• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జవాన్‌ మూవీలో విజయ్ దళపతి?

    బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ మూవీ జవాన్‌లో తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఓ పాత్రలో యాక్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. షారుఖ్, విజయ్ కలిసి ఉన్న ఓ ఫొటో నెట్టింట వైరల్ కావడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ఆ పిక్ జవాన్ సెట్స్ నుంచి లీకైందని పలువురు చెబుతున్నారు. మరోవైపు అది నిజం కాదని, ఎవరో ఆ ఫొటోను మార్పింగ్ చేశారని ఇంకొంత మంది అంటున్నారు. ఈ అంశంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ మూవీకి … Read more

    ‘లైగర్’ జర్నీ వీడియో

    విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్‌లో వస్తున్న ‘లైగర్’ మూవీ రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ‘లైగర్’ జర్నీ వీడియోను విడుదల చేసింది. అందులో మూవీ గ్లింప్స్ విడుదల చేసినప్పటి నుంచి కోక సాంగ్ విడుదలైనప్పటి వరకు అభిమానుల హంగామా, రికార్డ్స్‌ను చూపించారు. అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్న ఈ మూవీకి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

    ‘ఫ‌స్ట్‌డే ఫ‌స్ట్‌షో’ ట్రైల‌ర్‌..మామూలు కామెడీ కాదు

    శ్రీకాంత్ రెడ్డి, సంచిత బ‌సు జంట‌గా న‌టించిన మూవీ ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ట్రైల‌ర్‌లో త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ ఖుషీ మూవీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో టిక్కెట్లు అడిగింద‌ని వాటిని సంపాదించేదుకు హీరో ప‌డే క‌ష్టాలు నవ్వు తెప్పిస్తున్నాయి. జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్ అనుదీప్ కేవీ ఈ సినిమాకు క‌థ‌ను అందించ‌గా..వంశీధ‌ర్ గౌడ్, ల‌క్ష్మీనారాయ‌ణ పుట్టంచెట్టి క‌లిసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాధ‌న్ మ్యూజిక అందించాడు. వెన్నెల కిశోర్, త‌ణికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ కామెడీ … Read more

    26న ‘ఒకే ఒక జీవితం’ నుంచి మూడో సాంగ్ విడుదల

    శర్వానంద్, రీతూవర్మ జంటగా, అక్కినేని అమల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. సెప్టెంబర్ 9వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ నుంచి ఈనెల 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు’మారిపోయే’ అంటూ సాగే మూడో సాంగ్ విడుదల కానుంది. ఈ సాంగ్‌ను ఓ పెద్ద హీరో పాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

    ‘కొత్త‌కొత్త‌గా’ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌

    అజ‌య్, విర్తి వాఘ‌ని జంట‌గా న‌టించిన ‘కొత్త‌కొత్త‌గా’ మూవీ ట్రైల‌ర్ నేడు రిలీజ్ అయింది. ల‌వ్‌, ఎమోష‌న్స్, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. ఒక అమ్మాయిన మ‌న‌స్పూర్తిగా ప్రేమించే అబ్బాయి, అన్నింటిని లైట్ తీసుకొని మ‌నం కేవ‌లం ఫ్రెండ్స్ అని చెప్పే ఒక మోడ్ర‌న్ అమ్మాయి మ‌ధ్య జ‌రిగే ల‌వ్‌స్టోరీ ఈ సినిమా క‌థ‌గా తెలుస్తుంది. హ‌నుమాన్ వాసంశెట్టి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అందించాడు. సెప్టెంబ‌ర్ 9న మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    ‘లైగ‌ర్’ సెట్‌లో బాల‌య్య సంద‌డి

    విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన పాన్ఇండియా మూవీ ‘లైగ‌ర్‌’. అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలో బాల‌కృష్ణ లైగ‌ర్ సెట్‌కు వ‌చ్చి సంద‌డి చేశారు. విజ‌య్‌తో పాటు చిత్ర‌బృందంతో మాట్లాడి అంద‌రిలో ఎన‌ర్జీని నింపారు. ఈ వీడియోను చిత్ర‌బృందం తాజాగా షేర్ చేసింది. లైగ‌ర్ మూవీ రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. పూరీ కనెక్ట్స్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ క‌లిసి దీన్ని నిర్మించాయి. ఇప్ప‌టికే సినిమాకు భారీగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. లైగ‌ర్ విజ‌యంపై చిత్ర‌బృందం చాలా న‌మ్మ‌కంగా … Read more

    ‘కార్తికేయ 2’లో చెప్పిన‌ట్లుగా కృష్ణుడి గురించి ఆధారాలు ఉన్నాయా?

