• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS: బీఎస్పీ అభ్యర్థుల జాబితా విడుదల

    రాబోయో ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు బీఎస్పీ సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలి జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. టీబీఎస్పీ అధ్యక్షుడు R.S ప్రవీణ్ కుమార్‌తో పాటు మొత్తం 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ సిర్పూర్ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. జహీరాబాద్ నుంచి సంగం గోపి, పెద్దపల్లి నుంచి దాసరి ఉషా, తాండూరు నుంచి చంద్రశేఖర్ ముదిరాజ్, దేవరకొండ నుంచి వెంకటేష్ చౌహాన్, ఇలా మరో 15 మంది పేర్లను బీఎస్పీ ప్రకటించింది. … Read more

    సీఎం జగన్‌ హామీలు మరిచారు: పవన్

    వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఇష్టానుసారంగా హామీలు చేసి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సీఎం జగన్ తప్పుడు నిర్ణయాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్మార్ట్ మీటర్లతో రైతులకు భారమని తెలిపారు. జనసేన-టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం జరిగే బాధ్యతను జనసేన తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.

    ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6.3శాతం: ప్రపంచ బ్యాంక్

    భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రపంచబ్యాంకు వెల్లడించింది. ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరంలో ఇండియా 6.3శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. దేశంలోకి పెట్టుబడుల వరుస, స్థానిక డిమాండ్ వృద్ధిరేటుకు దోహం చేస్తుందని పేర్కొంది. ఇదే క్రమంలో దేశ ద్రవ్యోల్బణం 5.9శాతంగా ఉండబోతుందని అంచనా వేసింది.

    కాంగ్రెస్‌లోకి విజయశాంతి?

    ప్రధాని మోదీ సభకు బీజేపీ సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన మహాబూబ్‌నగర్ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి హాజరు కాలేదు. కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఇరువురు నేతలు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర నాయకత్వంపై గతంలో బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతలు తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈరోజు ప్రధాని మోదీ నిజమాబాద్ సభకు రానున్నారు. మరి ఈ సభకైన విజయశాంతి, కోమటిరెడ్డి హాజరవుతారో లేదో చూడాలి.

    మోదీ గారు మా 3 హామీల సంగతేంటి?: KTR

    ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు. “మా 3 ప్రధాన హామీల సంగతేంటి? కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు? బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు? పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడు?మూడ్రోజుల్లో రెండోసారి వస్తున్నారు.. ఆ 3 విభజన హక్కులకు దిక్కేది? పదేళ్ల నుంచి పాతరేసి ఎంతకాలం ఈ అబద్ధాల జాతర? మీ మనసు కరిగేదెప్పుడు, తెలంగాణ గోస తీరేదెప్పుడు? “అని ప్రశ్నించారు.

    షర్మిలకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్లు

    కాంగ్రెస్ పార్టీలో YSR తెలంగాణ పార్టీ విలీనం దాదాపుగా ఖాయమైంది. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు కాంగ్రెస్ అధిష్ఠానం రెండు బంపర్ ఆఫర్లు ఇచ్చింది. ఖమ్మం లోక్ సభ సీటుతో పాటు, ప్రియాంక గాంధీతో సమానంగా AICC జనరల్ సెక్రటరీ పోస్ట్‌ను ప్రతిపాదించింది. అయితే పాలేరు అసెంబ్లీ సీటును షర్మిల ఆశిస్తుండగా.. అధిష్ఠానం కుదరదని చెప్పినట్లు టాక్. ఈరోజు లేదా రేపు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంతో ఆమె భేటీ కానుంది.

    ఈనెల 6న తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్?

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 6 లేదా 7 వ తేదీన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 10న విడుదలైంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వరుస భేటీలతో ఎన్నికల సన్నద్ధతను పరిశీలిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్… సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలను కలిసి అభిప్రాయాలను కోరారు. తెలంగాణ అసెబ్లీ పదవి కాలం డిసెంబర్‌తో ముగియనుంది.

    బిహార్‌లో బీసీలే అధికం

    బిహార్ కులగణన వివరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గణాంకాల ప్రకారం బిహార్ మొత్తం జనాభాలో 63.13శాతం బీసీలు ఉన్నట్లు తేలింది. వీరి సంఖ్య 13.07 కోట్లు. ఇక దళితులు 19.65%, అత్యంత వెనకబడిన వారు 36శాతం, యాదవులు 14.27శాతం, ఇతర వెనకబడిన కులాల వారు 27శాతం మంది ఉన్నారు. అటు హిందువులు 81.99శాతం ఉండగా.. ముస్లింలు 17.7శాతం ఉన్నారు. దేశవ్యాప్త కులగణనకు కేంద్రం నిరాకరించడంతో బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్రంలో కులగణన చేపట్టారు.

    స్వల్పంగా తగ్గిన బంగారం ధర

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.53,200కు చేరుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ. 160 తగ్గి రూ.58,040కు పడిపోయింది. అటు కిలో వెండి ధర రూ.500 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 75,500 వద్ద కొనసాగుతోంది.

    బీఆర్‌ఎస్ పాలనపై చర్చకు వస్తారా?: హరీష్

    బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ పాలనపై చర్చకు పెడుదామా అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు హరీష్ రావు సవాలు విసిరారు. కాంగ్రెస్ మళ్ళీ వస్తే కాలిపోయే మోటార్లు.. పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్ల కాలం వస్తుందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనకి కాంగ్రెస్ పాలనపై చర్చ పెడుదాం అంటున్నాడు. సోనియాగాంధీని బలి దేవత అని రేవంత్ రెడ్డి అనలేదా. ఇప్పుడు పీసీసీ కుర్చీలో కూర్చొని దేవత అంటున్నాడు అని విమర్శించారు.