• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘భూతకోల’ వీక్షించిన అనుష్క; వీడియో వైరల్

    కర్నాటక సాంప్రదాయ ప్రదర్శన ‘భూతకోల’ను హీరోయిన్ అనుష్క శెట్టి వీక్షించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగుళూరులో నిర్వహించిన భూతకోల ప్రదర్శనను ఫ్యామిలీతో కలసి చూసింది. ఈ ప్రదర్శనను ఆమె వీడియో కూడా తీశారు. కాగా అనుష్క ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం రివీల్ చేసింది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. Another glimpse of Sweety attending Boothakola Festival in … Read more

    ప్రేమ దోమా ఏం లేదు. అంతా కెమికల్స్‌: పూరీ

    ప్రేమ అనేది ఒక డ్రగ్ లాంటిందని దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. ఆ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదంటూ సలహా ఇచ్చారు. పూరీ మ్యూజింగ్స్‌లో ఈ సారి లవ్‌ డ్రగ్‌ గురించి మాట్లాడారు. మనలో ఎమోషన్స్, భావోద్వేగాలకు కారణం శరీరంలో విడుదలయ్యే కెమికల్స్. వీటివల్లే నవ్వు, ఆనందం, ప్రేమ, కన్నీళ్లు వంటివి వస్తాయి. యూత్‌కు వాడి ప్రేమ మాత్రం నిజం అనిపిస్తుంది. అద్భుతం, పవిత్రం అనుకుంటారు. కానీ, ప్రేమ, దోమ ఏం లేదు అది కేవలం ఓ డ్రగ్ అని అధ్యయనాల్లో తేలింది” అన్నారు.

    మహానటిపై ఏపీ మంత్రి వ్యాఖ్యలు వైరల్

    మహానటి సావిత్రిపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘సినిమా నటులంటే ఏపీ జనాలకు పిచ్చి, వెర్రి. నటీనటులు ఎక్కడికి వచ్చినా జనాలు చూడడానికి వెళ్తారు. అలాగే పవన్‌ను చూడడానికి వస్తారు. నటి అంజలి వచ్చినా.. పూర్వం చనిపోయిన ‘ముండ’ సావిత్రి వచ్చినా కూడా జనాలు చూడడానికి వస్తారు.’’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో నెటిజన్లు మంత్రిపై మండిపడుతున్నారు. https://youtube.com/watch?v=HbSbV0esl3Q

    షూతో దాడి హీరోకు చేదు అనుభవం

    కన్నడ హీరో దర్శన్‌కు ఘోర అవమానం జరిగింది. క్రాంతి సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో అతడిపైకి గుర్తు తెలియని వ్యక్తి షూ విసిరాడు. అది దర్శన్‌ ముఖానికి నేరుగా తగిలింది. ఇటీవల కొన్ని విషయాల్లో వివాదాస్పద కామెంట్లు చేసినందుకు అతడిపై విమర్శలు వచ్చాయి. అందువల్లే ఇలా [దాడి](url) చేశారని భావిస్తున్నారు. ఈ ఘటనను పలువురు సినీ ప్రముఖులు ఖండించారు. ఆవేదన వ్యక్తం చేసిన నటుడు శివరాజ్ కుమార్…అమానవీయ ఘటనలకు పాల్పడొద్దని కోరారు. Keeping all the hate things aside ?Chappali alli hodiddu … Read more

    ప్రభాస్ ప్రోమో వచ్చేసింది

    అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబెల్‌స్టార్ ప్రభాస్ అన్‌స్టాపబుల్2 ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్ కూడా సందడి చేశాడు. ఈ ప్రోమోలో ఈ ఇద్దరి యంగ్ హీరోలతో హోస్ట్ బాలకృష్ణ తెగ అల్లరి చేశారు. ప్రభాస్‌కు సంబంధించిన పర్సనల్ విషయాల గురించి బాలయ్య ఆరాతీశాడు. తనను కూడా డార్లింగ్ అంటూ పిలవాలని ప్రభాస్‌ను బాలకృష్ణ కోరాడు. పెళ్లి ఎప్పుడు అనగా సల్మాన్‌ఖాన్ పెళ్లి తర్వాత అంటూ ప్రభాస్ నవ్వులు పూయించాడు.

