• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రధాని మోదీ ఘన నివాళి

    గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. యావత్ ప్రపంచంపై బాపూజి చెరగని ముద్ర వేశారు. గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ మన కలల్ని నిజం చేసుకుందాం. ఐకమత్యాన్ని, సామరస్యతను చాటుకుందాం అంటూ సందేశం ఇచ్చారు. అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు గాంధీజికి నివాళులు అర్పించారు.

    14న సడక్ బంద్‌కు పిలుపు

    ఉద్యోగాల నియామకాల విషయంలో TSPSC వ్యవహరిస్తున్న నిర్లక్ష్యంపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఉద్యోగార్థుల మనోవ్యథకు కారణమైన TSPSC తీరును నిరసిస్తూ ఈనెల 14న సడక్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు నిరుద్యోగులు ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధించి నిరసన చేపట్టాలని సూచించారు. ఈ సడక్ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. గ్రూప్ 1 పరీక్ష సరిగా నిర్వహించలేదని హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

    యువకుడి పొట్టలో గర్భాశయం

    ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడి పొట్టలో గర్భాశయాన్ని గుర్తించారు వైద్యులు. యువకుడి తల్లిదండ్రుల అనుమతితో గర్భాశయాన్ని తొలగించారు. కొద్దిరోజులుగా యువకుడు నిరంతరం కడుపునొప్పితో బాధపడుతుండే వాడు. కాళ్లు కూడా వాపునకు గురయ్యాయి. దీంతో ఆస్పత్రికి వెళ్లగా, పరీక్షించిన డాక్టర్లు అతనిలో గర్భాశయం ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు 300వరకు నమోదైనట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

    జగదీశ్వర్‌రెడ్డికి డిపాజిట్ దక్కదు: కోమటి రెడ్డి

    సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డికి కనీసం డిపాజిట్ కూడా రాదని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటా అని సవాలు విసిరారు. గత ఎన్నికల్లోనే స్వల్ప మెజారిటీతో జగదీశ్వర్ రెడ్డి గట్టెక్కారని గుర్తు చేశారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన అవినీతి పరాకాష్టకు చేరుకుందని ఆరోపించారు.

    శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల వరకు సమయం పడతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 88,623 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 43,934 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

    నేడు జైలులో చంద్రబాబు దీక్ష

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో ఈరోజు నిరశన దీక్ష చేపట్టనున్నారు. సత్యమేవ జయతే పేరుతో ఏపీలోని అన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలు నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. మరోవైపు నారా భువనేశ్వరి ఈరోజు రాజమండ్రి క్వారి సెంటర్‌లో నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన చేపట్టనున్నారు. అనంతరం ఆమె ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ముఖ్యనేతలందరూ పాల్గొంటారు.

    ప్రధాని మోదీకి కేటీఆర్ కౌంటర్

    ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌ కేసీఆర్‌ చేతిలోనే పదిలంగా ఉందన్నారు. జాతీయ స్థాయిలోనే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ స్టీరింగ్‌ అదానీ చేతిలోకి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. బీజేపీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మోదీ మార్చారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.

    భార్యను చంపి..భర్త ఆత్మహత్య

    HYD: రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్‌ గ్రామంలో దారుణం జరిగింది. భార్య, కుమారుడిని చంపిన మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 6 నెలల కిందట భార్య లావణ్యపై గొడ్డలితో దాడి చేసి భర్త ధన్‌రాజ్ హతమార్చాడు. తర్వాత 3నెలల పసికందును చంపేశాడు. ఈ కేసులో ధన్‌రాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బెయిప్‌పై ధన్‌రాజ్ విడుదలైయ్యాడు. ఈ క్రమంలో భార్య, బిడ్డను చంపానని మనస్తాపానికి గురైన ధన్‌రాజ్‌ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

    ప్రయాణికులకు TSRTC గుడ్‌న్యూస్..

    ప్రయాణికులకు TSRTC గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగకు 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని TSRTC ఎండీ సజ్జనార్ ట్వీట్ చేస్తూ.. ‘దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు #TSRTC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి’ అని సజ్జనార్ పేర్కొన్నారు.

    తెలంగాణపై ప్రధాని మోదీ వరాల జల్లు

    తెలంగాణపై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిజామాబాద్, ఆదిలాబాద్ రైతుల కలను నిజం చేస్తూ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే రూ.900కోట్లతో ములుగు జిల్లాలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీగా నామకారణం చేస్తున్నట్లు వెల్లడించారు. మహాబూబ్ నగర్‌లో ఉన్న ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. https://x.com/TeluguScribe/status/1708422922199826539?s=20