• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యాక్షన్ మూవీ కెప్టెన్ ట్రైలర్ విడుదల

    తమిళ్ హీరో ఆర్య నటించిన కెప్టెన్ మూవీ ట్రైలర్ విడుదలైంది. థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై క్రేజ్ ను పెంచుతుంది. ఈ చిత్రంలో సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి, హరీష్ ఉత్తమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. శక్తి సౌందర్ రాజన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, డి.ఇమ్మాన్ మ్యూజిక్ అందించారు. ఈ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 08, 2022న థియేటర్లలో రిలీజ్ కానుంది.

    ‘జైలర్‌’ సినిమా నుంచి రేపు క్రేజీ అప్డేట్‌

    సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ 169వ చిత్రం ‘జైలర్‌’ నుంచి రేపు క్రేజీ అప్డేట్‌ రాబోతోంది. డాక్టర్‌, బీస్ట్‌ వంటి సినిమాలు తెరెకెక్కించిన నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్‌ స్టార్‌తో నరసింహ వంటి బ్లాక్‌బస్టర్లు కొట్టి కె.ఎస్‌. రవికుమార్‌ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి రేపు ఉదయం 11 గంటలకు అప్డేట్‌ ఇవ్వనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

    బ్రహ్మాస్త్ర ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న ఆలియాభ‌ట్

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ ఆలియా భ‌ట్ మ‌రికొన్ని రోజుల్లో త‌ల్లి కాబోతుంది. ప్ర‌స్తుతం ఆమె ‘బ్ర‌హ్మాస్త్ర’ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది. బ్ర‌హ్మాస్త్ర మొద‌టి భాగం శివ సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కాబోతుంది. భ‌ర్త ర‌ణ్‌బీర్‌తో క‌లిసి ఆమె ఈ సినిమాలో న‌టించింది. తాజాగా ఆలియా, ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ క‌లిసి క‌ర‌ణ్ జోహార్ ఆఫీస్‌లో క‌నిపించారు. బ్లూ క‌ల‌ర్ షార్ట్‌ టాప్‌పై వైట్ క‌ల‌ర్ కోట్‌తో ఆలియా స్టైలిష్‌గా క‌నిపించింది. బ్ర‌హ్మాస్త్ర‌లో అమితాబ్, నాగార్జున‌, మౌనీరాయ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

    జై భీం చూసి కన్నీళ్లు పెట్టిన చైనా యువతి

    చైనాలోని జరుగుతున్న బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జై భీం మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. హీరో సూర్య, ఇతర నటుల నటనకు ఫిదా అవుతున్నారు. థియేటర్లలో జై భీం చూస్తూ చాలా మంది చైనీయులు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆ వీడియో చూసేందుకు WATCH ON TWITTER బటన్‌పై క్లిక్ చేయండి. Jai Bhim mania never ends. Ruling the hearts of Chinese audiences ?#VaadiVaasal #EtharkkumThunindhavan pic.twitter.com/zKfYDHsZ5A — … Read more

    రాజ‌మౌళి మాకు దారి చూపించాడు: మ‌ణిర‌త్నం

    మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న పొన్నియ‌న్ సెల్వ‌న్ మూవీ నుంచి ‘చోళ చోళ’ అనే పాటను శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం కార్య‌క్ర‌మంలో పాల్గొంది. మ‌ణిర‌త్నం మాట్లాడుతూ ముందుగా రాజ‌మౌళికి థ్యాంక్స్ చెప్పాలి. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా మూవీ చేయ‌వ‌చ్చ‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించారు. అదేవిధంగా ఒక సినిమాను రెండు భాగాలుగా చేసి సాక్సెస్ సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించారు అని అన్నాడు. దీంతో పాటు మెగాస్టార్‌కు కూడా థ్యాంక్స్ చెప్పాడు. అది ఎందుకో మీకు త్వ‌ర‌లో తెలుస్తుంద‌ని వెల్ల‌డించాడు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ … Read more

    సినీ స్టార్ల క్రికెట్ టోర్నీ మళ్లీ వచ్చేస్తోంది!

    డల్లాస్‌లో సెప్టెంబర్‌ 24 నుంచి మళ్లీ సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో ట్రోఫీ, జెర్సీని ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆవిష్కరించారు. ‘చదువు లేకపోయినా మేము లక్షల్లో సంపాదిస్తున్నామంటే దానికి కారణం ఈ చిత్ర పరిశ్రమే. ఈ చిత్ర పరిశ్రమ మాకెంతో ఇచ్చింది. కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోవడంలోనే అసలైన సంతృప్తి ఉంటుంది’ అని చిరంజీవి అన్నారు. చిత్రపురి కాలనీలో నిర్మించే ఆసుపత్రికి రూ.20లక్షల చెక్‌ను చిరంజీవి అందజేశారు. కార్యక్రమంలో సినీనటుడు శ్రీకాంత్‌, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ తదితరులు … Read more

    PS-1 నుంచి ‘చోళ చోళ’ సాంగ్ విడుదల

    మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. సెప్టెంబర్ 30న విడుదల కానున్న ఈ మూవీ నుంచి ‘చోళ చోళ’ అనే సెకండ్ సాంగ్ విడుదల అయ్యింది. ‘చోళ చోళ’ అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష కీలక పాత్రల్లో నటించారు.

    ‘కార్తికేయ 2’ నుంచి కృష్ణా ట్రాన్స్ లిరికల్ వీడియో

    నిఖిల్, అనుపమ జంటగా నటించిన ‘కార్తికేయ 2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. విడుదలైన అన్ని భాషల్లో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిపోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘కృష్ణా ట్రాన్స్’ అనే లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ లిరికల్ వీడియో ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ వింటే గూజ్‌బంప్స్ రావడం పక్కా.

    ఇంట‌ర్వ్యూ మ‌ధ్య‌లో విజ‌య్‌ని ప‌ట్టుకొని ఏడ్చేసిన ఛార్మీ

    విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన మూవీ ‘లైగ‌ర్’. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.. పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్‌పై ఛార్మీ దీనికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. అయితే ఫ్యాన్స్ త‌ర‌ఫున ఛార్మీ కొన్ని ప్ర‌శ్న‌ల‌ను పూరీ, విజ‌య్‌ను అడిగింది. ఆ త‌ర్వాత నిర్మాత‌గా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎన్ని ఆర్థిక క‌ష్టాలు అధిగ‌మించారో చెప్పుకొచ్చింది. ఆ స‌మ‌యంలో ఓటీటీ నుంచి మంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ధైర్యం చేసి థియేట‌ర్‌లోనే విడుద‌ల చేస్తామ‌ని చెప్ప‌డానికి రెండే కార‌ణాలు ఉన్నాయి. అందులో ఒక‌టి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌రోటి సినిమా కంటెంట్ అని చెప్పింది. … Read more

    ఆగష్టు 21న సాయంత్రం 5.30 నిమిషాలకు..

    రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘KGF’ ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఆగష్టు 21న సాయంత్రం 5.30 గంటల నుంచి జీ తెలుగులో జరగనుంది. ఈ మేరకు జీ తెలుగు 100 ఫీట్ల పోస్టర్ ప్రదర్శించి ప్రకటించింది. జీ తెలుగు ప్రకటించిన వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. Hyderabadis witnessed a never seen phenomenon for a WTP? … Read more