    కడపలో మంచు మనోజ్ సందడి

    టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఏపీలోని కడపలో సందడి చేశాడు. కడపలోని అమీన్ పీర్ [దర్గా](url)ను మనోజ్ దర్శించుని ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడాడు. ‘‘ ఇక్కడికి నా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. నేను రాలేకపోయా. ఇప్పుడు కుదిరింది, వచ్చాను. కొత్త సంవత్సరాన్ని కొత్త జీవితంతో ప్రారంభిస్తా. ఫిబ్రవరి నుంచి కొత్త సినిమాలు స్టార్ట్ చేస్తా. నా జీవితం బాగుండాలి. మీ అందరి జీవితాలు బాగుండాలి’’ అంటూ పేర్కొన్నాడు. #ManchuManoj Anna ? pic.twitter.com/xTVaEeCLzG — Yuv Raj … Read more

    విమర్శకులకు షారుఖ్ స్ట్రాంగ్ కౌంటర్

    తనపై వస్తోన్న విమర్శలకు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘‘ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నంత కాలం ప్రపంచం ఏమనుకున్నా డోంట్ కేర్. సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయింది. సోషల్ మీడియా సంకుచిత దృష్టి కోణంతో చూస్తూ ఉంటుంది. ఎవరేమనుకున్నా ‘పఠాన్’ సినిమా రిలీజ్‌ను ఆపలేరు.’’ అంటూ షారుఖ్ ఘాటుగానే సమాధానమిచ్చాడు. కాగా షారుఖ్ నటించిన ‘పఠాన్’లోని బేషరమ్ సాంగ్‌లో హీరోయిన్ దీపిక పడుకొనే హాట్ హాట్‌గా నటించడంతో కొందరు విమర్శిస్తున్నారు.

    కడప దర్గాను సందర్శించిన తలైవా

    సూపర్ స్టార్ రజినీకాంత్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ దర్శనీయ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతిలో పూర్తయ్యాక కడపలోని అమిన్ దర్గాకు చేరుకున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ కూడా తలైవాతో ఉన్నారు. దర్గాకు వచ్చిన రజినీకి నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. కాగా, ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రజినీ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం … Read more

    ఏం చెబుతున్నావ్ డార్లింగ్: ప్రభాస్

    బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ సీజన్2లో ప్రభాస్, గోపీచంద్ సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఆహా మీడియా గ్లింప్స్‌ని విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ చాలా సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చారు. మధ్యలో ఓ సెలబ్రిటీతో మాట్లాడుతూ.. ‘ఏయ్.. ఏం చెబుతున్నావ్, డార్లింగ్’ అంటూ ప్రభాస్ వారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది చిన్న గ్లింప్స్ మాత్రమేనని.. అసలైన ప్రోమోను త్వరలో విడుదల చేస్తామని ఆహా ప్రకటించింది. ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. న్యూ ఇయర్ లేదా క్రిస్టమస్‌కి ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్ … Read more

    రామ్‌చరణ్‌పై బాలీవుడ్ సింగర్ ప్రశంసలు

    బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ హీరో రామ్‌ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. అతడిని ఎందుకు ఇంతలా ప్రేమిస్తారో అర్థమయ్యిందంటూ ఓ [వీడియో ](url)పోస్ట్ చేశారు. ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో ఇద్దరు కలుసుకున్నారు. ఆమెను చూసిన రామ్ చరణ్‌…మీకు పెద్ద అభిమానిని, మీ పని ఇష్టపడతానని చెప్పాడు. దీనికి నేహా నేను కూడా పెద్ద ఫ్యాన్‌ అంటూ బదులిచ్చారు. ఆ వీడియోను పోస్ట్‌ చేసిన ఆమె..ఇలా అందరిముందు మెచ్చుకునే వారు చాలా అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. View this post on Instagram A … Read more