• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాగార్జున ‘ది ఘోస్ట్’ షూటింగ్ పూర్తి

    కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ‘ది ఘోస్ట్’ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సోనాల్ చౌహాన్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే ఈ మూవీ షూటింగ్ నేటితో పూర్త‌యిన‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ పనులు వేగంగా పూర్తిచేసి అక్టోబ‌ర్ 5న సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వీడియోను చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. IT'S A WRAP for the Shoot! #Ghost ? The … Read more

    ఆది సాయికుమార్ ‘తీస్ మార్ ఖాన్’ ట్రైల‌ర్ విడుద‌ల

    ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తున్న ‘తీస్ మార్ ఖాన్’ మూవీ ట్రైల‌ర్ నేడు రిలీజ్ అయింది. పూర్తి యాక్ష‌న్‌తో కూడిని ఈ చిత్రాన్ని క‌ళ్యాణ్‌జీ గొగాన తెర‌కెక్కిస్తున్నాడు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ మూడు షేడ్స్ ఉన్న పాత్ర‌లో ఆది క‌నిపించ‌నున్నాడు. పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఆమె ఈ సినిమాలో మ‌రోసారి అందాల ఆర‌బోత‌లో, రొమాన్స్‌లో రెచ్చిపోయింది. ఒక సునీల్, పూర్ణ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సాయికార్తిక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆగ‌స్ట్ 19న మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    ఆ ముగ్గురు కలిస్తేనే సినిమాకు విజయం: దిల్ రాజు

    బింబిసార విజయం తెలుగు సినిమాకు తిరిగి ఊపిరిపోసిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా తర్వాత తెలుగు సినిమా కష్టాల్లో పడిందని అన్నారు. థియేటర్లకు తిరిగి కళ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి విజయం రావడం చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. ఏ సినిమాకైనా డైరెక్టర్, హీరో, నిర్మాత చక్కగా కలిస్తే సినిమా అద్భుత విజయం సాధిస్తుందని బింబిసార మరోసారి నిరూపించిందని దిల్ రాజ్ పేర్కొన్నారు.

    ఆకట్టుకుంటున్న ‘ప్రేమదేశం’ టీజర్

    మేఘా ఆకాష్, త్రిగుణ్, అజయ్ కతుర్వార్, మాయ, మధుబాల ప్రధాన పాత్రలో శ్రీకాంత్ సిద్ధం తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమదేశం’. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటుంది. ఈ టీజర్‌లో నటీ నటుల మధ్య వచ్చే లవ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని శిరీషం సిద్ధం నిర్మిస్తున్నారు.

    ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావ

    పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన లీగర్ మూవీ ఈనెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోన్లలో జోరు పెంచింది. అందులో భాగంగానే పాట్నాలో ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. తాజాగా AN కాలేజీ‌లో విజయ్ అనన్య ప్రమోషన్స్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి భారీగా విద్యార్థులు తరలివచ్చారు. లైగర్, లైగర్ అంటూ అరవసాగారు. దీంతో నెటిజన్స్ ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. … Read more

    నితిన్ ‘పోరి సూపరో’ సాంగ్ విడుదల

    నితిన్, కృతిశెట్టి జంటగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘పోరి సూపరో’ అనే సాంగ్ విడుదలైంది. క్యాచీ ట్యూన్స్, నితిన్, కృతిశెట్టి డ్యాన్స్ ఈ సాంగ్‌లో ఆకట్టుకుంటున్నాయి. ఆగష్టు 12వ తేదీన విడుదల కానున్న ఈ మూవీని శేఖర్ తెరకెక్కించారు. నితిన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

    సూపర్ ట్రైలర్ అదిరిపోయింది

    నిఖిల్ సిద్దార్థ్, చందు మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కార్తికేయ 2’ ట్రైలర్ నేడు విడుదలైంది. ‘కార్తికేయ’ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ థ్రిల్లింగ్ సన్నివేశాలు, విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఆగష్టు 13వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలో నటించారు.

    ‘బ్ర‌హ్మాస్త’ కోసం ప‌దేళ్లు కేటాయించిన ద‌ర్శ‌కుడు

    ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్, అమితాబ్, నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ ‘బ్ర‌హ్మాస్త్ర‌’. ఈ సినిమా మొద‌టిభాగం సెప్టెంబ‌ర్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తాజాగా ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ బ్ర‌హ్మాస్త్ర జ‌ర్నీ ఎలా ప్రారంభ‌మైందో ప్రేక్షకుల‌తో షేర్ చేసుకున్నాడు. ఈ మూవీ చేయాల‌ని అయాన్‌కు 2011లోనే ఆలోచ‌న వ‌చ్చింద‌ట‌. కానీ తాను అనుకున్న విజ‌న్‌కు అప్ప‌ట్లో సినిమా బ‌డ్జెట్లు త‌క్కువ‌. వీఎఫ్ఎక్స్ టెక్నాల‌జీ ఇండియాలో అప్ప‌ట్లో ఇంత‌గా అందుబాటులో లేదు. అయితే తన‌ ఆలోచ‌న‌కు మాత్రం ప‌దునుపెడుతూ అయాన్ ఈ సినిమాపై … Read more

    క‌ళాపురం.. ఇక్క‌డ అంద‌రూ క‌ళాకారులే

    ‘క‌ళాపురం’ మూవీ టీజ‌ర్ నేడు విడుద‌ల అయింది. స‌త్యం రాజేశ్, చిత్రంశ్రీను త‌దిత‌రులు ఇందులో న‌టిస్తున్నారు. క‌రుణ కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌ళాపురం అనే గ్రామంలో సాగే పూర్తిస్థాయి ఎంట‌ర్‌టైనింగ్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 26న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. మ‌ణిశ‌ర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. జీ స్టూడియోస్, ఆర్‌4 మూవీస్ దీన్ని నిర్మిస్తున్నాయి.

    గ్రాడ్యుయేట్ చాయ్‌వాలీతో ‘లైగ‌ర్’ ముచ్చ‌ట్లు

    విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగ‌ర్’ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా దేశ‌మంతా చుట్టేస్తున్నాడు. తాజాగా పాట్నాలో ఫేమ‌స్ అయిన ‘గ్రాడ్యుయేట్ చాయ్‌వాలీ’ బండి ద‌గ్గ‌రికి వెళ్లాడు. ఆమెతో కాసేపు మాట్లాడి సినిమా గురించి విశేషాల‌ను పంచుకున్నాడు. ఇటీవ‌ల ముంబ‌యి వీధుల్లో, లోక‌ల్ ట్రైన్స్‌లో తిరుగుతూ ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఎలాగైనా ప్ర‌తి ఒక్క‌రికి సినిమా గురించి తెలియ‌జేయాల‌ని విజ‌య్ సాయ‌శ‌క్తులా క‌ష్ట‌ప‌డుతున్నాడు.