చైతన్య JVతో నిహారిక విడాకులు?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చైతన్య JVతో నిహారిక విడాకులు?

    చైతన్య JVతో నిహారిక విడాకులు?

    March 21, 2023

    Courtesy Twitter: mega fans

    మెగా డాటర్ నిహారిక ఆమె భర్త చైతన్య జేవీ విడిపోతున్నట్లు.. మరోసారి సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి కారణం చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో నిహారికను అన్‌ఫాలో చేశాడు. అంతేకాదు పెళ్లి ఫొటోలను సైతం డిలీట్ చేశాడు. నిహారికతో కలిసి ఉన్న ఏ ఫొటో కూడా చైతన్య ఇన్‌స్టాలో లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళ చెందుతున్నారు. విబేధాలు ఉంటే పరిష్కరించుకోవాలి కానీ విడిపొవద్దు అంటూ సూచిస్తున్నారు.

    చైతన్య జొన్నలగడ్డ, నిహారికకు డిసెంబర్ 9న 2020లో వివాహం జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. మూడేళ్లుగా కలిసుంటున్న ఈ జంట ఒకరికొకరు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసుకోవటంతో అభిమానులను షాక్‌కు గురి చేసింది. 

    ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య. MBA పూర్తి చేసిన అతడు.. వివిధ కంపెనీల్లో 2010 నుంచి 2018 వరకు పని చేశాడు. 2019లో ది హరికేన్స్‌ అనే కంపెనీని సొంతంగా ప్రారంభించాడు. టెక్ మహేంద్రలో జాయిన్ అయ్యాడు చైతన్య. 

    కొన్ని నెలల క్రితం ఓ పబ్‌లో మత్తు పదార్థాలు దొరికిన కేసులో నిహారికను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తర్వాత ఆమెకు ఎలాంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి విబేధాలు మెుదలయ్యాయని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇద్దరూ విడిపోతున్నారని గతంలోనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ, వాటిని కొట్టిపారేశారు. 

    ప్రస్తుతం ఇద్దరు ప్రొఫెషనల్‌ లైఫ్‌లో బిజీగా గడుపుతున్నారు. నిహారిక సినిమాల్లో నటించకపోయినా నిర్మాతగా కొనసాగుతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్ఛర్స్ పథాకంపై చిన్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్‌సిరీస్‌ హిట్ అయ్యింది. ప్రస్తుతం హలో వరల్డ్‌ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version