• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కార్తికేయ2 విమర్శలపై దిల్‌ రాజు క్లారిటీ

    కార్తికేయ సినిమా రిలీజ్‌కు అడ్డుపడుతూ ఇబ్బంది పెట్టారని ప్రముఖ నిర్మాత దిల్‌రాజుపై వచ్చిన ఆరోపణలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘ థ్యాంక్యూ సినిమా కోసం నేనే జూలై 22 డేట్ అడిగాను. మా మధ్య క్లాషెస్ ఉంటాయి. కానీ మా మాధ్య ఏదో సమస్య ఉందని క్రియేట్ చేస్తున్నారు.’ అనుకోకుండా జరిగిన పరిణామాల వల్ల మాత్రమే కార్తికేయ-2 వాయిదా పడిందని చెప్పారు. ‘ ఇక్కడ సినిమా ఆడితే మేం ఆనందపడతాం. మా ఇంకో సినిమాకు అది ఊపిరి పోస్తుంది. మీ సబ్‌స్క్రైబర్లు పెంచుకునేందుకు మమ్మల్ని … Read more

    రామ్ మిరియాల ఇండిపెండెన్స్‌ డే సాంగ్

    ‘ఊరెళ్లిపోతా మామా’ మొదలుకుని రామ్‌ మిరియాల నుంచి ఏ పాట వచ్చినా సంగీత అభిమానులను అలరిస్తోంది. విభిన్న గాత్రంతో సామాన్యుల పరిస్థితులపై రామ్‌ మిరియాల చేసే పాటలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘జెండా వందనం’ పాట విడుదల చేశారు. ఎన్ని కష్టాలొచ్చినా జనగణమణ పాడుదాం, జెండాకు సెల్యూట్‌ చేద్దామంటూ సాగే పాట చాలా అద్భుతంగా ఉంది.

    విజయ్ ఆంటోనీ ‘హత్య’ ట్రైలర్‌ విడుదల

    బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత విజయ్ ఆంటోనీ నుంచి వచ్చిన ఇతర సినిమాలపైనా తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘హత్య’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలాజీ కె కుమార్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ‘గురు’ ఫేమ్ రితికా సింగ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

    ఏప్రిల్‌లో మొదలు కాబోతున్న ఎన్టీఆర్‌31

    కేజీఎఫ్‌ బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నవిషయం తెలిసిందే. అయితే సినిమాపై తాజాగా ప్రశాంత్‌ నీల్‌ క్రేజీ అప్డేట్‌ ఇచ్చాడు. ఏప్రిల్‌, మే నెలలో సినిమా షూటింగ్‌ ప్రారంభించబోతున్నామని తెలిపాడు. ఎన్టీఆర్‌ సినిమా మీడియా ప్రశ్నించగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ’ ఏం చెప్పాలి కథ చెప్పాలా?, ఏప్రిల్‌, మేలో సినిమా ప్రారంభించబోతున్నాం అని స్పష్టం చేశాడు. ఎన్టీఆర్‌ తర్వాతి చిత్రం కొరటాల శివతో ఉంది. అది కూడా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. [ప్రశాంత్‌ నీల్‌ వీడియో](url) BLOCKBUSTER … Read more

    యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న కళాపురం ట్రైలర్

    పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలు తెరకెక్కించిన కరుణాకర్ ‘కళాపురం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది. సుమారు 1 మిలియన్‌కు పైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది.

    ఒకే ఒక జీవితం మూవీ నుంచి సాంగ్ ప్రొమో

    హీరో శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం మూవీ నుంచి సాంగ్ ప్రొమో రిలీజ్ అయింది. మూవీ మ్యూజిక్ నేపథ్యంగా సాగుతున్నట్లు తెలిసింది. శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్‌గా నటించింది. శర్వానంద్‌తో పాటు వెన్నెల కిశోర్, ప్రియదర్శి, ఆమల నాగార్జున ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    సీతారామం ‘ఎప్పుడో నిన్ను’ ఫుల్ వీడియో సాంగ్

    దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ మూవీ నుంచి ‘ఎప్పుడో నిన్ను’ ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్‌లో మ్యూజిక్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 5వ తేదీన విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే మంచి టాక్, కలెక్షన్స్‌తో దూసుకెళ్లిపోతుంది.

    కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘న‌చ్చావ్ అబ్బాయ్’ సాంగ్ రిలీజ్

    కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్న ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ అయింది. న‌చ్చావ్ అబ్బాయ్ అనే ఈ పాట ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. మ‌ణిశ‌ర్మ దీనికి మ్యూజిక్ అందించ‌గా..ధ‌నుంజ‌య్, లిప్సిక క‌లిసి పాడారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం స‌ర‌స‌న సంజ‌నా ఆనంద్, సోనూ ఠాకూర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కోడి దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శ్రీధ‌ర్ గాడె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

    నచ్చావ్ అబ్బాయ్ సాంగ్ ప్రొమో

    కిరణ్ అబ్బవరం నటించిన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ మూవీ నుంచి నచ్చావ్ సాంగ్ ప్రొమో విడుదలైంది. రేపు ఉదయం 11గంటలకు ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ కానున్నట్ల మూమీ మేకర్స్ తెలిపార. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం సరసన సంజనా ఆనంద్ నటించింది. ఈ చిత్రాన్ని కోడి దివ్య నిర్మిస్తున్నారు. సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. Tomorrow at 11:05 ❤️ pic.twitter.com/V0DmkLpwzs — Sanjana Anand (@itssanjanaanand) August 13, 2022

    6 మిలియ‌న్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ‘లైగ‌ర్’ సాంగ్‌

    విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ‘లైగ‌ర్’ మూవీ నుంచి నిన్న COKA 2.0 సాంగ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ పాట‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇప్ప‌టికే 6 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్‌, 400K లైక్స్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది. అన‌న్య పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. మూవీ నుంచి వ‌స్తున్న ఒక్కొక్క అప్‌డేట్‌తో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. లైగ‌ర్ ఆగ‌స్ట్ 25న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.