• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. నవంబర్ 1 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తనకు సెక్యూరిటీ విషయంలో అనుమానాలు ఉన్నాయని జడ్జికి చంద్రబాబు తెలిపారు. తనకు జెడ్‌ ప్లస్ సెక్యూరిటీ ఉందని.. జైలు లోపల బయట భద్రతా పరమైన అనుమానాలున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యం కూడా సరిగా ఉండటం లేదని విన్నవించారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా రాతపూర్వకంగా న్యాయస్థానానికి తెలియజేయాలని జడ్జి సూచించారు. చంద్రబాబు లేఖను సీల్డ్ కవర్‌లో తనకు అందించాలని అధికారులను … Read more

    తెలంగాణ గురించి చెబుతూ రాహుల్ ఎమోషనల్

    తెలంగాణ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. ‘తెలంగాణతో మాకు ఉన్నది రాజకీయ సంబంధం కాదు.. కుటుంబ సంబంధం ఉంది. తెలంగాణతో మోదీ, కేసీఆర్‌లకు కేవలం రాజకీయ సంబంధమే ఉంది. మీరంతా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. మీకు మాకు మధ్య ఉంది రాజకీయ సంబంధం కాదు. మీ అభిమానం.. ఆశీర్వాదంతో కూడిన సంబంధం. అందుకే మా చెల్లె ప్రియాంకను తీసుకు వచ్చా. తెలంగాణతో మనకు రాజకీయ సంబంధం కాదు.. కుటుంబ సంబంధం అని చెప్పి తీసుకు వచ్చా’ అని చెప్పుకొచ్చారు.

    దొర ఇలాకలో మనకు మంచి రోజులు: రాహుల్

    ములుగు బస్సు యాత్రలో రాహుల్ గాంధీ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణకి.. ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం. దొర ఇలాకాలో మనకీ మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ సంపదను లూటీ చేస్తుంది. కర్ణాటకలో మహిళలందరూ ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. నేను అబద్ధం చెప్పను. పనికి మాలిన మాటలు చెప్పను. కేసీఆర్‌లా 3 ఎకరాల భూమి ఇస్తాం లాంటి హామీలు ఇవ్వడానికి రాలేదు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.

    మణప్పురం గోల్డ్ లోన్ భారీ మోసం

    కృష్ణా జిల్లా- కంకిపాడు మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయంలో భారీ మోసం వెలుగు చూసింది. అక్కడ తాకట్టు పెట్టిన 16 కేజీల బంగారంతో పావని అనే ఉద్యోగిని ఉడాయించింది. ఈ విషయం బయటకు పొక్కడంతో.. కార్యలయం ఎదుట బాధితులు ఆందోళన చేస్తున్నారు. తమ బంగారం తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు వెయ్యి మంది బాధితులు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పావన్ కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలిస్తోంది.

    రాహుల్ ఎందుకు నోరు మెదపలేదు: కేటీఆర్

    కాంగ్రెస్ బస్సుయాత్ర.. తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక. గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు అని విమర్శించారు.

    నేడు ప్రధాని మోదీతో టీబీజేపీ నేతల కీలక భేటీ

    నేడు ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలంగాణ బీజేపీ నేతలు కీలక భేటీ కానున్నారు. ఇప్పటికే తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డాతో రాష్ట్ర నేతల ప్రత్యేక భేటీలు నిర్వహించనున్నారు. తెలంగాణలో రూట్ మ్యాప్, అభ్యర్థుల ఖరారుపై చర్చలు జరపనున్నారు. అన్ని కుదిరితే ఇవాళ రాత్రికే తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

    స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

    ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.55,460కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగి రూ. 60,500కు ఎగబాకింది. మరోవైపు కిలో వెండి ధర రూ.78,000 వద్ద కొనసాగుతోంది.

    మీ కలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది: ప్రియాంక

    ములుగు బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ… ‘తెలంగాణ ఇస్తే రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సోనియాకు తెలుసు. రాజకీయ లబ్దికోసం కాకుండా, తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాంతాచారికి నా నివాళి. ఉద్యోగాలు, నిధుల కోసం మీరు కలలు కన్నారు. మీ కలలు సాకారం అవుతాయని బీఆర్‌ఎస్‌ను నమ్మి ఓటేశారు. ఉద్యోగాలు వస్తాయని పిల్లల భవిష్యత్‌ మారుతుందని అనుకున్నారు. మీ కలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది. సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్‌ సిద్ధాంతం’ అని చెప్పుకొచ్చారు.

    రెండో రోజుకు రాహుల్ బస్ యాత్ర

    తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర రెండోరోజుకు చేరుకుంది. ఈరోజు భూపాలపల్లి నుంచి కాటారం వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. నిరుద్యోగుల బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. కాటారం పక్కనే రైతులతో సమావేశం కానున్నారు. అక్కడే వారితో కలిసి భోజనం చేయనున్నారు. మంథని బైపాస్ నుంచి నేరుగా పెద్దపల్లికి రాహుల్ చేరుకోనున్నారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రి కరీంనగర్‌లో బసచేయనున్నారు.

    బీజేపీ జాబితాలో నా పేరు ఉంటుంది!: రాజాసింగ్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రకటించబోయే లిస్ట్‌లో తన పేరు ఉంటుంది పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రెండు, మూడు రోజుల్లో బీజేపీ తొలి జాబితా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పార్టీ అధిష్ఠానం తనకు మద్దతుగా ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్‌ సర్కారు వస్తుందని అభిప్రాయపడ్డారు.