• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మొదటి ట్వీట్‌కే లైకుల వర్షం

    ట్విట్టర్‌లోకి అడుగుపెట్టిన తమిళ స్టార్ హీరో విక్రమ్‌కు అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యాన్స్‌ను పలకరిస్తూ ఇకపై ఇక్కడే ముచ్చట్లు చెప్పుకుందాం అంటూ విక్రమ్‌ పోస్ట్‌ చేసిన వీడియోకు క్రేజీ స్పందన వస్తోంది. ప్రస్తుతం విక్రమ్‌ నుంచి కోబ్రా చిత్రం రాబోతోంది. ఆగస్ట్ 15న సినిమా ట్రైలర్ వస్తుండగా…ఈ నెల చివరిలో సినిమా విడుదల చేసే అవకాశముంది. అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ గణితవేత్తగా కనిపించనున్నారు. [వీడియో ](url) pic.twitter.com/G7Cl2BmhNg — Vikram (@chiyaan) August 12, 2022

    ‘రారా ర‌క్క‌మ్మ’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

    కిచ్చా సుదీప్ హీరోగా న‌టించిన ‘విక్రాంత్ రోణ’ మూవీ ఇటీవ‌ల విడుదలై భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. క‌న్న‌డ‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ మూవీలో ఉన్న‌ ‘రారా ర‌క్క‌మ్మ’ సాంగ్ సోష‌ల్‌మీడియాలో ర‌చ్చచేసింది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో క‌లిసి సుదీప్ వేసిన స్టెప్పులు అల‌రించాయి. అయితే ఇప్పుడు రారా ర‌క్క‌మ్మ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. మ‌రి ఈ పాట‌ను చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.

    ‘లైగ‌ర్’ Coka 2.0 సాంగ్ అదిరిపోయింది

    ‘లైగ‌ర్’ మూవీ నుంచి Coka 2.0 సాంగ్ రిలీజ్ అయింది. విజ‌య్ అన‌న్య డ్యాన్స్‌తో పాటు క్యూట్ లుక్స్‌తో అల‌రించారు. రామ్ మిరియాలా, గీతా మాదురి క‌లిసి ఈ పాట‌ను ఆల‌పించారు. జానీ, లిజో జార్జ్, డీజే చేటాస్ ఈ పాట‌కు మ్యూజిక్ అందించారు. ఈ పాట కూడా యూట్యూబ్‌లో ర‌చ్చ చేయ‌బోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. లైగ‌ర్ మూవీ ఆగ‌స్ట్ 25న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. నేడు చిత్ర‌బృందం చండీగ‌ఢ్‌లో ప‌ర్య‌టిస్తుంది.

    ‘ఓం శ్రీ క‌న‌క‌దుర్గ’ పాన్ఇండియా మూవీ గ్లింప్స్ రిలీజ్

    వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, మేఘ ఆకాశ్, సుమంత్ శైలేంద్ర కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్న ‘ఓం శ్రీ క‌న‌క‌దుర్గ’ మూవీ గ్లింప్స్ నేడు రిలీజ్ చేశారు. మంచికి, చెడుకి..ప్రేమ‌కు, భ‌యానికి జ‌రిగే యుద్ధ‌మే ఈ క‌థ అని తెలుస్తుంది. షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. లంక శ‌శిధ‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పాన్ఇండియా మూవీగా ఇది తెర‌కెక్కుతుంది. నెక్స్‌జెన్ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.

    ఉత్కంఠ రేపుతున్న కార్తికేయ 2 మేకింగ్ వీడియో

    హీరో నిఖిల్ కార్తికేయ 2 మూవీ నుంచి మేకింగ్ వీడియో విడుదలైంది. రేపు ఈ చిత్రం రిలీజ్ కానుండగా ఈ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు, మరోవైపు మంచు, సముద్రంలో డాల్ఫిన్లతో వీడియో ఉత్కంఠ రేపుతోంది. ఇంకోవైపు ఎగిసిపడుతున్న మంట, ఎగరిపోతున్న నెమలి కూడా ఈ చిత్రంపై క్రేజ్ ని పెంచుతున్నాయి. ఈ చిత్రానికి చందు మొండేటీ దర్శకత్వం వహించగా, నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసింది.

