• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకట్టుకుంటున్న ‘హైవే’ టీజర్

    ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘హైవే’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్, హీరో హీరోయిన్ సీన్స్ బాగున్నాయి. ఆగష్టు 19వ తేదీ నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

    ఫ్యాన్స్‌తో క‌లిసి ఒక్క‌డు సినిమా చూసిన భూమిక‌

    సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నేడు ఒక్క‌డు, పోకిరి సినిమాలు స్పెష‌ల్ షోలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఒక్క‌డు సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన భూమిక ఫ్యాన్స్‌తో క‌లిసి ఆ సినిమాను నేడు మ‌రోసారి థియేట‌ర్ల‌లో చూసింది. ఆమెతో పాటు డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ కూడా ఉన్నాడు. 2003లో వ‌చ్చిన ఈ సినిమాకు ఇప్ప‌టికీ క్రేజ్ త‌గ్గ‌లేదు. సినిమా చూస్తూ ఫ్యాన్స్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్నారు.

    ప్రేక్ష‌కుల‌కు లేఖ‌తో థ్యాంక్స్ చెప్పిన ‘సీతా రామం’ ద‌ర్శ‌కుడు

    ‘సీతా రామం’ సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో చిత్ర‌బృందం చాలా సంతోషంగా ఉన్నారు. తెలుగు ప్రేక్ష‌కులు త‌న‌ను ఇంత‌గా ప్రేమిస్తున్నందుకు దుల్క‌ర్ స‌ల్మాన్ కృత‌జ్బ‌త‌లు చెప్తూ ఒక లెట‌ర్ పోస్ట్ చేశాడు. తాజాగా ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కూడా ప్రేక్ష‌కుల‌ను ఉద్దేశించి ఒక లేఖ‌ను రాశాడు. ‘సినిమా క‌థను ఒక్క‌రే రాసుకోవ‌చ్చు. కానీ అనుకున్న క‌థ తెర‌పైకి రావాలంటే 24 క్రాఫ్ట్స్ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి. ఈ సినిమాకు ప‌నిచేసిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. నిర్మాణంలో ఎక్క‌డా లోటు లేకుండా అడిగిన‌వ‌న్నీ స‌మ‌కూర్చిన అశ్వినీద‌త్, వైజ‌యంతీ మూవీస్‌కు … Read more

    ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మేకింగ్ వీడియో

    నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మూవీ ఆగ‌స్ట్ 12న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. క్యాథ‌రిన్, కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా న‌టించారు. అయితే తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. యాక్ష‌న్ సీన్ల‌కు సంబంధించిన షూటింగ్, డ్యాన్స్ ప్రాక్టీస్ వంటివి ఇందులో చూడ‌వ‌చ్చు. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర పోషించాడు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్, పాట‌లు మూవీపై అంచ‌నాల‌ను పెంచుతున్నాయి.

    కార్తికేయ 2 మూవీ మిస్టికల్ టెస్ట్ కాంటెస్ట్

    కార్తికేయ 2 మూవీని చిత్ర బృందం వినూత్నంగా ప్రమోట్ చేస్తుంది. మిస్టికల్ టెస్ట్ పేరుతో నిర్వహించిన పోటీలో విజేతలకు రూ.6 లక్షల విలువైన ప్రైజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్లో మొదటి క్లూను రిలీజ్ చేశారు. తాజాగా విశాఖలో మరో క్లూను ప్రకటించారు. ఈ క్లూస్ ద్వారా జవాబు కనుగొనాలని చెబుతు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రం ఆగస్టు 13న రిలీజ్ కానుంది. Vizag.. here is the Karthikeya Quest Clue Get … Read more

    ట్రెండింగ్ తెలుగు సాంగ్‌కు ధ‌న‌శ్రీ వ‌ర్మ డ్యాన్స్

    ఇండియ‌న్ క్రికెట‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ భార్య ధ‌న‌శ్రీ వ‌ర్మ ప్రొఫెష‌న‌ల్ డ్యాన్స‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. ట్రెండింగ్ పాట‌ల‌కు ఆమె డ్యాన్స్ చేస్తూ సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా నితిన్ హీరోగా న‌టించిన మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం మూవీ నుంచి రాను రాను అంటూనే చిన్న‌దో పాట నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ పాట‌కు ధ‌న‌శ్రీ వ‌ర్మ డ్యాన్స్ చేసి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ, హీరో నితిన్‌ను కూడా ట్యాగ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

    స‌క్సెస్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్న‌ ‘బింబిసార’ టీమ్‌

    నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన ‘బింబిసార’ మూవీ భారీ విజ‌యం సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా మంచి వ‌సూళ్ల‌ను కురిపిస్తుంది. ఇప్ప‌టికే బ్రేక్‌-ఈవెన్ సాధించి లాభాల బాట ప‌ట్టిన ఈ సినిమా నిర్మాత‌ల‌తో పాటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు సంతోషాన్ని మిగిల్చింది. దీంతో చిత్ర‌బృందం తాజాగా కేక్ క‌ట్‌చేసి గ్రాండ్‌గా స‌క్సెస్‌ను సెల‌బ్రేట్ చేసుకుంది. బింబిసార‌కు వ‌శిష్ఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కేథ‌రిన్‌, సంయుక్త మీన‌న్ హీర‌రోయిన్లుగా న‌టించారు. కీర‌వాణి మ్యూజిక్ అందించాడు.

    రూ.25 కోట్లు వ‌సూలు చేసిన ‘సీతా రామం’

    ‘సీతారామం’ మూవీ ఆగ‌స్ట్ 5న థియేట‌ర్ల‌లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల్లో ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.25 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు చేసింది. అంద‌మైన ఈ ప్రేమ కావ్యానికి ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. తెలుగులో ఇలాంటి స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ చూసి చాలాకాలం అవుతుంద‌ని చెప్తున్నారు. మొద‌టిరోజు కంటే రెండో రోజు, మూడో రోజు ఎక్కువ క‌లెక్ష‌న్లు రావ‌డం విశేషం. సినిమాకు మంచి స్పంద‌న రావ‌డంతో దేశ, విదేశాల్లో భారీగా వ‌సూళ్లు రాబ‌డుతుంది. దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్, ర‌ష్మిక‌తో పాటు డైరెక్ట‌ర్ హ‌ను … Read more

    ‘బింబిసార’ ర్యాప్ సాంగ్ రిలీజ్

    నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన ‘బింబిసార’ మూవీ థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా న‌డుస్తోంది. క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే అత్యంత వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కేవ‌లం అమెరికాలోనే ఇప్ప‌టివ‌ర‌కు 350కె డాల‌ర్లు సాధించింది. తాజాగా మూవీ నుంచి ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు. ఎం.ఎం కీర‌వాణి మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను లిప్సిక‌, పృథ్వీ చంద్ర‌, ఆదిత్య అయ్యంగార్ క‌లిసి పాడారు. యాక్ష‌న్ స‌న్నివేశాలు, డైలాగ్స్‌ను క‌లిపి చేసిన ఈ ర్యాప్‌సాంగ్ అద‌ర‌గొడుతుంది. మీరూ ఓ లుక్కేయండి.

    నాగార్జున ‘ది ఘోస్ట్’ షూటింగ్ పూర్తి

    కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ‘ది ఘోస్ట్’ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సోనాల్ చౌహాన్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే ఈ మూవీ షూటింగ్ నేటితో పూర్త‌యిన‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ పనులు వేగంగా పూర్తిచేసి అక్టోబ‌ర్ 5న సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వీడియోను చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. IT'S A WRAP for the Shoot! #Ghost ? The … Read more