తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తిన వేళ.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాత్రి అయితే చాలు ప్రజలు చలికి వణికిపోతున్నారు. మరి ఈ కొద్దిపాటి చలికే మనం ఇబ్బందులు పడుతుంటే గడ్డకట్టించే ఉష్ణోగ్రతల్లో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ప్రపంచంలో చాలా దేశాలు తమ భూభాగంలో అత్యంత శీతల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గడ్డకట్టుకుపోయిన నదులు, మంచుతో కప్పబడిన ఇళ్లు, చెట్లతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇంతకీ ఆ దేశాలు ఏవి? అక్కడ ఎలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి? వంటి అంశాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
1. అంటార్కిటికా
ప్రపంచంలోని అత్యంత శీతల దేశాల జాబితాలో అంటార్కిటికా (Antarctica) అగ్రస్థానంలో ఉండటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇది ఒక దేశం కానప్పటికీ, ఇది భూమిపై అత్యంత శీతల ప్రాంతం. సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ -30 డిగ్రీల నుంచి -80 మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అందుకే ఈ ప్రాంతంలో పెద్దగా జనసంచారం కనిపించదు. శాస్త్రవేత్తలు, పర్యాటకులు మాత్రమే అక్కడ కనిపిస్తుంటారు.
2. కెనడా
ప్రపంచంలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయే దేశాల్లో కెనడా (Canada) ఒకటి. నదులు, పచ్చదనం పుష్కలంగా ఉన్న ఆ దేశంలో శీతాకాలం వచ్చిందంటే ప్రజలు వణికిపోతారు. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రతలు -5.35 డిగ్రీలకు పడిపోతాయి. 1947లో కెనడాలోని స్నాగ్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో -63 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
3. రష్యా
ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో రష్యా (Russia) ఒకటి. ఇది ఐరోపా, ఆసియా ఖండాల మధ్య విస్తరించి ఉంది. ఇక్కడ సాధారణ రోజుల్లోనే ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలుగా ఉంటుంది. ఇక జనవరి తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఏకంగా -40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. సైబీరియా ప్రాంతంలో 1933 ఫిబ్రవరి 6న రికార్డుస్థాయిలో -67.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
4. మంగోలియా
మంగోలియా (Mongolia) ప్రంపంచంలోని అతి శీతల దేశంగా గుర్తింపు పొందింది. అక్కడ శీతాకాలంలో వాతావరణ పరిస్థితులు మరింత దారుణంగా మారతాయి. సరస్సులు, నదులు గడ్డకట్టుకుపోతాయి. అక్కడి ఇళ్లు, చెట్లు, రోడ్లు శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. వింటర్‌లో -34 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పడిపోతాయి.
5. నార్వే
వరల్డ్‌లోని చల్లని దేశాల్లో నార్వే (Norway) కూడా ఒకటి. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. 1900లో నార్వేలోని కరాస్‌జోక్ అనే గ్రామంలో అత్యల్పంగా -51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ దేశంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత అదే.
6. కిర్గిజ్‌స్తాన్
కిర్గిజ్‌స్తాన్ (Kyrgyzstan)లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతుంటాయి. అక్కడ శీతాకాలంలో సగటున 1.55 ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయి. వింటర్‌లో అక్కడి నది లోయ ప్రాంతాలు గడ్డకట్టుకుపోతాయి. కొన్ని ప్రాంతాల్లో -53 వరకూ ఉష్ణోగ్రతలు పడిపోతాయి.
7. ఫిన్‌లాండ్
ఫిన్‌లాండ్ (Finland)లో ఒక ఏడాదిలో చలికాలమే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సాధారణ రోజుల్లో 1.7 డిగ్రీ సెల్సియస్‌గా ఉండే ఉష్ణోగ్రతలు శీతాకాలంలో పలు ప్రాంతాల్లో -51.5 వరకూ పడిపోతాయి. ఈ దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వింటర్ ఒలంపిక్స్ అక్కడే అధికంగా నిర్వహిస్తుంటారు.
8. ఐస్‌లాండ్
ఐస్‌లాండ్ (IceLand) ఒక ద్వీప దేశం. దీని పేరే అక్కడి శీతోష్ణ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. ఐస్‌లాండ్‌లో ఉండే పోలార్ టండ్రా వాతావరణం ఆ ప్రాంతాన్ని నిరంతరం చల్లగా ఉంచుతుంది. అందుకే ఈ ప్రాంతం పర్యాటకంగానూ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వెళ్తుంటారు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి