తెలంగాణలో పదో తరగతి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. bse.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి హోమ్ పేజీలో SSC public examinations april 2023- hall ticketsపై క్లిక్ చేయాలి. మీ లాగిన్ సమాచారం ఇచ్చి సబ్మిట్ కొట్టాలి. అడ్మిట్ కార్డును చెక్ చేసి ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. నేరుగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు HALL TICKETS పై క్లిక్ చేయండి.
ఈ నెల 24వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని గతంలోనే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 4,94,616 మంది విద్యార్థుల కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 గంటల నుంచి 12.30వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి