స్టేజీపై పానీపూరి తినిపించుకున్న చిరంజీవి-అమీర్‌ఖాన్

screengrab youtube

నేడు లాల్‌సింగ్ చ‌డ్డా తెలుగు ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటుచేసింది. చిరంజీవి ఈ చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందుకే ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న కూడా పాల్గొన్నారు. ట్రైల‌ర్‌లో ఉన్న పానీపూరీ డైలాగ్‌ను తెలుగులో అమీర్‌ఖాన్‌తో నాగ‌చైత‌న్య చెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక డైలాగ్ చెప్పిన త‌ర్వాత పానీపూరీని చిరంజీవి, అమీర్‌ఖాన్ ఒక‌రికొక‌రు తినిపించుకున్నారు. లాల్‌సింగ్ చ‌డ్డా మూవీ ఆగ్ట్ 11న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

Exit mobile version