Citroen C3 Aircross SUV: రూ.10 లక్షలకే అత్యాధునిక ఫ్రెంచ్‌ కారు.. ఈ ఛాన్స్‌ అస్సలు వదులుకోవద్దు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Citroen C3 Aircross SUV: రూ.10 లక్షలకే అత్యాధునిక ఫ్రెంచ్‌ కారు.. ఈ ఛాన్స్‌ అస్సలు వదులుకోవద్దు!

    Citroen C3 Aircross SUV: రూ.10 లక్షలకే అత్యాధునిక ఫ్రెంచ్‌ కారు.. ఈ ఛాన్స్‌ అస్సలు వదులుకోవద్దు!

    September 22, 2023

    ఫ్రెంచ్‌ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్‌ (Citroen) సరికొత్త కారును ప్రకటించింది. కార్ల ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘Citroen C3 Aircross SUV’ కారును లాంఛ్ చేసింది. భారత మార్కెట్‌లోని హ్యూందాయ్ క్రెటా (Hyundai Creta) మోడల్ కారుకి పోటీగా సిట్రోయెన్ దీన్ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారు ప్రీ-ఆర్డర్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. మరి ఈ కారు డిజైన్‌, ప్రత్యేకతలు ఏంటి? ధర ఎంత? డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం. 

    కారు డిజైన్‌

    Citroen C3 Aircross SUV కారు ముందు భాగంలో సిట్రోయెన్ మార్కు సిగ్నేచర్ గ్రిల్ ఉంది. ఇందులో డ్యూయల్ లేయర్ డిజైన్, పియానో బ్లాక్ ఇన్సర్ట్‌లు, హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన వై-ఆకారపు డీఆర్ఎల్స్, విస్తృత ఫ్రంట్ బంపర్, రౌండ్ ఫాగ్ ల్యాంప్ ఎన్‌క్లోజర్‌లతో కవర్ అయిన డెడికేటెడ్ బ్రష్డ్ అల్యూమినియం ఎయిర్ ఇన్‌టేక్ వెంట్ ఉన్నాయి. హై ఎండ్ వేరియంట్‌లు ఎక్స్ – ఆకారపు డిజైన్‌తో డ్యూయల్ టోన్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో స్క్వేర్ టెయిల్‌ల్యాంపులు, క్లాడింగ్‌తో కూడిన పొడవైన బంపర్, పెద్ద టెయిల్‌గేట్‌ను ఫిక్స్‌ చేశారు. 

    కారు మోడల్స్‌ 

    Citroen C3 Aircross SUV మోడల్ లైనప్ యూ, ప్లస్, మ్యాక్స్ అనే మూడు విభిన్న వేరియంట్లలో వస్తోంది. ఇది 5-సీటర్, 7-సీటర్ సీటింగ్ కాన్ఫిగరేషన్‌లతో లాంచ్ అయింది. అన్ని వేరియంట్లలోనూ ఒకే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది 109 బీహెచ్‌పీ శక్తిని, 190 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.  6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఈ కారు రానుంది.  

    కార్గో స్పేస్‌

    ఈ కారులోని 5 సీటర్ మోడల్‌ 5+2 సీటింగ్ లేఅవుట్‌తో 444 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. ఇక 7-సీటర్ వెర్షన్ విషయానికి వస్తే.. మూడో వరుసలో ఫోల్డబుల్  సీట్లను కలిగి ఉంది. దీనికి 511 లీటర్ల కార్గో స్పేస్‌ను అందించారు.

    ప్రధాన ఫీచర్లు

    ఇందులో 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, కీలెస్ ఎంట్రీ, డ్రైవర్ సీటు కోసం మాన్యువల్ హైట్ అడ్జస్ట్‌మెంట్, వెంటిలేటెడ్ సీట్లు కూడా ఉన్నాయి. క్లైమెట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్ కూడా కారుకు అందించారు. 

    మల్టిపుల్‌ కలర్స్‌

    Citroen C3 Aircross SUV కారు పలు రంగుల్లో అందుబాటులోకి రానుంది. పోలార్ వైట్, ప్లాటినం గ్రే, స్టీల్ గ్రే, కాస్మో బ్లూ, పోలార్ వైట్ విత్ కాస్మో బ్లూ రూఫ్, స్టీల్ గ్రే విత్ కాస్మో బ్లూ రూఫ్, స్టీల్ గ్రే విత్ పోలార్ వైట్ రూఫ్ వంటి మల్టీపుల్ కలర్ ఆప్షన్‌లలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. కాస్మో బ్లూతో స్టీల్ గ్రే పోలార్ వైట్ రూఫ్, పోలార్ వైట్ రూఫ్‌తో ప్లాటినం గ్రే, ప్లాటినం గ్రే రూఫ్‌తో పోలార్ వైట్ బాడీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. 

    ధర ఎంతంటే?

    Citroen C3 Aircross SUV కారు ధరను మోడల్‌ ఆధారంగా నిర్ణయించారు. ఈ కారు ప్రారంభ మోడల్‌ ధర (Ex-Showroom) రూ.9.9 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ప్లస్‌ మోడల్‌ రూ.11.45-11.50 లక్షలు కాగా, మ్యాక్స్‌ ప్రైస్‌ రూ.11.95-12.10 లక్షలుగా కంపెనీ పేర్కొంది. 

    ప్రీ – ఆర్డర్ కార్లు డెలివరీ ఎప్పుడంటే?

    సిట్రోయెన్ సి3 ఎయిర్ క్రాస్ కారును ముందుగా బుక్ చేసుకున్న వారికి అక్టోబరు 15 నుంచి డెలివరీ ఇవ్వనున్నారు. సరికొత్త Citroen C3 ఎయిర్‌క్రాస్ SUV 90 శాతానికి పైగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేయబడిందని తయారీ సంస్థ తెలిపింది. భారతీయ వినియోగుదారుల అవసరాలకు తగ్గట్లు రూపొందించారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version