• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నాగం రాజీనామా

    కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన కేటీఆర్ సమక్షంలో ఈరోజు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించేందుకు కేటీఆర్ స్వయంగా నాగం ఇంటికి వెళ్లనున్నారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన నాగంకు నిరాశ ఎదురైంది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్‌ ఖరారు చేసింది. దీంతో ఆయన బీఆర్ఎస్‌లో చేరనున్నారు.

    ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించాలి: కేసీఆర్

    కోదాడలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ‘ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించాలి.. ఏం చేశారు, భవిష్యత్‌లో ఏం చేస్తారు అని ఆలోచించాలి. ఓటు మన చేతిలో బ్రహ్మాస్తం. పంట పొలాలు ఎండాలా, పండాలా అనేది ఓటు నిర్ణయిస్తుంది. తెలంగాణ రాక ముందు సాగర్‌ నీళ్ల కోసం రైతులు నా దగ్గరకు వచ్చారు. 24 గంటల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చాం.. నాగార్జున సాగర్‌ పేరు నందికొండ ప్రాజెక్టు.. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టాల్సింది.. గోల్‌మాల్‌ చేసి దిగువన … Read more

    ఇప్పుడు ఎట్లా ఉంది అని అడగాలి: కేటీఆర్

    హైదరాబాద్ మహా నగరంను విశ్వ నగరంగా మార్చే క్రమంలో అడుగులు ముందుకు వేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ప్రజలను కలిసినప్పుడు 2014లఎట్లా ఉండే… ఇప్పుడు ఎట్లా ఉంది అని అడగాలి. గతంను మరిచి పోయి గందరగోళం పడిపోతాం. ఇది మానవ నైజం. 2014కు ముందు 10 గంటలు కరెంట్ పోయిన అడిగేవాడు వాడు… చెప్పే వాడు లేడు. ఇప్పుడు 10 నిముషాలు కరెంట్ పోతే ఇదేనా బంగారు తెలంగాణ అని సోషల్ మీడియాలో పెడుతున్నారు. కర్ణాటకలో ప్రజలు కరెంట్ లేక రోడ్లు ఎక్కుతున్నారు’ అని … Read more

    డీకే శివకుమార్‌కు కేటీఆర్ కౌంటర్

    కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘కర్ణాటకలు రైతులకు 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వని మీరు.. ఇక్కడ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న మమ్మల్ని తప్పుపడుతారా? అధికారంలోకి వచ్చిన మీరు ఒక్క హామీని అయినా అమలు చేస్తున్నారా? బెంగుళూరులోనూ కరెంట్ కట్‌లతో పరిశ్రల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ముందు మీ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చూసుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు.

    తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో ములాఖత్‌లో చెప్పారు. ఏపీలో ప్రస్తుత రాజకీ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణపై ఫొకస్ పెట్టలేమని తెలిపారు. ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నమో టీడీపీ కార్యకర్తలకు వివరించాలని ఆయన సూచించారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తప్పుకున్నట్లైంది.

    విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు

    యంగ్ హీరో విశ్వక్ సేన్ తను తాజాగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం విడుదలపై పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్‌ మారుద్దాం అని చూస్తాడు. డిసెంబర్ 8న వస్తున్నాం. హిట్, ప్లాప్, సూపర్ హిట్ అనేది ప్రేక్షకుల నిర్ణయం. తగ్గేకొద్ది ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. డిసెంబర్ 8న సినిమా రిలీజ్ కాకపోతే.. ఇకపై ప్రమోషన్లలో కూడా పాల్గొనను’ అని పోస్ట్ చేశాడు,

    చంద్రబాబుకు కంటి సమస్య

    రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు కంటి సమస్య ఉందని ప్రభుత్వ వైద్యులు నిర్ధారించారు. సివిల్ సర్జన్ బీ.శ్రీనివాసరావు చంద్రబాబును టెస్ట్ చేసి దృష్టి సమస్య ఉందని స్పష్టం చేశారు. కుడి కంటిలో క్యాటారాక్ట్ ఉందని దానికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. వెంటనే శస్త్ర చికిత్స చేయకుంటే కుడి, ఎడమ కంటి చూపుల్లో తేడా ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు.

    పరిగికి నీళ్లు ఎందుకు తేలేదు: రేవంత్

    కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కేసీఆర్‌ రెండుసార్లు సీఎం అయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘కేసీఆర్‌ కుటుంబంలో అందరికి పదవులు వచ్చాయి. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు ఏమైంది?.. కొడంగల్‌ వరకు గోదావరి జలాలు తీసుకొస్తామని వైఎస్సార్ హామీ ఇచ్చారు.. ఏపీవాళ్లు తెలంగాణ నీళ్లు తీసుకెళ్లారని కేసీఆర్‌ ఆనాడు విమర్శించారు. పరిగికి కేసీఆర్‌ ఎందుకు నీళ్లు తీసుకురాలేదు? భూముల్ని ఆక్రమించిన మిమ్మల్ని వదిలిపెట్టం’ అని హెచ్చరించారు.

    భారీగా పెరిగిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.600 పెరగడంతో రూ.57,400కు చేరుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.660 పెరగడంతో రూ.62,620కి ఎగబాకింది. కిలో వెండి ధర రూ.77,500 వద్ద కొనసాగుతోంది.

    తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం

    తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు వేడిమి, రాత్రి తీవ్రమైన చలితో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శనివారం హైదరాబాద్‌- హయత్ నగర్‌లో సాధారణం కన్నా తక్కువగా 21 డిగ్రీలు, మెదక్‌లో 5 డిగ్రీలు తక్కువగా 13.4, రామగుండంలో 2.4 డిగ్రీలు తక్కువగా 17.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. కాగా ఈరోజు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.