ఐపీఎల్ ఫైనల్ సన్నద్ధతపై చెన్నై కోచ్ స్టిఫెన్ ఫ్లేమింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫైనల్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఫైనల్స్‌లో మా రికార్డు 50శాతంగా ఉంది. శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. గిల్‌ను త్వరగా ఔట్ చేయాల్సి ఉంది. గత మ్యాచ్‌లో త్వరగా వికెట్లను తీయడం వల్ల GT పైచేయి సాధించగలిగాం. తొలి క్వాలిఫయర్‌లో తొలుత మేం బౌలింగ్ చేయాలని భావించాం. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం సరైందేనని తేలింది. ఈసారి టాస్ కీలకం. మాకున్న అనుభవంతో ఫైనల్ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, ఇవాళ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై vs గుజరాత్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆదివారమే ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా రిజర్వ్‌డేకు మార్చారు. అయితే ఇవాళ్టి మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉంది. నిన్నటిలా నేడు కూడా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే గుజరాత్‌నే విజేతగా ప్రకటించే ఛాన్స్ ఉంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానంలో ఉండటంతో ఈమేరకు ఎంపైర్లు నిర్ణయం తీసుకోనున్నారు. మరి ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!