• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అతి పిన్న స్వాతంత్రోద్యమకారుడు ‘ఖుదీరాం బోస్’పై సినిమా

    దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన వారిలో ఖుదీరా బోస్ ఒకరు. తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా అతి చిన్న వయసులోనే పోరాడి 18 ఏళ్లకే ఉరి శిక్ష పాలైన వీరుడు. అటువంటి గొప్ప ఉద్యమ కారుడిపై ‘ఖుదీరాం బోస్’ పేరిట సినిమా రాబోతోంది. విద్యాసాగర్ రాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 15న వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.

    రాఖీ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. తన తర్వాతి చిత్రం ‘భోళా శంకర్’ ద్వారా చిన్న వీడియోతో చిరు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో చిరు సోదరిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ‘అక్కా చెల్లెల్లందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు ప్రేమతో మీ సోదరుడు చిరంజీవి’ అంటూ ఆయన మాటల్లో చెప్పారు. భోళా శంకర్ సినిమాను మెహెర్ రమేశ్ తెరకెక్కిస్తుండగా, AK ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

    అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా ట్విట్టర్ రివ్యూ

    బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత హిందీలో ఓ మంచి సినిమా చూశామని ప్రేక్షకులు ట్వీట్లు చేస్తున్నారు. సినిమా అన్ని విధాలుగా నచ్చిందని అంటున్నారు. అద్వైత్ చందన్ డైరెక్షన్ సూపర్ అని, ఈ సినిమాలో కామెడీ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం అమీర్ ఖాన్ కే దక్కుతుందని, కరీనా కపూర్ తో కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెబుతున్నారు. ఫ్లాప్ సినిమాలతో డీలా పడిన బాలీవుడ్ … Read more

    కార్తికేయ టీం విజయవాడ టూర్ హైలైట్స్

    నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి తెరకెక్కించిన సినిమా ‘కార్తికేయ 2’. ఆగష్టు 13వ తేదీన విడుదల కానున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. దాని తగ్గట్టే చిత్రబృందం ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అందులో భాగంగానే విజయవాడలో ప్రమోషన్ నిర్వహించింది. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. Highlights from #Karthikeya2 team visit at Vijayawada! The … Read more

    ‘విక్కీ ది రాక్ స్టార్’ నుంచి రెవల్యూషన్ షేడ్ వీడియో

    స్టూడియో 87 బ్యానర్‌పై విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ ‘విక్కీ ది రాక్ స్టార్’. తాజాగా ఈ మూవీ నుంచి రెవల్యూషన్ షేడ్ అనే వీడియో ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో అమృత చౌదరి చెప్తున్న పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

    వినరా సోదరా వీర కుమారా అంటున్న హీరో నిఖిల్

    కార్తీకేయ 2 మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం వినూత్నంగా ప్రచారం చేస్తుంది. తాజాగా వినరా సోదరా వీర కుమారా.. తందనా తానా అంటు ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ మూవీ ఆగస్టు 13న థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఈ చిత్రానికి చందు మొండేటీ దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. Adhi matter-u! ?#Karthikeya2 releasing on August 13th … Read more

    అన్నా చెల్లెల్ల ప్రేమతో నిండిన కథ ‘ రక్షా బంధన్’

    అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రేపు విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం రక్షా బంధన్. అన్నా చెల్లెల్ల అనుబంధాన్ని చూపెడుతూ ఈ సినిమా తీశారు. మంచి కథలతో నిత్యం ప్రేక్షకుల ముందుకు వచ్చే అక్షయ్ కుమార్ ఈ సారి మరో భావోద్వేగాలున్న పాత్రలో మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రతి ఒక్కరూ తమ సినిమా చూడాలని అక్షయ్ ప్రేక్షకులను కోరాడు.

    RRRలో హనుమాన్ గా ఎన్టీఆర్..క్రేజీ వీడియో

    ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కు హనుమాన్ క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది. అచ్చం అలాగే కుదిరిన కొన్ని సీన్లతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ క్రేజీ వీడియో రూపొందించారు. బ్యాగ్ గ్రౌండ్ వాయిస్ కు తగినట్లుగా సీన్లను ఎడిట్ చేసి ఔరా అనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం చక్కర్లు కోడుతుంది. మీరు కూడా Watch on twitter గుర్తుపై క్లిక్ చేసి ఈ వీడియోపై లుక్కేయండి మరి. Bheem X Hanuman ???@tarak9999#ManOfMassesNTR pic.twitter.com/kjP1NLUEBz — NTR EDITS … Read more

    అదిరిన ‘లైగర్’ జంట

    పూరీ,విజయ్ క్రేజీ కాంబినేషన్లో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘లైగర్’. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్ షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా ముంబైలో నిన్న సినిమా ప్రచారం చేశారు. అయితే కార్యక్రమానికి ముందు ఆన్ స్క్రీన్ జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండేతో పాటు రమ్యకృష్ణ ఫోటోలకు ఫోజులిచ్చారు. పులి చర్మం లాంటి చొక్కాలో విజయ్, ఎల్లో కలర్ స్కర్ట్ లో అనన్య, చీరలో అలనాటి తార మెరిశారు. ఆగస్ట్ 14న వరంగల్, ఆగస్ట్ 15న హైదరాబాద్లో చిత్రబృందం సందడి చేయనుంది. … Read more

    సుదర్శన్ థియేటర్ వద్ద పోకిరి సందడి

    సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పోకిరి’ సినిమా క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా స్పెషల్ షోస్ వేశారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమాకి అభిమానులు డప్పులు వాయిస్తూ సందడి చేస్తూ వెళ్లారు. కొత్త సినిమా విడుదలకు ఉండే హంగామా చేశారు. ప్రస్తుతం సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. #Pokiri storm @ … Read more