• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

    ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతన వేతన సవరణ సంఘాన్ని (పీఆర్‌సీ) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ PRC సంఘానికి ఛైర్మన్‌గా విశ్రాంత IAS అధికారి ఎన్‌. శివశంకర్‌ను నియమించింది. సభ్యుడిగా మరో విశ్రాంత అధికారి బి.రామయ్యను నియమించారు. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఆరు నెలల్లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటివరకూ ఉద్యోగులకు 5 శాతం ‘మధ్యంతర భృతి’ (ఐఆర్‌) ఇవ్వాలని నిర్ణయించింది.

    మళ్లీ కేసీఆర్‌దే అధికారం: టైమ్స్ నౌ

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ చేపట్టిన ప్రీ పోల్స్ ఫలితాలను టైమ్స్‌ నౌ వెల్లడించింది. తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ వైపే ఉన్నారని చెప్పింది. తెలంగాణలో కేసీఆర్ సర్కారుకు తిరుగులేదని.. కాంగ్రెస్, బీజేపీలు దరిదాపుల్లో సైతం లేవని తేల్చి చెప్పింది. తెలంగాణలో కేసీఆర్ హవా ఏ మాత్రం తగ్గలేదని.. లోక్ సభ ఎన్నికల్లో గతంలో కంటే మరో రెండు స్థానాలు ఎక్కువ సాధించే అవకాశం ఉందని చెప్పిన టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది.

    ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

    ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతన వేతన సవరణ సంఘాన్ని (పీఆర్‌సీ) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ PRC సంఘానికి ఛైర్మన్‌గా విశ్రాంత IAS అధికారి ఎన్‌. శివశంకర్‌ను నియమించింది. సభ్యుడిగా మరో విశ్రాంత అధికారి బి.రామయ్యను నియమించారు. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఆరు నెలల్లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటివరకూ ఉద్యోగులకు 5 శాతం ‘మధ్యంతర భృతి’ (ఐఆర్‌) ఇవ్వాలని నిర్ణయించింది.

    ‘భారాస ముమ్మాటికి వారసత్వ పార్టీనే’

    TG: భారాస బరాబర్‌ వారసత్వ పార్టీనే అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కుటుంబ పాలన అంటూ విమర్శలు చేస్తున్న వారికి సూర్యాపేట సభలో కౌంటర్ ఇచ్చారు. ‘ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న కేసీఆర్‌ తప్పకుండా తెలంగాణ కుటుంబ సభ్యుడే. మోదీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. కానీ, భారాస ఎందరో త్యాగఫలంతో ఏర్పడిన వారసత్వ పార్టీ. కేసీఆర్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నారు. అయితే మోదీ వచ్చి కుటుంబ పాలన అంటున్నారు. శిఖండి రాజకీయాలు తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదు’ అని కేటీఆర్‌ … Read more

    పంజాబ్‌లో హృదయవిదారక ఘటన

    పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంట్లోనే విగతజీవులుగా కనిపించారు. జలంధర జిల్లాలో పనికోసం వలస వచ్చిన దంపతులకు ఐదుగురు సంతానం. వారు ఆదివారం పనికి వెళ్లి వచ్చేసరికి చిన్నారులు కాంచన (4), శక్తి (7), అమృత (9) ఇంట్లో కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇంట్లోని ట్రంకు పెట్టెను తెరిచి చూడగా అందులో ముగ్గురు చిన్నారులు చనిపోయి కనిపించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    జనసేన పోటీ చేసే స్థానాలు ప్రకటన

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 చోట్ల పోటీ చేయనున్నట్లు జనసేన వెల్లడించింది. కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, నాగర్‌కర్నూల్‌, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్‌, కొత్తగూడెం, ఉప్పల్‌, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌, హుస్నాబాద్‌, రామగుండం, జగిత్యాల, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్‌ వెస్ట్‌, వరంగల్‌ ఈస్ట్‌, మల్కాజిగిరి, ఖానాపూర్‌, మేడ్చల్‌, పాలేరు, ఇల్లందు, మధిర స్థానాల్లో బరిలోకి దిగనున్నట్లు ప్రకటించింది.

    జింబాబ్వేలో భారత వ్యాపారి మృతి

    జింబాబ్వేలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారత సంతతి వ్యాపారవేత్త, ఆయన కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు. భారత్‌కు చెందిన హర్‌పాల్‌ రంధావా జింబాబ్వేలో రియోజిమ్‌ పేరుతో మైనింగ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. శుక్రవారం హర్‌పాల్‌, ఆయన కుమారుడు మరో నలుగురు సిబ్బందితో కలిసి విమానంలో బయలుదేరారు. విమానం మషావా ప్రాంతానికి చేరుకున్న తర్వాత సాంకేతిక లోపంతో కూలిపోయిందని వైమానిక వర్గాలు తెలిపాయి. విమాన ప్రమాద వార్తలను రియోజిమ్‌ కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది.

    భారాస 25 సీట్లకే పరిమితం: రేవంత్‌

    తెలంగాణలో కాంగ్రెస్‌ వేవ్‌ను ఆపడం ఎవరి తరం కాదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారాస పనైపోయిందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మరన్నారు. భారాస సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ పార్టీలోకి వస్తున్నారంటేనే తమ బలమేంటో అర్థమవుతుందన్నారు. భారాసకు ఈసారి 25 సీట్లు దాటే అవకాశం లేదని రేవంత్‌ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 19 శాతం ఓట్లు అన్‌ డిసైడెడ్‌ మోడ్‌లో ఉన్నాయని, ఇందులో మెజారిటీ షేర్ తమకే వస్తుందన్నారు.

    హ్యాట్రిక్‌ కొట్టేది కేసీఆరే: హరీశ్‌రావు

    TG: రాష్ట్ర భాజపాపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి.. అనంతరం మాట్లాడారు. గన్నుతో, పెన్నుతో పోరాటం చేసిన వ్యక్తి రామలింగారెడ్డి అని కొనియాడారు. దుబ్బాకలో భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో భాజపా లేచేది లేదు. కాంగ్రెస్‌ గెలిచేది లేదు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా .. హ్యాట్రిక్‌ కొట్టేది సీఎం కేసీఆరే’ అని హరీశ్‌ అన్నారు.

    అభ్యర్థుల ఎంపికపై షా, కిషన్ రెడ్డి భేటీ

    ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, పార్టీలో పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రేపు నిజామాబాద్ వేదికగా జరగనున్న మోదీ సభపై చర్చించారు. తెలంగాణలో మరిన్ని ప్రధాని సభలు పెట్టాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి మహబూబ్‌ నగర్ సభలో పసుపు బోర్డును మోదీ ప్రకటించిన నేపథ్యంలో నిర్మల్, కరీంనగర్‌లో ప్రధాని బహిరంగ సభలు పెట్టాలని బీజేపీ యోచిస్తోంది.