ఇంజినీరింగ్ ప్రశ్నపత్రంలో సినిమా ప్రశ్నలు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఇంజినీరింగ్ ప్రశ్నపత్రంలో సినిమా ప్రశ్నలు

  ఇంజినీరింగ్ ప్రశ్నపత్రంలో సినిమా ప్రశ్నలు

  February 5, 2022

  అప్పుడప్పుడు పరీక్షల్లో ఏం రాయలో జవాబు గుర్తురాకపోతే సినిమా స్టోరీ రాశానని పలువురు చెప్పడం వింటు ఉంటాం. కాని తాజాగా కేరళలో జరిగిన ఓ పరీక్షలో ఏకంగా ఓ హిట్ సినిమా గురించి ప్రశ్నలు వచ్చాయని తెలిసింది. కేరళ ఇంజినీరింగ్ 50 మార్కుల ప్రశ్న పత్రంలో మిన్నల్ మురళి సినిమా గురించి ప్రశ్నలు వచ్చాయని వెలుగులోకి వచ్చింది.

  అయితే ఈ ప్రశ్నపత్రం చివరలో మరో ట్విస్ట్ పెట్టారు. ఈ మూవీలో చిత్రీకరించబడిన కథలో అన్ని పేర్లు, పాత్రలు, సంఘటనలు కల్పితమని రాశారు. అసలు వ్యక్తులు, స్థలాలతో ఉద్దేశించినది కాదని తెలిపారు. ఆల్ ది బెస్ట్ అని పేర్కొన్నారు. పరీక్షను బాగా రాయాలని చెప్పారు. కాని విమర్శించాలనుకుంటే తర్వాత చెప్పాలని వెల్లడించారు.

  కొత్తమంగళంలోని మార్ అథనాసియస్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కురియన్ జాన్ ఈ ప్రశ్నపత్రాన్ని సెట్ చేసినట్లు తెలిసింది. అయితే తాను ఇలాంటి ప్రశ్నపత్రాన్ని సెట్ చేయడం ఇది మొదటిసారి కాదంటా. ఇలా ప్రేపేర్ చేయడం ఇది ఐదోసారని తెలిసింది. గతంలో వరద వంటి విభిన్న నేపథ్యాలపై ప్రశ్నలు ఇచ్చినట్లు సమాచారం.

  ఈ చిత్ర దర్శకుడు బాసిల్ జోసెఫ్ కూడా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఇంజనీరింగ్ పరీక్ష ప్రశ్నపత్రం చిత్రాన్ని పంచుకున్నారు. అయితే గతంలో కూడా పలు ప్రాంతాల్లో కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ ల గురించి, సినిమాల గురించి ప్రశ్నలు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version