    నెట్టింట్లో ర‌చ్చ‌చేస్తున్న ‘లైగ‌ర్’ ఆంథెమ్

    ప్ర‌ముఖ సింగ‌ర్ నిఖిలేష్ కుమార్ ‘లైగ‌ర్’ టీమ్‌కు అంకితం ఇస్తూ లైగ‌ర్‌ ఆంథెమ్ సాంగ్‌ను రిలీజ్ చేశాడు. ఈ పాట బాలీవుడ్‌లో ర‌చ్చ చేస్ఉంది. ముంబై వీధులలో చాయ్ వాలాగా ఉన్న ఒక చిన్న కుర్రాడు బాక్సార్‏గా ఎలా మారాడు. దానికోసం ఎలాంటి శిక్ష‌ణ తీసుకున్నాడు అని ఈ పాట‌లో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్‌లో బాక్స‌ర్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విడ‌దులైన ట్రైల‌ర్‌, పాట‌ల‌కు భారీ స్పంద‌న ల‌భిస్తుంది. లైగ‌ర్ ఆగ‌స్ట్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

    నార్త్‌లో విజ‌య్ క్రేజ్ మామూలుగా లేదుగా!

    ‘లైగ‌ర్’ టీమ్‌కు ఎక్క‌డికి వెళ్లినా భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తుండం విశేషం. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా టీమ్ ప్ర‌ధాన న‌గ‌రాల‌న్నింటినీ చుట్టేస్తుంది. అయితే విజ‌య్‌, అన‌న్య ఎక్క‌డికి వెళ్లినా వేల‌కొద్ది ఫ్యాన్స్ వ‌చ్చి సంద‌డి చేస్తున్నారు. ఇది ఇండ‌స్ట్రీకి చాలా ఆశ్ఛ‌ర్యం క‌లిగిస్తుంది. ఎందుకంటే లైగ‌ర్ విజ‌య్ చేస్తున్న మొద‌టి పాన్ ఇండియా మూవీ. కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ కాక‌ముందే ఇంత‌మంది ఫ్యాన్స్ వారికోసం రావ‌డం విశేషం. నిన్న పుణెలో విజ‌య్‌, అన‌న్య ఒక షాపింగ్ మాల్‌లో సంద‌డి చేశారు. వారిని చూసేందుకు … Read more

    ‘మాచర్ల నియోజకవర్గం’ టీంతో సుమ ఇంటర్వ్యూ

    నితిన్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. రేపు(ఆగష్టు 12న) విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ యూనిట్ ప్రమోషనల్ జోరు పెంచేసింది. తాజాగా స్టార్ యాంకర్ సుమతో ఇంటర్వ్యూ నిర్వహించింది. ‘సుమ క్రాక్స్ మాచర్ల నియోజకవర్గం’ పేరుతో నిర్వహించిన ఈ ప్రమోషన్ వైరల్ అవుతుంది.

    NBK108 అఫీషియల్ అనౌన్స్‌మెంట్

    నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గరికపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఈ సినిమాలో బాలయ్యను ఎప్పుడూ చూడని విధంగా చూపిస్తామని మూవీ యూనిట్ పేర్కొంది.

    ‘మీకు చిన్న థాంక్యూ సరిపోదు’ మృనాల్ క్యూట్ స్పీచ్

    ‘సీతారామం’ సక్సెస్‌తో చిత్రబృందం ఆనందోత్సాహాల్లో మునిగితేలుతోంది. ఇవాళ మరోసారి చిత్రబృందం సక్సెస్‌ మీట్ నిర్వహించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ మృనాల్ ఠాకూర్ మాట్లాడుతూ ‘మీరు కరిపిస్తున్న ప్రేమకు ఒక్క మాటల్లో కృతజ్ఞతలు చెప్పలేను. సినిమాను ఒకటికి రెండు సార్లు చూస్తున్న అభిమానులకు మీ సీత నుంచి కృతజ్ఞతలు’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.