ్ములేపుతున్నారు. తన షోకు వచ్చిన వారిని సరదా ప్రశ్నలతో ఆటపట్టిస్తున్నారు. ఈసారి హీరోలు శర్వానంద్‌, అడవి శేష్‌లు రాగా వారితో ఓ ఆట ఆడుకున్నారు. రష్మిక తన క్రష్‌ అని ఓ ఎపిసోడ్‌లో చెప్పటంతో..శర్వా ఆమెతో వీడియో కాల్‌ మాట్లాడించారు. డబుల్‌ మీనింగ్‌ జోకులు వేసి కవర్‌ చేసేందుకు ప్రయత్నించిన శర్వానంద్‌కు. ఇవన్నీ బీ సెంటర్‌ తెలివితేటలంటూ చుక్కలు చూపించారు. ఇలాంటి ఎన్నో సరాదా సంభాషణలతో రిలీజ్‌ చేసిన [ప్రోమో](url) ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

    ఓటీటీలోకి అనిల్‌ రావిపూడి

    టాలీవుడ్‌లో వరుస హిట్లు అందుకుంటున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి ఓటీటీల్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్న కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించున్నారు. కామెడీ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ పేరుతో వస్తున్న ఈ షోను ఎస్‌ఓఎల్‌ సంస్థ నిర్మించింది. దీనిని నవంబర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేేస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో అలరించే అనిల్‌ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో లేదో చూడాలి. View this post on Instagram A post shared by ahavideoin … Read more

    ఎమోషనల్‌గా ‘UnStoppable2’ ప్రోమో

    ఆహాలో బాలయ్య అన్‌స్టాపబుల్ షో అదరగొడుతోంది. తాజాగా రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన మరో ప్రోమో విడుదలైంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ ఎదుర్కొన్న అవమానాలు, సమస్యలను బాలయ్య తెలుసుకున్నాడు. ఈ ట్రైలర్ భావోద్వేగంగా సాగుతుంటుంది. ‘మొహంపై మొటిమలు పెట్టుకుని హీరో ఎలా అవుతావ్?’ అని సిద్ధును అవమానించారట. సినిమా చేస్తున్న సమయంలో తన సోదరి ఆసుపత్రి పాలైందని తెలిసి మానిటర్ వెనకాల వెక్కివెక్కి ఏడ్చానని విశ్వక్‌సేన్ గుర్తుచేసుకున్నాడు.

    ‘పుష్ప’గా రణ్ వీర్ సింగ్

    బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ పుష్పరాజ్ గా మారిపోయాడు. తగ్గేదేలే అంటూ స్టైల్ గా యాక్షన్ చేసి చూపించాడు. సైమా ఈవెంట్ లో ఈ దృశ్యం చోటుచేసుకుంది. మోస్ట్ పాపులర్ హీరోగా రణ్ వీర్ అవార్డు అందుకున్నాడు. అనంతరం ‘పుష్ప.. నీ అవ్వ తగ్గేదేలే’ అంటూ స్టేజిపై సీన్ ని రీక్రియేట్ చేశాడు. అక్కడే కూర్చున్న బన్నీ.. ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. ‘సైమా’ అవార్డుల్లో పుష్ప సినిమా ప్రభంజనం సృష్టించింది. మరి ఈ చిత్రంలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటో కామెంట్ … Read more

    Biggboss 6: ఫ‌స్ట్‌వీక్ నామినేష‌న్స్ స్టార్ట్‌

    బిగ్‌బాస్‌లో ఫ‌స్ట్‌వీక్ నామినేష‌న్స్ మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే టాస్క్‌లో ఓడిపోయి ఇనాయా, బాలాదిత్య‌, అభిన‌య‌శ్రీ నామినేష‌న్స్‌లో ఉన్నారు. ఇక మిగ‌తావాళ్ల‌లో ఎవ‌రిని నామినేట్ చేయాల‌నుకుంటున్నారో చెప్పాల‌ని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు మొద‌ల‌య్యాయి. రేవంత్, ఫైమా మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రుగుతుంది. శ్రీస‌త్య‌, రేవంత్, ఫైమాను ఎక్కువ‌మంది నామినేట్ చేసిన‌ట్లుగా తెలుస్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది.

    Biggboss 6: ఇనాయాపై రీవెంజ్ తీర్చుకున్న గీతూ రాయ‌ల్

    బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు క్లాస్‌, ట్రాష్‌, మాస్ అనే టాస్క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. క్లాస్‌లో ఉన్న స‌భ్యులు అన్ని ల‌గ్జ‌రీల‌ను అనుభ‌వించ‌వ‌చ్చు. ట్రాష్‌లో ఉన్న‌వాళ్ల‌తో న‌చ్చిన ప‌నులు చేయించుకోవ‌చ్చు. ఈరోజు గీతూ రాయ‌ల్‌ను క్లాస్‌లోకి పంపించారు. ఇనాయా సుల్తానాతో నిన్న గొడ‌వ కావ‌డంతో ఆ రీవెంజ్‌ను మొత్తం ఈరోజు తీర్చుకుంటుంది. గ్యాప్ లేకుండా ప‌నులు చెప్పి విసుగించింది. ఇక టాస్క్ ముగియ‌గానే ప‌రిస్థితులు రివ‌ర్స్ అవుతాయ‌ని భ‌య‌ప‌డుతుంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ ప్రోమో ఫన్నీగా ఉంది.

    బిగ్‌బాస్ స్టేజీపై ఆలియా తెలుగు పాట

    బిగ్‌బాస్ సీజన్ 6 సెప్టెంబ‌ర్ 4న గ్రాండ్‌గా ప్రారంభ‌మైంది. ఈ సీజ‌న్‌కు గెస్ట్‌లుగా బ్ర‌హ్మాస్త్ర టీమ్ ఆలియా భ‌ట్, ర‌ణ్‌బీర్ క‌పూర్ వ‌చ్చారు. అయితే ర‌ణ్‌బీర్ తెలుగులో మాట్లాడుతూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. మంచి సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తార‌ని చెప్పాడు. బ్ర‌హ్మాస్త్ర పార్ట్ 2 స‌మ‌యానికి మొత్తం తెలుగు నేర్చుకుంటాన‌ని చెప్పాడు. ఇక ఆలియా బ్ర‌హ్మాస్త్ర నుంచి తెలుగులో కుంకుమ‌లా పాట పాడి అల‌రించింది.

    Biggboss 6: మొద‌టిరోజే గొడ‌వ‌లు ప్రారంభం

    బిగ్‌బాస్‌లో మొద‌టిరోజే కంటెస్టెంట్స్ మ‌ధ్య గొడ‌వ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. బాత్రూమ్‌లో జుట్టు నేను తీయ‌న‌ని గీతూ రాయ‌ల్, ఇనాయా సుల్తానా వాదించుకుంటున్నారు. ఇక కంటెస్టెంట్ మ‌ధ్య చిచ్చుపెట్టేలా బిగ్‌బాస్ మొద‌టి టాస్క్ ఇచ్చాడు. ఇంటిస‌భ్యుల‌ను మూడు బృందాలుగా విడ‌దీశాడు. ఎవ‌రు ఎందులో ఉండాలో వాళ్ల‌నే నిర్ణ‌యించుకోవాల‌ని చెప్పాడు. దీంతో అప్పుడే కంటెస్టెంట్స్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. మ‌రి త‌ర్వాత‌ ఏం జ‌రుగుతుందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్‌లో చూడాల్సిందే!