• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సీతా రామం’ నుంచి కృష్ణుడి పాట రిలీజ్

    నేడు శ్రీకృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా ‘సీతా రామం’ మూవీ నుంచి త‌ర‌లి త‌ర‌లి అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. సీతా రామం మూవీ ఆగ‌స్ట్ 5న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్‌ల న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఈ సినిమాకు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ మ్యూజిక్ అందించాడు.

    ఫిల్మ్‌ చాంబర్‌ కీలక నిర్ణయాలు

    సినిమా పరిశ్రమ విషయంలో చర్చలు జరుపుతున్న ఫిిల్మ్‌ చాంబర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై సినిమా విడుదలైన 8 వారాల తర్వాతనే ఓటీటీ ఇచ్చేలా నిర్మాతలంతా కలిసి నిర్ణయించారు. థియేటర్‌, మల్టీప్లెక్స్‌లలో టికెట్లు, తిను బండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. అందుకు వారు అంగీకరించారని వెల్లడించారు. వీపీఎఫ్‌ ఛార్జీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వేతన సమస్యలపైనా దాదాపుగా తుది నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో షూటింగులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.

    మ‌హేశ్-త్రివిక్ర‌మ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

    త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్‌బాబు న‌టిస్తున్న SSMB28 సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఈరోజు ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 28, 2023న మూవీ రిలీజ్ కానున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ వార్త‌తో సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హారిక హాసిని క్రియేష‌న్స్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. The Reigning Superstar will arrive on … Read more

    న‌వీన్ చంద్ర ‘రిపీట్’ ట్రైల‌ర్ విడుద‌ల‌

    న‌వీన్ చంద్ర హీరోగా న‌టిస్తున్న ‘రిపీట్’ మూవీ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ సినిమాలో ఆయ‌న ఐపీఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఒక క్రైమ్ మిస్ట‌రీని ఛేదించే దిశ‌గా పోలీసాఫీస‌ర్ చేసే ప్ర‌య‌త్నాలు ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఆగ‌స్ట్ 25 నుంచి మూవీ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. న‌వీన్ చంద్ర వ‌రుస‌గా సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో బిజీగా మారాడు. ప్ర‌తి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ స‌రికొత్త పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. ఇటీవ‌ల హాట్‌స్టార్‌లో నవీన్ చంద్ర న‌టించిన ప‌రంప‌ర వెబ్‌సిరీస్‌కు మంచి విజ‌యం సాధించింది. https://youtube.com/watch?v=QsURblraGtE

    ధమాకా నుంచి జింతాక్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

    మాస్ మ‌హారాజ ర‌వితేజ యాక్ట్ చేసిన ధమాకా మూవీ నుంచి జింతాక్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. వీడియోలో రవితేజ సరసన హీరోయిన్ శ్రీలీల అదిరిపోయే స్టెప్పులేసింది. మంగ్లీ, భీమ్స్ సిసిరోలియో పాడిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ డాన్స్ అందించాడు. ఈ చిత్రానికి త్రినాధరావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

    ‘ది ఘోస్ట్’ నుంచి ప‌వ‌ర్‌ఫుల్ ప్రోమో రిలీజ్

    కింగ్ నాగార్జున హీరోగా న‌టిస్తున్న ‘ది ఘోస్ట్’ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ ప్రోమోను విడుద‌ల చేశారు. త‌మ‌హ‌గానే అనే ప‌వ‌ర్‌ఫుల్ ఆయుధాన్ని చూపించారు. త‌మ‌హ‌గానే అంటే విలువైన ఉక్కుతో చేసిన ఆయుధం అనే అర్థం. నాగార్జున వైల్డ్ లుక్‌లో ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్నాడు. సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కుడు. ఆగ‌స్ట్ 25న ది ఘోస్ట్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో సినిమా రిలీజ్ కానున్న‌ట్లు తెలుస్తుంది.

    తిరుప‌తి గొప్ప‌త‌నాన్ని చెప్పే సాంగ్ ‘మా తిరుప‌తి’ రిలీజ్

    ‘అలిపిరికి అల్లంత దూరంలో అనే సినిమా నుంచి మా తిరుప‌తి లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ అయింది. ఫ‌ణి క‌ళ్యాణ్ మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను ర‌మ్య బెహ్ర‌, శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ కలిసి ఆల‌పించారు. ఈ చిత్రంలో రావ‌ణ్ రెడ్డి, శ్రీ నికిత త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆనంద్.జె ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ పాట‌లో తిరుప‌తి వాతావ‌ర‌ణాన్ని ఆ గాలిలో ఉండే భ‌క్తిభావాన్ని వివ‌రించారు.

    మనసును మురిపించే రెహమాన్‌ పాట

    చియాన్‌ విక్రమ్‌ హీరోగా భారీ అంచనాలతో వస్తున్న చిత్రం ‘కోబ్రా’. ఇందులో విక్రమ్ 25 గెటప్‌లలో కనిపిస్తారని టాక్. మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అజయ్‌ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్‌. రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే పాటల విడుదలను కూడా ప్రారంభించారు. తాజాగా ‘తరంగిని’ తెలుగు లిరికల్ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. రెహమాన్‌ బాణీలతో వినసొంపుగా ఈ పాట ఆకట్టుకుంటోంది. ఆగస్టు 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ‘తీస్ మార్ ఖాన్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధూ స్పీచ్

    ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటించిన ‘తీస్ మార్ ఖాన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో ‘DJ టిల్లు’ మూవీ హీరో సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉందని, సినిమా చాల ఫ్రెష్‌గా కనిపిస్తుందన్నాడు. మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

    ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ స్పీచ్

    నిఖిల్, అనుపమ జంటగా నటించిన ‘కార్తికేయ 2’ మూవీ భారీ హిట్ సాధించింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటి, భారీ లాభాల దిశగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్‌లో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పాల్గొని మాట్లాడారు. ఈ మూవీ భారీ విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.