• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమరావతికి ర్యాలీగా చంద్రబాబు!

    AP: హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు ఇవాళ సాయంత్రానికి బయటకు వచ్చే అవకాశముంది. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం చంద్రబాబు అమరావతిలోని తన నివాసానికి ర్యాలీగా వెళ్లనున్నారు. రాజమహేంద్రవరం నుంచి వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్‌ జంక్షన్‌, గన్నవరం మీదుగా విజయవాడ రానున్నారు. అనంతరం తన నివాసానికి చేరుకుంటారు. బుధవారం తిరుమల శ్రీవారి దర్శనానికి చంద్రబాబు వెళ్లనున్నారు.

    మరో నాలుగు రోజులు ఐసీయూలోనే!

    TG: కత్తి దాడిలో గాయపడ్డ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యంపై హైదరాబాద్‌ యశోద ఆస్పత్రి వైద్యులు అప్‌డేట్‌ ఇచ్చారు. నాలుగు గంటలపాటు శ్రమించి ఆయనకు ఆపరేషన్‌ చేసినట్లు చెప్పారు. చిన్న పేగును 10 సె.మీ మేర వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆయనకు ICUలో చికిత్స అందిస్తుండగా మరో నాలుగు రోజుల పాటు అక్కడే ఉంచాలని వైద్యులు నిర్ణయించారు. మరోవైపు ఈ దాడిని నిరసిస్తూ దుబ్బాక నియోజకవర్గంలో బంద్‌కు పిలుపునిచ్చారు BRS కార్యకర్తలు, వర్తక వ్యాపారులు స్వచ్చందంగా బంద్‌ పాటిస్తున్నారు.

    పసిడి ప్రియులకు భారీ ఊరట

    పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. గత కొన్నిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.210, రూ.230 చొప్పున తగ్గింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.57,200కి చేరింది. అటు ముంబయిలో రూ.57,200, చెన్నైలో రూ. 57,350, కోల్‌కత్తాలో రూ.57,200, బెంగళూరులో రూ.57,200గా ఉంది. హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200కు తగ్గింది. మరోవైపు కిలో … Read more

    ‘ఎంపీపై దాడితో నాకు సంబంధం లేదు’

    TG: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఈ విషయంలో తనపై బురదజల్లడం సరికాదని పేర్కొన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో హింసకు ఎప్పుడూ పాల్పడలేదని గుర్తుచేశారు. దళిత బంధు రాలేదన్న కోపంతోనే నిందితుడు గటాని రాజు ఎంపీపై దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయని రఘునందనరావు తెలిపారు. రాజు ఫేస్‌బుక్‌ ఖాతాను పరిశీలిస్తే అతనికి కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు.

    81 కోట్ల మంది ఆధార్‌ వివరాలు లీక్‌..!

    దేశ ప్రజల ఆధార్‌ కార్డ్‌ వివరాలు మరోమారు లీకైనట్లు తెలుస్తోంది. తమ వద్ద 81.5 కోట్ల మంది భారతీయుల బయోమెట్రిక్‌ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటూ డార్క్‌వెబ్‌లో ఓ ప్రకటన కనిపించింది. దీనిని దేశంలోనే అత్యంత భారీ డాటా చోరీగా పేర్కొంటున్నారు. ICMR వద్ద ఉన్న భారతీయుల వివరాలు సైబర్‌ దొంగల చేతికి చిక్కినట్టు సమాచారం. ICMR మీద గత ఫిబ్రవరి నుంచే సైబర్‌ దాడులు జరుగుతున్నాయి. గత 8 నెలల్లో సుమారు ఆరువేల సార్లు ఐసీఎంఆర్‌ సర్వర్లపై దాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు.

    టీటీడీపీకి కాసాని రాజీనామా

    తెలంగాణలో టీడీపీకి బిగ్‌షాక్ తగిలింది. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అధ్యక్ష పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో టీడీపీ పోటీ చేయకపోవడంపై కాసాని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాల్సిందేనని కొందరు నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే కాసాని భావోద్వేగానికి గురయ్యారు.

    BSP రెండో జాబితా.. ట్రాన్స్‌జెండర్‌కు టికెట్

    తెలంగాణ అసెంబ్లీ నేపథ్యంలో 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను BSP విడుదల చేసింది. 43 మందిలో 26 మంది బీసీలు, ఏడుగురు ఎస్టీలు, ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు ఓసీలకు సీట్లు కేటాయించినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఇందులో ట్రాన్స్‌జెండర్‌కు వరంగల్‌ తూర్పు టికెట్‌ కేటాయించింది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీఎస్పీ ప్రకటించింది. తాజాగా మరో 43 మంది అభ్యర్థులను ప్రకటించింది.

    ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్

    బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో TSPSCని ఎందుకు ప్రక్షాళన చేయలేదని ప్రశ్నించారు. ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఎందుకు ప్రక్షాళన చేయలేదని నిలదీశారు. నిరుద్యోగులకు మేలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పేపర్లు లీక్‌ అయ్యమని కిషన్ రెడ్డి ఆరోపించారు.

    మేం దాడులు చేస్తే ఎవరూ మిగలరు: కేసీఆర్

    బీఆర్‌ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి‌పై దాడిని సీఎం కేసీఆర్ ఖండించారు. రాష్ట్రంలో చేతగాని ప్రతిపక్ష దద్ధమ్మ పార్టీలు ఉన్నాయని విమర్శించారు. ప్రజా సేవ చేస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ‘చేతగాని దద్ధమ్మలు కత్తిపోట్లకు పాల్పడుతున్నారు. కత్తి పొటు పొడవాలంటే మాకు చేతులు లేవా..? మొండి కత్తి మాకూ దొరకదా..? మాకూ దమ్ముంది మేం దాడులు చేస్తే ఎవరూ మిగలరు. ఎన్నికలు ఎదుర్కోలేక హింసకు పాల్పడుతున్నారు’. కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఆగమాగం కావద్దు ఆలోచించి ఓటేయండి: కేసీఆర్

    తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. జుక్కల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. ‘ప్రతిపక్షాల మాటలు విని ఆగమాగం కాకుండా విచక్షణతో ప్రజలు ఓటు వేయండి. తెలంగాణ రాకముందు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో కరెంటులేని పరిస్థితులు చూశాం. ఇప్పుడు తెలంగాణలో తప్పా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి … Read more