Chiru Leaks: లీకు రాజా బిరుదుకు చెక్ పెట్టిన మెగాస్టార్.. సినిమా ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్..! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Chiru Leaks: లీకు రాజా బిరుదుకు చెక్ పెట్టిన మెగాస్టార్.. సినిమా ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్..! 

    Chiru Leaks: లీకు రాజా బిరుదుకు చెక్ పెట్టిన మెగాస్టార్.. సినిమా ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్..! 

    June 9, 2023

    సినిమాను తీయడం ఒక ఎత్తయితే, ఆ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు. చిత్రబృందం పడిన కష్టానికి ఫలితం ప్రేక్షకులకు చేరాలంటే సినిమాకు ప్రచారం తప్పనిసరి. ఇలా పబ్లిసిటీ కోసం ప్రత్యేకంగా ఓక బృందమే పనిచేస్తుంది. అయితే, రాను రాను ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోతోంది. ఎవరో అప్‌డేట్స్ లీక్ చేయడం కన్నా.. చిత్రబృందమే వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా అర చేతిల్లోకి రావడంతో సినిమాకు కావాల్సిన ప్రచారమూ దక్కుతోంది. ఈ కోవలోకి చెందిందే చిరు లీక్స్. మెగాస్టార్ చిరంజీవి ఈ అప్‌డేట్స్‌ని అధికారికంగా లీక్ చేస్తుండటం ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. 

    తప్పుని ఒప్పులా..

    మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ బ్రెయిన్‌కు చిరు లీక్స్ నిదర్శనం. గతంలో చిరంజీవి పలు లీకులను చేశాడు. ఆచార్య టైటిల్ రివీల్ చేయడం, ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు సంబంధించి అన్యాపదేశంగా చెప్పేశాడు. 

    పొరపాటున వెల్లడించిన వివరాల వల్ల కొంతవరకు విమర్శలకు గురయ్యారు. కానీ, ఇప్పుడు అదే నెగెటివ్ పాయింట్‌ని పాజిటివ్‌గా మలిచిన నటుడు చిరంజీవి. 

    లీక్ చేస్తున్నామని అధికారికంగా వెల్లడించి మరీ చెప్తుండటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గాడ్‌ఫాదర్ మూవీ నుంచి చిరులీక్స్‌ని అఫీషియల్ చేసేశాడు మెగాస్టార్. 

    ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ని స్వయంగా మెగాస్టారే రివీల్ చేస్తున్నాడు. 

    ఇతర పీఆర్‌లతో పోలిస్తే చిరుకి ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. దీంతో ఎక్కువ మందికి రీచ్ కావడానికి ఈ లీక్స్ ఉపయోగపడుతున్నాయి. అలా గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల నుంచి చేసిన లీక్స్ థియేటర్లకు జనాలను రప్పించాయి. 

    ఇప్పుడు ఇదే పంథాలో భోళాశంకర్ మూవీ నుంచి మేకింగ్ వీడియోను ఫ్యాన్స్‌కి లీక్ చేశాడు. ఓ సాంగ్ కోసం రూపొందించిన భారీ సెట్‌ వీడియో ఇది.

    ఇందులో ‘జాం జాం జజ్జనిక.. తెల్లార్లు ఆడుదాం తయ్యితక్క’ సాంగ్‌కి చిరు, సుమంత్, తమన్నా, కీర్తి సురేష్ స్టెప్పులేశారు. ఈ పాటను కాసర్ల  శ్యాం రాయగా, మహతి స్వర సాగర్ స్వరపరిచాడు. వీజే శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ అందించాడు. 

    సినిమా అనేది కోట్ల రుపాయలతో కూడుకున్న బిజినెస్. సినిమాలోని ఏ విషయం లీకైనా అది మొత్తం సినిమా రెవెన్యూపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటూ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటేన్ చేస్తూ ఉంటారు సిబ్బంది. 

    తెలియకుండానే చిరు చేసిన లీక్స్ కారణంగా కొందరు విమర్శించారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తలనొప్పిలా మారాడని పెదవి విరిచారు. 

    ఇప్పుడు ఇదే సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటజీగా మారింది. చిరు నుంచి ఎప్పుడెప్పుడు లీక్స్ వస్తాయా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండటం గమనార్హం. 

    భోళాశంకర్ సినిమాను ఆగస్టు 11న విడుదల చేస్తున్నారు. దీంతో 2 నెలల ముందు నుంచే సినిమా ప్రమోషన్లను తన స్టైల్‌లో మొదలు పెట్టాడు చిరు.

    ఒకొక్క లీక్ ఇస్తూ జనాల్లో తన సినిమా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక అధికారిక ప్రచారాలు సపరేటు. 

    తమిళ సినిమా వేదాళంకు రిమేక్‌గా భోళాశంకర్ తెరకెక్కుతోంది. తెలుగులో మెహర్ రమేశ్ తీస్తున్నాడు. చిరుకు జోడీగా తమన్నా నటించింది. కీర్తి సురేశ్ చిరంజీవి చెల్లెలి పాత్ర పోషించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version