• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీగా పెరిగిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి రూ.55,700కు చేరింది. అటు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగి రూ. 60,760కి ఎగబాకింది. మరోవైపు కేజీ వెండి ధర రూ. 500 తగ్గింది. దీంతో కిలో వెండి రూ. 77,500కు చేరుకుంది.

    సచిన్ రికార్డు బ్రేక్ కానుందా?

    వన్డేల్లో విరాట్‌ కోహ్లీ మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్‌ రికార్డు బ్రేక్‌ కానుంది. మరో సెంచరీ చేస్తే సచిన్‌ సెంచరీ(49)లను కోహ్లీ సమం చేయనున్నాడు. 463 మ్యాచ్‌ల్లో 49 సెంచరీలు చేసిన సచిన్… కేవలం 285 మ్యాచుల్లోనే కోహ్లీ 48 శతకాలు చేశాడు. ఈ వరల్డ్‌ కప్‌లోనే కోహ్లీ ఆ ఫీట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అటు కోహ్లీ టెస్టులు, వన్డేలు కలిపి మొత్తం 78 సెంచరీలతో సచిన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.

    నేటితో ముగియనున్న రాహుల్ బస్సు యాత్ర

    నేటితో మొదటి దశ కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర ముగియనుంది. ఈరోజు ఉదయం 9 గంటలకు చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర నుంచి రాహుల్ గాంధీ బస్సు యాత్ర స్టార్ట్ కానుంది. 9.30కి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్, 12 గంటలకు వేములవాడ నియోజక వర్గం మేడిపల్లిలో సమావేశం. మధ్యాహ్నం 1 గంటకు కోరుట్లలో సమావేశం, 1.30కి భోజన విరామం, 2.30 గంటలకు ఆర్మూర్‌లో సభ, ఆర్మూర్ నుండి హైదరాబాద్ … Read more

    నేడు బీజేపీ తొలి జాబితా?

    తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై ఇంకా తర్జన భర్జనలు కొనసాగుతునే ఉన్నాయి. గురువారం రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రకాశ్ జావ్‌డేకర్ నివాసంలో టీబీజేపీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తొలి జాబితాపై కసరత్తు చేశారు. సామాజిక వర్గాల వారిగా టికెట్ల కేటాయింపు, ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్న స్థానాలపై తుది జాబితా ఖరారు చేశారు. ఈరోజు 11 గంటలకు జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమై అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

    గరుడవాహనంపై శ్రీవారు

    తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది. స్వామివారిని వీక్షించేందుకు లక్షలాది మంది తిరుమలకు పోటెత్తారు..

    ‘రాహుల్ గాంధీకి సొంత ఇల్లు కూడా లేదు’

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై ఫైరయ్యారు. కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. ‘తెలంగాణలో నాగార్జున సాగర్, శ్రీరామ్‌సాగర్, నెట్టెంపాడు వంటి భారీ ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్మించింది. హైదరాబాద్‌కు ఐటీ ప్రాజెక్టులు, విమానాశ్రయం, మెట్రో రైలు మంజూరు చేసింది. నెహ్రూ స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలుకు వెళ్లారు. ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. ఇన్నేళ్లు ఎంపీ పదవుల్లో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు’. అని రేవంత్ తెలిపారు.

    భారీగా డబ్బు సీజ్

    TS: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.72 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యానులో తరలిస్తుండగా ఈ డబ్బు పట్టుబడింది. డబ్బును ఏటీఎంలలో పెట్టేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే సరైన ప్రతాలు చూపకపోవడంతో నగదు సీజ్ చేసి నిందితులను అందుపులోకి తీసుకున్నారు.

    నేడు మోహిని అవతారంలో శ్రీవారు

    నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అవతారంలో కనిపించనున్నారు. ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం.. సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన సేవ.. గరుడ వాహన సేవ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ప్రతి 5 నిమిషాలకు బస్టాండ్‌లో ఓ బస్సు నడపనున్నట్లు టీటీడీ తెలిపింది.

    రాహుల్ లీడర్‌ కాదు రీడర్: కేటీఆర్

    ఓటుకు నోటు కేసు గజదొంగ రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ను పట్టుకుని కుటుంబ పాలన అంటున్నారు… రాహుల్ ఎక్కడి నుంచి వచ్చాడో గుర్తు లేదా అని ఎద్దేవా చేశారు. రాహుల్ లీడర్‌ కాదు.. రీడర్. కాంగ్రెస్‌ నేతలు ఏది చదివిస్తే అదే చదువుతారు. నేర్చుకునే ప్రయత్నం చేయరు. నోటికి ఎదొస్తే అది వాగి వెళ్లడం సరికాదంటూ విమర్శించారు.

    కొండా సురేఖకు ప్రమాదం

    రాహుల్ గాంధీ బస్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఆయనకు మద్దతుగా చేపట్టిన బైక్‌ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రమాదానికి గురయ్యారు. బైక్ నడిపిన సురేఖ అదుపుతప్పి కింద పడిపోయింది. ఆమె చేతికి, ముఖానికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు హుటాహుటినా సురేఖను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.