• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏఐజీ ఆస్ఫత్రిలో చంద్రబాబు

    టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన చంద్రబాబు నిన్న జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన ఏఐజీ వైద్యులు చంద్రబాబును పరీక్షించారు. వారి సూచన మేరకు చంద్రబాబు ఏఐజీకి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.

    టీడీపీ మాజీ అధ్యక్షుడిపై కేసు

    తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లోని టీడీపీ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకొని దాడికి పాల్పడ్డారంటూ టీడీపీ నేత డాక్టర్‌ ఏ.ఎస్‌.రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యాలయంలోనికి వెళ్లకుండా కాసాని జ్ఞానేశ్వర్, సభ్యులు ప్రకాశ్‌ ముదిరాజ్, బిక్షపతి ముదిరాజ్, ప్రశాంత్‌ యాదవ్‌ తదితరులు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో కుడికంటిపై గాయమైందని తెలిపారు.

    జగన్‌పై సుప్రీంకు వెళ్లిన వైకాపా ఎంపీ

    AP: సీఎం జగన్‌ కేసులపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణను హైదరాబాద్‌ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ‘జగన్‌ కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టులో జాప్యం జరుగుతోంది. ఈ కేసులను సీబీఐ కోర్టు 3,071 సార్లు వాయిదా వేసింది. జగన్‌ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. వందల కొద్దీ డిశ్చార్జి పిటిషన్లు వేయడంతో కేసు విచారణ జాప్యం జరిగే అవకాశం ఉంది’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ‘సంచలనం కోసమే ఎంపీపై దాడి’

    మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి కేసు వివరాలను సిద్దిపేట సీపీ వెల్లడించారు. సంచలనం కోసమే నిందితుడు రాజు.. ఎంపీపై దాడి చేశారని తెలిపారు. ‘నిందితుడికి ఎవరి సహకారం లేదు. రాజు ఒక్కడే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారం క్రితం కత్తికొనుగోలు చేసి ఎంపీ హత్యకు పథకం రచించాడు. రాజు పలు వెబ్‌ఛానల్స్‌లో పనిచేస్తున్నాడని తెలిసింది. విలేఖరి అని చెప్పుకొంటూ, ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసి జల్సాలకు వాడుకునే వాడు’ అని వివరించారు.

    ‘KCR దోచుకున్నదంతా పేదలకు పంచుతాం’

    TG: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజల కలలన్నీ నిర్వీర్యం అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ధరణి పేరుతో 20 లక్షల మంది రైతులకు నష్టం కలిగించారని ఆరోపించారు. తొలుత కేసీఆర్ పదవికి బైబై చెప్పి ఆ తర్వాత అతను దోచుకున్న డబ్బులను రాబట్టాలన్నారు. కేసీఆర్ దొచుకున్నదంతా వసూలు చేసి ప్రజలకు పంచిపెడతామని రాహుల్‌ హామి ఇచ్చారు. రాష్ట్రంలో యుద్ధం మెుదలైందన్న రాహుల్‌.. దీనిని దొరలు, ప్రజల మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు.

    93 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పట్టా

    93 ఏళ్ల ఓ వృద్ధ వయస్కురాలు ఆంగ్ల భాషలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన 83వ స్నాతకోత్సవంలో రేవతి తంగవేలు పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఆమె 1990లో అధ్యాపకురాలిగా పదవీ విరమణ చేశారు. తర్వాత నుంచి సికింద్రాబాద్‌లోని కీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంగ్లభాషలో వ్యాకరణం, వర్ణమాలతో పాటు పదాల కూర్పు వంటి అంశాలపై ఆమె పరిశోధనలు చేశారు.

    సీఎం కేసీఆర్‌ నేటి నుంచి రాజశ్యామల యాగం

    సీఎం కేసీఆర్‌ మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరత రాష్ట్రాలకు చెందిన పలువురు పీఠాధిపతులు ఈ యాగంలో పాల్గోననున్నారు. మొదటిరోజు తెల్లవారుజామున సంకల్పం, రెండోరోజు వేదపారాయణలు, చివరిరోజు పూర్ణాహుతి ఉంటుంది.

    BRS ఎంపీ, ఎమ్మెల్యేల భద్రత పెంపు

    బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. 2+2 ఉన్న భద్రతను 4+4గా పెంచుతూ డీజీ ఆదేశాలు జారీ చేశారు.పెంచిన భద్రత నిన్నటి నుంచి రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు స్పందిస్తూ.. తమకు కూడా భద్రత పెంచాలని పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు డీజీపీకి విజ్ఞప్తి చేసుకున్నారు. పోలీసులు స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

    తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుకున్నాం: కేసీఆర్

    తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుకున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ తెలంగాణ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్‌ నేతలు పోరాడలేదని విమర్శించారు. ఆ పార్టీ వైఖరి, చరిత్ర, ప్రజల పట్ల వారికున్న దృక్పథం ఏంటనేది ప్రజలు ఆలోచించాలన్నారు. దళిత బిడ్డలు ఏళ్ల తరబడి వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు ప్రజల తలరాత, భవిష్యత్తును మార్చేస్తుందన్నారు. ఏది నిజమో తెలుసుకున్న తర్వాతే ప్రజలు ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు.

    ‘అదానీ కోసమే ఫోన్ల ట్యాపింగ్‌’

    దేశంలో ప్రతిపక్ష ఎంపీల ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహరంపై రాహుల్‌ గాంధీ స్పందించారు. అదానీని కాపాడేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్స్ అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలకు యాపిల్‌ కంపెనీ నుంచి హెచ్చరిక మెయిల్ వచ్చిందన్నారు. హ్యాకింగ్‌కు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి కేంద్రంలోని భాజపా ఓర్వలేకపోతోందన్నారు. అందుకే విపక్షాలను అనేక ఇబ్బందులకు గురి చేయాలని భావిస్తోందని ఆరోపించారు.