• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చర్చనీయాంశం అవుతున్న ఊర్వశి ట్వీట్

    బ్రో సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించింది ఊర్వశి రౌటేలా. రేపు ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ట్వీట్ చేసిందీ బ్యూటీ. అయితే, ఇందులో పవన్ కళ్యాణ్‌ని.. ఎస్టీమ్డ్(Esteemed) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ సంబోధించింది. దీంతో ఈ [ట్వీట్](URL Here) చర్చనీయాంశం అయింది. ఈ పదానికి ‘సరిపోలే/గౌరవీనయులై/ పూజ్యులైన’ అనే అర్థాలు వస్తాయి. మరి, ఊర్వశి ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ వేసిందోనని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ ట్వీట్‌తో జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తుండగా వైసీపీ అనుకూల యూజర్లు నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. Delighted … Read more

    పూజా హెగ్ఢే నోటీసులపై, ఉమైర్ కామెడీ

    సినిమా రివ్యూయర్ ఉమైర్ సంధుకు హీరోయిన్ పూజా హెగ్ఢే లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని ఉమైర్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అయితే అతడు లండన్‌లో ఉండడంతో ఏం యాక్షన్ తీసుకోలేరని గుర్తుచేస్తూ హీరోయిన్ల నోటీసులపై కూడా ట్వీట్స్ పెట్టి కామెడీ చేస్తున్నాడు. ఇటీవల ఉమైర్ ‘ప్రభాస్-కృతిసనన్ ప్రపోజ్ చేశాడు. పూజాహెగ్డే ఐరన్ లెగ్’ లాంటి ఆరోపణలు చేస్తూ ట్వీట్స్ చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా కృతిసనన్, పూజాహెగ్డే లీగల్ నోటీసులు పంపించారు. #PoojaHegde sent me Legal Notice ??? !! Behjo … Read more

    పల్నాడు అభిమానులకు అండగా సూర్య

    చనిపోయిన అభిమానుల కోలీవుడ్ హీరో సూర్య అండగా నిలిచారు. సూర్య బర్త్‌డే సందర్భంగా ఏపీలోని నరసరావుపేట మండలం మోపువారిపాలెంలో నక్క వెంకటేశ్, పోలూరు సాయిలు ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్‌తో చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాలతో సూర్య వీడియో కాల్ మాట్లాడారు. వారి ఫ్యామిలీకి సంఘీభావం తెలిపారు. మృతుల కుటుంబీకులకు ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. వారిని ఆదుకుంటానని భరోసా కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. Exclusive : Suriya Anna Expressed His Condolences Via Video Call !! … Read more

    సమంత న్యూలుక్‌ అదుర్స్‌

    టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత న్యూలుక్‍లోకి మారింది. షార్ట్ హెయిర్ కట్‍తో చాలా కొత్తగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సామ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియోలో సమంత నవ్వు హైలైట్‍ అని చెప్పొచ్చు. అందమైన నవ్వుతో సామ్ వీడియో మెరిసిపోయింది. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా తాను సంతోషంగానే ఉన్నానన్న సందేశాన్ని ఈ వీడియో ద్వారా సమంత ఫ్యాన్స్‌కు అందించింది. మరోవైపు సమంత న్యూలుక్‌ చూసిన ఫ్యాన్స్‌ సూపర్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. Driving us crazy with her charming … Read more

    Top 10 Popular Actresses: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టిన సమంత.. సామ్‌తో అంత ఈజీ కాదు..!

    దేశంలో సినిమా సెలబ్రిటీలకు ఉన్నంత క్రేజ్‌ ఇంకెవరికీ ఉండదు. కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆ తారలను సమాజం ఎప్పుడూ ప్రత్యేకంగా చూస్తుంటుంది. వారికి సంబంధించిన అప్‌డేట్స్‌ను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటుంది. ఈ క్రమంలో హీరో, హీరోయిన్ల గురించి నెట్టింట తెగ సెర్చ్‌ చేస్తుంటారు ఫ్యాన్స్‌. అభిమాన తారల విషయాలను తెలుసుకొని సంతోషిస్తుంటారు. ఇదిలా ఉంటే జూన్‌ నెలలో బాగా పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ల జాబితాను ఓర్‌మ్యాక్స్‌(Ormax) మీడియా సంస్థ తాజాగా విడుదల చేసింది. సినీ ఇండస్ట్రీలో పాపులారిటీ, క్రేజ్, ఫాలోయింగ్, సినిమాలు … Read more

    సితారా బర్త్‌డే సెలబ్రేషన్స్: చూశారా?

