• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బింబిసార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఎన్‌టీఆర్ ఎమోష‌న‌ల్ స్పీచ్‌

    క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన‌ ‘బింబిసార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి శిల్ప‌క‌ళావేదిక‌లో ఘ‌నంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎన్‌టీఆర్ మాట్లాడుతూ..’ఈ మ‌ధ్య‌కాలంలో ఇండ‌స్ట్రీకి గ‌డ్డుకాలం. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డంలేద‌ని అంటున్నారు. కానీ నేను అవ‌న్నీ న‌మ్మ‌ను. అద్భుత‌మైన సినిమాలు చేస్తే క‌చ్చితంగా ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు వ‌స్తారు. బింబిసార చిత్రం అటువంటిదే. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ బింబిసార‌కు మందు..త‌ర్వాత అన్న‌ట్లు ఉంటుంది. ఈ క్యారెక్ట‌ర్‌ను అన్న‌య్య‌ త‌ప్ప ఇంకెవ‌రూ చేయ‌లేరు. దీనికోసం ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. మీకు న‌చ్చేవ‌ర‌కు మేము … Read more

    ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్

    నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదల కానుంది.ఇందు కోసం కోసం శిల్ప కళావేదికలో ముందస్తు విడుదల వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో కేథరీన్, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    ఒకే పాటకు చిందులేసిన చిరంజీవి, సల్మాన్ ఖాన్

    మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో, ఒకే స్టేజ్ మీద స్టెప్పులు వేస్తే ఎలా ఉంటది. ఆ టైమ్ రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి ఓ పాటకు డాన్స్ చేశారు. ఆ పాటకు ఫేమస్ కొరియోగ్రఫర్ ప్రభుదేవా నృత్యాలు సమకూర్చగా, తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ క్రేజీ కాంబినేషన్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పవచ్చు. ఈ సినిమాకు మోహన్ రాజా … Read more

    ముంబ‌యి లోక‌ల్ ట్రైన్‌లో సంద‌డి చేసిన‌ విజ‌య్, అన‌న్య‌

    ‘లైగ‌ర్’ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య ముంబ‌యిలో సంద‌డి చేస్తున్నారు. శుక్ర‌వారం ఉద‌యం మాస్కులు ధ‌రించి రైల్వే స్టేష‌న్‌కు వెళ్లిన వీరు లోక‌ల్ ట్రైన్‌లో ప్ర‌యాణించారు. రైలులో ప్ర‌యాణికుల‌తో త‌మ సినిమా గురించి ముచ్చ‌టించారు. కాసేప‌టికి విజ‌య్‌ అన‌న్య ఒడిలో త‌ల‌పెట్టుకొని నిద్ర‌పోయాడు. గురువారం సాయంత్రం కూడా ఈ జంట ముంబ‌యిలోని బ‌స్తీల్లో తిరుగుతూ లైగ‌ర్ పాట‌ల‌కు స్టెప్పులేస్తూ సంద‌డి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

    వివాదాస్పదంగా మారిన ‘కమిట్మెంట్’ ట్రైలర్

    తాజాగా విడుదలైన ‘కమిట్మెంట్’ ట్రైలర్‌ వివాదాస్పదంగా మారింది. ఈ ట్రైలర్‌లో బోల్డ్ కంటెంట్ ఉండడంతో పాటు, బోల్డ్ సీన్స్‌కు భగవద్గీత శ్లోకం వినిపించడంపై విమర్శలు వస్తున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శ్లోకం వినిపించారని, వెంటనే ఆ శ్లోకాన్ని తీసేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు నెటిజన్లు సైతం.. ‘భగవద్గీతను గౌరవించడం రాకపోతే.. కించపరిచే అధికారం ఎవరిచ్చారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    లైగర్.. ‘వాట్ లగా దెంగే’ మ్యూజిక్ వీడియో

    విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా.. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ‘లైగర్’. ఆగష్టు 25వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ నుంచి ‘వాట్ లగా దెంగే’ మ్యూజిక్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేయగా.. ఈ మ్యూజిక్ వీడియో మరింత హైప్ క్రియేట్ చేస్తుంది.

    ధ‌నుష్ ‘సార్’ టీజ‌ర్ రిలీజ్

    ధ‌నుష్ హీరోగా న‌టిస్తున్న సార్ మూవీ టీజ‌ర్ రిలీజైంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో టీజ‌ర్ అదిరిపోయింది. ‘విద్య అనేది గుడిలో పెట్టే నైవేద్యం లాంటిది, దాన్ని అంద‌రికీ పంచిపెట్టండి. ఫైవ్ స్టార్ హోటల్‌లో డిష్‌లాగా అమ్మ‌కండి’ అని ధ‌నుష్ చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ధ‌నుష్ విద్యావ్య‌వ‌స్థ‌లో జ‌రుగుతున్న మాఫియాపై పోరాడే ఒక కాలేజీ లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జీవీ ప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

    క్షమాపణలు చెప్పిన షంషేరా మూవీ డెరైక్టర్

    షంషేరా మూవీ డెరైక్టర్ కరణ్ మల్హోత్రా క్షమాపణలు చెప్పారు. రూ.150 కోట్లు ఖర్చు పెట్టిన సినిమా 6 రోజులైన కూడా కలెక్షన్లు రూ.60 కోట్లు కూడా దాటలేదు. తొలి రోజు నుంచే ఈ మూవీపై నెగిటివ్ టాక్ రావడంతో వసూళ్లు భారీగా పడిపోయాయి. ఇందులో యాక్ట్ చేసిన రణ్ బీర్ కపూర్, అజయ్ దేవగణ్ ఫ్యాన్స్ దర్శకుడిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్వేషం, ఆవేశాన్ని భరించలేకపోయానని కరణ్ ఇన్ స్టా వేదికగా పేర్కొన్నారు. మంచి, చెడు, ప్రతిదీ సమానంగా చూస్తానన్న ఆయన, … Read more

    ట్రెండింగ్‌లో ‘బింబిసారా’ రిలీజ్ ట్రైలర్

    కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ ‘బింబిసారా’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఆగష్టు 5వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ నుంచి నిన్న(జులై 27) రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్.. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. 10 మిల్లియన్స్‌కు పైగా వ్యూస్, 2.5మిల్లియన్స్‌కు పైగా లైక్స్‌తో దూసుకెళ్లిపోతుంది. కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 29వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు.

    ‘బింబ‌సార’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది

    నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన బింబిసార మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. కేథ‌రిన్, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రాన్ని నాలుగు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు. ట్రైల‌ర్ చూస్తుంటే రెండు జ‌న్మ‌ల‌ను క‌నెక్ట్ చేసే క‌థ‌గా తెలుస్తుంది. క‌ళ్యాణ్‌రామ్ డైలాగ్స్‌, యాక్ష‌న్ అద‌ర‌గొట్టాడు. గ్రాండ్ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ట్రైల‌ర్‌ రిచ్‌గా ఉంది. విశిష్ఠ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆగ‌స్ట్ 5న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.