• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారాస ఎంపీపై హత్యాయత్నం

    TG: దుబ్బాక భారాస అభ్య‌ర్థి, ప్రస్తుత ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొన్న ప్ర‌భాక‌ర్ రెడ్డిపై ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి క‌త్తితో దాడి చేశాడు. ఓ పాస్టర్‌ కుటుంబాన్ని పరామర్శించి బయటకొచ్చిన ఎంపీకి షేక్ హ్యాండ్‌ ఇస్తానని వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. దీంతో ప్ర‌భాక‌ర్ రెడ్డికి తీవ్ర గాయాల‌య్యాయి. తీవ్ర ర‌క్త‌ప్ర‌సావంతో బాధ‌ప‌డుతున్న ఆయన్ను చికిత్స నిమిత్తం గ‌జ్వేల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న దౌల్లాబాద్ మండ‌లం సూరంప‌ల్లిలో చోటు చేసుకుంది. మరోవైపు నిందితుడ్ని పట్టుకున్న … Read more

    తెలంగాణకు రాహుల్‌, ప్రియాంక

    కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ప్రియాంక పాల్గొంటారు. మ. 3 గంటలకు దేవరకద్రకు ఆమె చేరుకుంటారు. సా. 4.30 గంటలకు కొల్లాపూర్‌లోని పాలమూరు ప్రజాభేరి సభలో పాల్గొంటారు. అక్కడ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరోవైపు రాహుల్‌ నవంబర్‌ 1, 2 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

    ఆ స్థానాల్లో సా. 4 వరకే పోలింగ్‌: ఈసీ

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్‌ ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉ. 7 నుంచి సా. 4 వరకే పోలింగ్‌ జరగనుంది. మిగతా 106 స్థానాల్లో ఉ. 7 నుంచి సా. 5 వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

    భారాస హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం: సర్వే

    తెలంగాణలో భారాస హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తుందని తాజాగా విడుదలైన రాజ్‌నీతి సర్వే పేర్కొంది. 77 సీట్లల్లో గెలిచి BRS అధికారాన్ని నిలబెట్టుకుంటుందని వెల్లడించింది. అటు కాంగ్రెస్‌ 29, భాజపా 6 స్థానాలకు పరిమితం అవుతాయని తమ సర్వేలో తేలినట్లు చెప్పింది. హైదరాబాద్‌లోని ఏడు స్థానాలు మినహా రాష్ట్రంలోని 112 నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించారు. ఓట్ల పరంగా చూస్తే భారాసకు 43.35% ఓట్లు పోలవుతాయని సర్వే నివేదిక వెల్లడించింది.

    మనీశ్ సిసోదియాకు బెయిల్‌ నిరాకరణ

    దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్‌ నేత మనీశ్ సిసోదియాకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ కేసులో ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రూ.338 కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లు కొన్ని ఆధారాలున్నాయని దర్యాప్తు సంస్థ చూపించిందని కోర్టు తెలిపింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభమైనందున ఈ దశలో బెయిల్‌ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. అయితే విచారణను 6-8 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సుప్రీం ఆదేశించింది.

    చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు

    ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల క్రితం వరకు రూ.100కు 6 కేజీల వరకు దొరికిన ఉల్లి ఇప్పుడు వందకు కేజీన్నరకు పడిపోయింది. హైదరాబాద్‌ మార్కెట్లలో కిలో ఉల్లిని రూ.60-70కి విక్రయిస్తున్నారు. దీపావళి పండగ సీజన్‌ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. గత 15 రోజులుగా ఉల్లిపాయల రాకపోకలు దాదాపు 40% పడిపోయాయని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. నవంబరు రెండో వారం వరకూ ఈ పరిస్థితులు ఉండొచ్చని అభిప్రాయపడ్డాయి.

    స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు

    పసిడి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 చొప్పున పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.57,560కి చేరింది. అటు ముంబయిలో రూ.57,410, చెన్నైలో రూ. 57,710, కోల్‌కత్తాలో రూ.57,410, బెంగళూరులో రూ.57,410గా ఉంది. హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800కు చేరింది. మరోవైపు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,500 వద్ద కొనసాగుతోంది.

    కూసే గాడిద వచ్చి మేసే గాడిదను తిట్టినట్టు: కేసీఆర్

    ఆలేరులో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఆ లక్ష్మీనరసింహుడే మనతో పని చేయించుకున్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పోతాయ్‌ అని ఆనాడు అన్నారు. కరెంటు ఉండదు, చిమ్మ చీకట్లు అవుతాయన్నారు.. సునీత నా బిడ్డలెక్క, ఆమె అడిగిన హామీలు నెరవేరుస్తా.. కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను తిట్టినట్లు డీకే శివకుమార్‌ మనకు చెబుతున్నారు.. 24 గంటలు కరెంట్‌ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటలు కరెంట్ ఇస్తామంటున్నారు’ … Read more

    ఇంట్లో ఉన్న మహిళపై డెలివరీ బాయ్ రేప్

    గ్రేటర్ నోయిడాలో దారుణ ఘటన వెలుగు చూసింది. నిత్యవసర సరుకులు డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. ఆ ఇంట్లోని మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతని పట్టుకునేందుకు వెళ్లారు. తారసపడిన నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపి అతన్ని పట్టుకున్నారు.

    మంచు విష్ణుకు ప్రమాదం

    మంచు విష్ణు కన్నప్ప మూవీ షూటింగ్‌లో గాయపడ్డాడు. యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్ మంచు విష్ణు మీదకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో మంచు విష్ణు చేతికి గాయాలయ్యాయి. దీంతో షూటింగ్‌ను క్యాన్సిల్ చేసి మంచు విష్ణుకి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇది పెద్ద ప్రమాదం కాదని తెలిసింది. కాగా ఈ పాన్‌ఇండియా సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి వారు కన్నప్పలో నటిస్తున్న సంగతి తెలిసిందే.