    సూపర్‌స్టార్ మహేష్‌బాబు, నమ్రతల గారాలపట్టి సితార ఘట్టమనేని బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలసి సితారా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. బర్త్‌డే సందర్భంగా తన స్వగ్రామం బుర్రిపాలెంలోని పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసింది. అందరికీ ఒకేరకమైన పింక్ సైకిళ్లను బహుమతిగా ఇచ్చింది. ఇందుకు సంబంధిచిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ? A shining star with a heart of gold! ?✨ #SitaraGhattamaneni's 11th birthday … Read more

    పుష్ప2 డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్

    పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలోని డైలాగును ఐకాన్ స్టార్ లీక్ చేశాడు. బేబీ సినిమా అప్రిషియేషన్ మీట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప2 నుంచి డైలాగును లీక్ చేశాడు. ‘ఒక్కడ ఒక్కటే రూల్ ఉంటుంది. అదే పుష్ప గాడి రూలూ’ అంటూ చెప్పాడు. ఈ వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. కాగా, బేబి మూవీ విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. యూత్‌ని ఎక్కువగా ఆకట్టుకుంటోంది. Icon StAAr #AlluArjun LEAKS #Pushpa 2 dialogue on the … Read more

    కమల్‌ హాసన్‌తో డార్లింగ్, రానా

    శాన్‌డియాగోలో ‘కామిక్ కాన్’ ఈవెంట్ ప్రారంభమైంది. ప్రాజెక్ట్K చిత్రబృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ప్రభాస్, కమల్ హాసన్‌లతో పాటు రానా కూడా వెళ్లారు. వీరు ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రేపు ప్రాజెక్ట్K గ్లింప్స్, టైటిల్‌ని రివీల్ చేయనున్నారు. ఇప్పటికే క్యారెక్టర్లను పరిచయం చేస్తోంది. సినిమాలోని విలన్లుగా నటిస్తున్న ‘రైడర్లు’ ఈవెంట్ వద్ద సందడి చేశారు. దీపిక పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు. Blush ? #KamalHaasan #RanaDaggubati #Prabhas at #ComicCon, … Read more

    పవన్‌ తొలి పోస్టు వైరల్‌

    పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్ తన ఇన్‌స్టాలో తొలి పోస్ట్‌ పెట్టారు. సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సినీ ప్రముఖులతో దిగిన ఫొటోలను అందులో పంచుకున్నారు. చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతోమంది ప్రతిభావంతులతో ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నానని వీడియో ప్రారంభంలో పవన్‌ అన్నారు. ఇక ఈ వీడియోను అభిమానులు, సెలబ్రిటీలు తెగ షేర్‌ చేస్తున్నారు. https://www.instagram.com/reel/Cut9Fehp89Z/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

    ఆ కాల్పులు నేను జరపలేదు: మనోజ్

    హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌లో జరిగిన కాల్పులతో తనకు సంబంధం లేదని ‘కార్తీకదీపం’ ఫేమ్ మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్నా. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి కాల్పుల విషయం చెప్పారు. తొలుత ప్రాంక్ చేస్తున్నారనుకున్నా. కానీ నా పేరుతో ఉన్న మరో వ్యక్తి ఈ కాల్పులు జరిపినట్లు తెలిసింది. నేను కాల్పులు జరిపాననడం ఫేక్ న్యూస్. టీవీ9, ఎన్టీవీలలో నా ఫొటో ప్రదర్శించి పరువునష్టం కలిగించినందుకు ఆ ఛానెళ్లపై కేసు వేస్తా.’’ అంటూ పేర్కొన్నారు. https://www.instagram.com/reel/CutillIgbY4/?utm_source=ig_web_copy_link