    నిఖిల్ హీరోగా న‌టించిన ‘కార్తికేయ 2’ సినిమాలో కృష్ణుడి జ‌న‌నం, మ‌ర‌ణం, ద్వార‌క వంటి విష‌యాల గురించి వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం కృష్ణుడు అంటే రాధాకృష్ణ‌, అర్జునుడికి భ‌గ‌వ‌ద్గీత చెప్పి ముందుకు న‌డిపించ‌న ర‌థ‌సారధి వంటివే విన్నాం. కానీ కార్తికేయ 2లో కృష్ణుడు దేవుడి కంటే ఎక్కువ‌. కానీ అత‌డు భూమి మీదే జ‌న్మించి, మ‌ర‌ణించాడు. ఆ ఆన‌వాళ్లు ఇంకా ఉన్నాయ‌ని చెప్పారు. మ‌రి కార్తికేయ 2లో కృష్ణుడి గురించి చెప్పిన విష‌యాల్లో నిజ‌మెంత తెలియాలంటే ఈ వీడియో చూడండి.

    ట్రెండింగ్‌లో ‘రంగ‌రంగ వైభ‌వంగా’ ట్రైల‌ర్‌

    వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టించిన ‘రంగ‌రంగ వైభ‌వంగా’ మూవీ ట్రైల‌ర్ నిన్న రిలీజ్ చేశారు. దీనికి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. 24 గంట‌ల్లో 4 మిలియ‌న్ల డిజిట‌ల్ వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది. గ‌త రెండు సినిమాల్లో సీరియ‌స్ పాత్ర‌ల్లో క‌నిపించిన వైష్ణ‌వ్ ఇందులో ఎంట‌ర్‌టైనింగ్ పాత్ర‌లో అల‌రిస్తున్నాడు. కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు గిరీశాయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు. సెప్టెంబ‌ర్ 2న మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

    ‘విక్ర‌మ్ వేద’ టీజ‌ర్ రిలీజ్..అద‌ర‌గొట్టిన సైఫ్‌, హృతిక్

    బాలీవుడ్ హీరోలు సైఫ్ అలీఖాన్, హృతిక్ రోష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ ‘విక్ర‌మ్ వేద’ టీజ‌ర్ రిలీజ్ అయింది. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో సైఫ్‌, గ్యాంగ్‌స్ట‌ర్‌గా హృతిక్ న‌టించారు. టీజ‌ర్‌లో హృతిక్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. రాధికా ఆప్టే కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. త‌మిళ్‌లో మాధ‌వ‌న్, విజ‌య్‌సేతుప‌తి న‌టించిన సూప‌ర్‌హిట్ మూవీ విక్ర‌మ్ వేద రీమేక్‌గా దీన్ని తెర‌కెక్కించారు. ఆ సినిమా డైరెక్ట‌ర్లు పుష్క‌ర్, గాయ‌త్రి హిందీలో కూడా తెర‌కెక్కిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 30న విక్ర‌మ్ వేద‌ విడుద‌ల కానుంది.

    ‘శాకిని డాకిని’కి సూప‌ర్ రెస్పాన్స్

    నివేతా థామ‌స్, రెజీనా క‌సాండ్రా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ ‘శాకిని డాకిని’. ఈ సినిమా టీజ‌ర్‌ను నిన్న విడుద‌ల చేశారు. దీనికి 24 గంట‌ల్లోనే 2.5 మిలియ‌న్ల కంటే ఎక్కువ‌గా డిజిట‌ల్ వ్యూస్ రావ‌డం విశేషం. పోలీస్ అకాడ‌మీలో చేరిన ఇద్ద‌రు అమ్మాయిలు ఎప్పుడూ గొడ‌వ‌ప‌డుతుంటారు. కానీ వారికి స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు ఒక‌రికి ఒక‌రు తోడుగా ఎలా నిల‌బ‌డ్డారు అనేదే సినిమా క‌థ‌గా తెలుస్తుంది. సుధీర్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. శాకిని డాకిని సెప్టెంబ‌ర్ 16న … Read more