• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Top 5 Telugu Serial Actress: సీరియల్స్‌ చూడటం లేదా? అయితే ఈ కుర్ర అందాలు మిస్‌ అవుతున్నట్లే!

  ఈ జనరేషన్‌ యూత్‌కు సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై ఉన్న ఆసక్తి.. టెలివిజన్‌లో వచ్చి సీరియళ్లపై ఉండదు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్‌ వారికి పెద్దగా రుచించదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్‌ తీసుకొని ఛానెల్‌ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో టాప్‌-5 సీరియల్ భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.  … Read more

  టీవీల్లో దీపావళి కానుకగా ‘జైలర్‌’.!

  రజనీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ ‘జైలర్‌’ టెలివిజన్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. దీపావళి కానుకగా జెమినీలో ఈ చిత్రం ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇటీవల రిలీజైన జైలర్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. భారీ వసూళ్లతో నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్‌ తన మ్యూజిక్‌తో ప్రాణం పోశారు. ఇందులో మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌, సునీల్‌, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రలు పోషించారు.

  బిగ్‌బాస్‌ హౌస్‌లో దసరా వేడుకలు

  బిగ్‌బాస్‌ హౌస్‌లో దసరా పండగ వేడుకలు జరిగాయి. ఈ మేరకు హౌస్‌లోని కంటెస్టెంట్లతో హోస్ట్‌ నాగార్జున బతకమ్మ ఆడించారు. ఆపై వారితో కొన్ని సినిమా పాటలకు డ్యాన్స్‌లు కూడా చేపించారు. దసరా సందర్భంగా నేడు సాయింత్రం 7గంటలకే షో టెలికాస్ట్‌ అవుతుందని స్టార్‌ మా ప్రకటించింది. దీంతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేశారు. పలు రియాల్టీ షోలలో పాల్గొన్న యంగ్‌ సింగర్స్‌ స్టేజీపైన పాటలు పాడారు. ఆపై డింపుల్ హయాతి తన డ్యాన్స్‌తో దుమ్ములేపింది. Today's first promo . Get ready … Read more

  Biggboss 6: ఫ‌స్ట్‌వీక్ నామినేష‌న్స్ స్టార్ట్‌

  బిగ్‌బాస్‌లో ఫ‌స్ట్‌వీక్ నామినేష‌న్స్ మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే టాస్క్‌లో ఓడిపోయి ఇనాయా, బాలాదిత్య‌, అభిన‌య‌శ్రీ నామినేష‌న్స్‌లో ఉన్నారు. ఇక మిగ‌తావాళ్ల‌లో ఎవ‌రిని నామినేట్ చేయాల‌నుకుంటున్నారో చెప్పాల‌ని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు మొద‌ల‌య్యాయి. రేవంత్, ఫైమా మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రుగుతుంది. శ్రీస‌త్య‌, రేవంత్, ఫైమాను ఎక్కువ‌మంది నామినేట్ చేసిన‌ట్లుగా తెలుస్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది.

  Biggboss 6: ఇనాయాపై రీవెంజ్ తీర్చుకున్న గీతూ రాయ‌ల్

  బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు క్లాస్‌, ట్రాష్‌, మాస్ అనే టాస్క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. క్లాస్‌లో ఉన్న స‌భ్యులు అన్ని ల‌గ్జ‌రీల‌ను అనుభ‌వించ‌వ‌చ్చు. ట్రాష్‌లో ఉన్న‌వాళ్ల‌తో న‌చ్చిన ప‌నులు చేయించుకోవ‌చ్చు. ఈరోజు గీతూ రాయ‌ల్‌ను క్లాస్‌లోకి పంపించారు. ఇనాయా సుల్తానాతో నిన్న గొడ‌వ కావ‌డంతో ఆ రీవెంజ్‌ను మొత్తం ఈరోజు తీర్చుకుంటుంది. గ్యాప్ లేకుండా ప‌నులు చెప్పి విసుగించింది. ఇక టాస్క్ ముగియ‌గానే ప‌రిస్థితులు రివ‌ర్స్ అవుతాయ‌ని భ‌య‌ప‌డుతుంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ ప్రోమో ఫన్నీగా ఉంది.

