• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘శాకిని డాకిని’కి సూప‌ర్ రెస్పాన్స్

    నివేతా థామ‌స్, రెజీనా క‌సాండ్రా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ ‘శాకిని డాకిని’. ఈ సినిమా టీజ‌ర్‌ను నిన్న విడుద‌ల చేశారు. దీనికి 24 గంట‌ల్లోనే 2.5 మిలియ‌న్ల కంటే ఎక్కువ‌గా డిజిట‌ల్ వ్యూస్ రావ‌డం విశేషం. పోలీస్ అకాడ‌మీలో చేరిన ఇద్ద‌రు అమ్మాయిలు ఎప్పుడూ గొడ‌వ‌ప‌డుతుంటారు. కానీ వారికి స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు ఒక‌రికి ఒక‌రు తోడుగా ఎలా నిల‌బ‌డ్డారు అనేదే సినిమా క‌థ‌గా తెలుస్తుంది. సుధీర్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. శాకిని డాకిని సెప్టెంబ‌ర్ 16న … Read more

    కట్‌పుట్ల్లి నుంచి సాథియా సాంగ్ రిలీజ్

    అక్షయ్‌ కుమార్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన కట్‌పుట్ల్లి మూవీ నుంచి సాథియా సాంగ్ విడుదలైంది. వీడియోలో అక్షయ్ సరసన తొలిసారి రకుల్ స్టైలిష్‌గా స్టెప్పులేస్తూ ఆకట్టుకుంది. జహ్రా ఖాన్, నిఖిల్ డిసౌజా ఆలపించిన ఈ సాంగ్ అభిమానులను అలరిస్తుంది. విమానం పై డ్యాన్స్ చేసే దృశ్యాలు అదిరిలే ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి రంజిత్ ఎం తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 2, 2022న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.

    ‘రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌’ తెలుగు ట్రైలర్‌

    ‘లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ ట్రయాలజీ హాలీవుడ్‌ సినిమాలకు తెలుగులోనూ వీరాభిమానులు ఉన్నారు. విజువల్‌గా చాలా అద్భుతంగా ఉన్న ఈ సినిమా ఎంతో మందిని ఆకట్టుకుంది. తాజాగా ఈ సిరీస్‌లోనే వస్తున్న ‘రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌’ వెబ్ సిరీస్ తెలుగు ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. లార్డ్‌ ఆఫ్ ది రింగ్స్ ట్రయాలజీ సినిమాల్లోని ఈవెంట్స్‌కు వేల సంవత్సరాల ముందు జరిగిన అంశాలను ఈ సిరీస్‌లో చూపించనున్నారు.

    ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సాంగ్ రిలీజ్

    సుధీర్‌బాబు, కృతిశెట్టి జంట‌గా న‌టిస్తున్న మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ మూవీ నుంచి కొత్త‌కొత్త‌గా అనే రొమాంటిక్ సాంగ్‌ను నేడు విడుద‌ల చేశారు. వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను సింగ‌ర్స్ చైత్ర‌, అభ‌య్ క‌లిసి పాడారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. సెప్టెంబ‌ర్ 16న మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    ‘రంగరంగ వైభవంగా’ ట్రైలర్ విడుదల

    పంజా వైష్ణవ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన మూవీ ‘రంగరంగ వైభవంగా’. అయితే ఈ మూవీ ట్రైలర్ తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్ మొత్తం ఎంటర్‌టైనింగ్‌గా, జాలీగా సాగిపోతుంది. కామెడీ సీన్స్, డీఎస్పీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. కాగా ఈ మూవీని సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    ‘కోబ్రా’ తెలుగు టీజర్ విడుదల

    చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి జంటగా అజయ్ జ్ఞాన్ ముత్తు తెరకెక్కిస్తున్న మూవీ ‘కోబ్రా’. ఆగష్టు 31వ తేదీన విడుదలకానున్న ఈ మూవీ తెలుగు టీజర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌లోని సన్నివేశాలు, BGM, విక్రమ్ యాక్టింగ్ ఆకట్టుకుంటున్నాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో స్టార్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటించాడు.

    ‘లైగ‌ర్‌’పై ఫ‌న్నీ ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేసిన విజ‌య్‌

    విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగ‌ర్’ మూవీ ఆగ‌స్ట్ 25న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా యాంక‌ర్ సుమ లైగ‌ర్ టీమ్‌ను ఇంట‌ర్వ్యూ చేసింది. ఇందులో లైగ‌ర్ పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్, సాంగ్స్‌కు వ‌చ్చిన రెస్పాన్స్‌, ట్రోల్స్ కొన్నింటిని చూపించింది. దీంతో వాటిని చూసి విజ‌య్‌తో పాటు అన‌న్య‌, ఛార్మి, పూరీ ప‌డిప‌డి న‌వ్వుకున్నారు. ఈ ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

    శాకిని డాకిని మూవీ టీజర్ రిలీజ్

    హీరోయిన్లు నివేత థామస్, రెజినా యాక్ట్ చేసిన శాకిని డాకిని మూవీ నుంచి టీజర్ విడుదలైంది. వీడియోలో ఇద్దరు హీరోయిన్లు ఆర్మీ ట్రైనింగ్ తీసుకునే విధానం ఫన్నీగా చూపించారు. మరోవైపు ఫైట్స్, థ్రిల్లర్ యాంగిల్ కూడా సినిమాపై మరింత ఉత్కంఠ రేపుతుంది. ఈ మూవీకి సుదీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, డి.సురేష్ బాబు, సునీత తాటి, థామస్ నిర్మాతాలుగా వ్యవహరిస్తున్నారు.

    ‘లైగర్’ ఫ్యాన్‌డమ్ ఢిల్లీ టూర్ వీడియో

    ‘లైగర్’ మూవీ ప్రమోషన్స్‌లో ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం నిన్న ఢిల్లీలో ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఫ్యాన్స్‌ కేరింతలతో విజయ్ స్పీచ్‌తో ఉన్న ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆగష్టు 25వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

    నేడు ప్రారంభ‌మైన ‘పుష్ప‌2’ షూటింగ్‌

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న ‘పుష్ప‌-ది రూల్’ సినిమా నేడు పూజాకార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. డైరెక్ట‌ర్ సుకుమార్‌తో పాటు నిర్మాత‌లు, ఇత‌ర చిత్ర‌బృందం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సెప్టెంబ‌ర్ రెండో వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దేశ‌వ్యాప్తంగా సినీప్రేమికులు ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. మొద‌టి భాగం ఘ‌న విజ‌యం సాదించ‌డంతో పుష్ప‌2పై ఇప్పుడు భారీ అంచ‌నాలు ఉన్నాయి. ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.