Chiru Remake Movies: రీమేక్ మూవీలతో దూసుకెళ్తున్న చిరంజీవి.. ఆందోళనలో ఫ్యాన్స్‌!. కారణం అదే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Chiru Remake Movies: రీమేక్ మూవీలతో దూసుకెళ్తున్న చిరంజీవి.. ఆందోళనలో ఫ్యాన్స్‌!. కారణం అదే?

    Chiru Remake Movies: రీమేక్ మూవీలతో దూసుకెళ్తున్న చిరంజీవి.. ఆందోళనలో ఫ్యాన్స్‌!. కారణం అదే?

    June 2, 2023

    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తెలుగులో నెంబర్‌ వన్‌ హీరోగా సెటిల్‌ అయిన సమయంలో చిరు సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల వైపు వెళ్లారు. అక్కడ పెద్దగా కలిసిరాకపోవడంతో తిరిగి తనకు ఎంతో ఇష్టమైన ఇండస్ట్రీకి తిరిగి వచ్చేశారు. అలాగే సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను షురూ చేశారు. అయితే చిరు మెుదటి ఇన్నింగ్స్‌తో పోలిస్తే సెకండ్‌ ఇన్నింగ్స్‌ రీమెక్స్‌ చుట్టూ తిరుగుతోంది. రీఎంట్రీ తర్వాత చిరు తొలి చిత్రం ‘ఖైదీ 150’ నుంచి రీసెంట్‌ భోళాశంకర్‌ వరకూ మెుత్తం 6 సినిమాలు చేయగా అందులో మూడు రీమెక్సే ఉన్నాయి.

    మెగాస్టార్‌ చిరు వరుసగా రీమెక్ సినిమాలు చేయడం ఫ్యాన్స్‌కు అంతగా రుచించడం లేదు. స్ట్రైయిట్ చిత్రాలు చేయాలని వారు కోరుకుంటున్నారు. దీనికితోడు చిరు చేస్తున్న చిత్రాలన్నీ తమిళం, మలయాళంలో బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచినవే. దీంతో ఆ సినిమాలను సబ్‌టైటిల్స్ పెట్టుకొని మరీ మూవీ లవర్స్‌ చూసేస్తున్నారు. ఇది చిరు సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తోంది. అందువల్లే చిరు తీసిన రీమెక్‌ సినిమాలు హిట్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. చిరు స్థాయి కలెక్షన్స్‌ను రాబట్టలేక చతికిలపడుతున్నాయి. చిరు తన సెకండ్ ఇన్సింగ్స్‌లో చేసిన రీమెక్ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

    ఖైదీ నంబర్ 150

    మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రం తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తమిళ్‌లో మురుగదాస్ డైరెక్ట్ చేయగా తెలుగులో వీవీ వినాయక్ రీమేక్ చేశాడు. ఈ సినిమా తెలుగులో మంచి హిట్‌ టాక్ తెచ్చుకుంది.

    గాడ్‌ ఫాదర్‌

    మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘లూసీఫర్‌’ చిత్రానికి రీమేక్‌గా చిరు ‘గాడ్ ఫాదర్‌’ సినిమా చేశారు. లూసీఫర్‌లో మోహన్‌లాల్‌ పోషించిన పాత్రను తెలుగులో చిరు చేశారు. ఈ సినిమా  గతేడాది దసరా కానుకగా విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్‌కు కాస్త దూరంలో ఆగిపోయింది. 

    భోళా శంకర్ 

    చిరు హీరోగా మేహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కూడా తమిళంలో అజిత్‌ హీరోగా చేసిన ‘వేదాలం’ చిత్రానికి రీమేక్‌. భోళాశంకర్‌లో చిరు సరసన తమన్నా నటించగా, చెల్లెలిగా కీర్తి సురేష్‌ చేసింది. ఆగస్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. 

    బ్రో డాడీ

    మలయాళంలో ఘన విజయం సాధించిన ‘బ్రో డాడీ’ సినిమాను కూడా చిరు రీమేక్‌ చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు సోగ్గాడే చిన్నినాయనా డైరెక్టర్‌ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తారని ఊహాగానాలు వినిపించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version