  బిగ్‌బాస్ స్టేజీపై ఆలియా తెలుగు పాట

  బిగ్‌బాస్ సీజన్ 6 సెప్టెంబ‌ర్ 4న గ్రాండ్‌గా ప్రారంభ‌మైంది. ఈ సీజ‌న్‌కు గెస్ట్‌లుగా బ్ర‌హ్మాస్త్ర టీమ్ ఆలియా భ‌ట్, ర‌ణ్‌బీర్ క‌పూర్ వ‌చ్చారు. అయితే ర‌ణ్‌బీర్ తెలుగులో మాట్లాడుతూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. మంచి సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తార‌ని చెప్పాడు. బ్ర‌హ్మాస్త్ర పార్ట్ 2 స‌మ‌యానికి మొత్తం తెలుగు నేర్చుకుంటాన‌ని చెప్పాడు. ఇక ఆలియా బ్ర‌హ్మాస్త్ర నుంచి తెలుగులో కుంకుమ‌లా పాట పాడి అల‌రించింది.

  Biggboss 6: మొద‌టిరోజే గొడ‌వ‌లు ప్రారంభం

  బిగ్‌బాస్‌లో మొద‌టిరోజే కంటెస్టెంట్స్ మ‌ధ్య గొడ‌వ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. బాత్రూమ్‌లో జుట్టు నేను తీయ‌న‌ని గీతూ రాయ‌ల్, ఇనాయా సుల్తానా వాదించుకుంటున్నారు. ఇక కంటెస్టెంట్ మ‌ధ్య చిచ్చుపెట్టేలా బిగ్‌బాస్ మొద‌టి టాస్క్ ఇచ్చాడు. ఇంటిస‌భ్యుల‌ను మూడు బృందాలుగా విడ‌దీశాడు. ఎవ‌రు ఎందులో ఉండాలో వాళ్ల‌నే నిర్ణ‌యించుకోవాల‌ని చెప్పాడు. దీంతో అప్పుడే కంటెస్టెంట్స్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. మ‌రి త‌ర్వాత‌ ఏం జ‌రుగుతుందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్‌లో చూడాల్సిందే!

  Biggboss 6: కంటెస్టెంట్స్‌తో ఫ‌న్ మామూలుగా లేదుగా!

  బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 నేడు ప్రారంభం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుద‌ల చేశారు. నాగార్జున ఎప్ప‌టిలాగే త‌న ఎన‌ర్జీతో అల‌రిస్తున్నాడు. కొంత‌మంది కంటెస్టెంట్స్ వాయిస్‌ను వినిపించారు, కానీ మోహాలు చూపించ‌కుండా ప్రోమోను రిలీజ్ చేస్తారు. అందులో సింగ‌ర్ రేవంత్, చ‌లాకీ చంటీల గురించి క్లియ‌ర్‌గా తెలుస్తుంది. ఇక మిగ‌తా కంటెస్టెంట్స్ ఎవ‌రో ఈరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలుసుకోవ‌చ్చు. ఈ సారి హౌజ్‌లో అమ్మాయిల డామినేష‌న్ ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. లేడీ కంటెస్టెంట్స్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు స‌మాచారం.

  సెప్టెంబ‌ర్ 4 నుంచే బిగ్‌బాస్ 6 ప్రారంభం

  తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 6 సెప్టెంబ‌ర్ 4 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను నేడు విడుద‌ల చేశారు. కంటెస్టెంట్స్‌ను ఆగ‌స్ట్ చివరి వారం నుంచి క్వారెంటైన్‌లో ఉంచ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఈసారి ఇద్ద‌రు కామ‌న్ పీపుల్ షోలో పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే ఇందులో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ గురించి వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అమ‌ర్‌దీప్‌, చ‌లాకీ చంటి, గీతూ రాయ‌ల్, ఆది రెడ్డి, శ్రీహాన్ , నేహా చౌద‌రి, దీపికా పిల్లి, ఉద‌య‌భాను, యాంక‌ర్ ప్ర‌త్యూష‌ త‌దిత‌రుల‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తుంది.

  బిగ్‌బాస్ 6 ప్రోమో వ‌చ్చేసింది

  తెలుగువారికి ఎంతో ఇష్ట‌మైన బిగ్‌బాస్ రియాలిటీ షో సీజ‌న్ 6 త్వ‌ర‌లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుద‌ల చేశారు. ఎప్ప‌టిలాగే నాగార్జున ఈ ప్రోమోలో మెరిసి ప్రేక్ష‌కుల‌ను ఆనంద‌ప‌రిచాడు. సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో షో ప్రారంభం కాబోతున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్స్ గురించి సోష‌ల్‌మీడియాలో వార్త‌లు చక్క‌ర్లు కొడుతున్నాయి. యాంక‌ర్ ఉద‌య‌బాను, వ‌ర్షిణి, జ‌బ‌ర్ధ‌స్త్ ఆది, దీపికా పిల్లి, నిఖిల్ వంటి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.