Costliest Tech Gadgets: ప్రపంచంలోనే అతి ఖరీదైన టెక్‌ గాడ్జెట్స్‌.. వీటిని కొనాలంటే అంబానీ అయినా ఆలోంచాల్సిందే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Costliest Tech Gadgets: ప్రపంచంలోనే అతి ఖరీదైన టెక్‌ గాడ్జెట్స్‌.. వీటిని కొనాలంటే అంబానీ అయినా ఆలోంచాల్సిందే!

    Costliest Tech Gadgets: ప్రపంచంలోనే అతి ఖరీదైన టెక్‌ గాడ్జెట్స్‌.. వీటిని కొనాలంటే అంబానీ అయినా ఆలోంచాల్సిందే!

    August 23, 2023

    ప్రస్తుత ప్రపంచం గాడ్జెట్స్‌ మయంగా మారిపోయింది. ప్రతీ ఇంట్లోనూ ఏదోక గాడ్జెట్‌ దర్శనమిస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ జనరేషన్‌ యువత సాంకేతిక పరికరాలపై అమితాసక్తిని కనబరుస్తున్నారు. డబ్బుకు ఏమాత్రం వెనకాడకుండా తమకు నచ్చిన ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌, ఐపాడ్స్‌, హెడ్‌సెట్స్‌  తదితర టెక్‌ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అయితే సాధారణంగా ప్రతీ ఒక్కరు కొనుగోలు చేసివి వేలల్లో ఉంటాయి. కాస్త డబ్బు ఉన్న వారైతే లక్షల్లో కొంటుంటారు. కానీ వందల కోట్లు విలువ చేసే గాడ్జెట్స్ ఈ వరల్డ్‌లో ఉన్నాయని మీకు తెలుసా? వాటిని ఏ విధంగా తయారు చేస్తారో ఊహించగలరా?. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్‌-10 గాడ్జెట్స్‌ ఏవో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. 

    1. Falcon Supernova iPhone 6 Pink Diamond

    ప్రపంచంలోనే అతి ఖరీదైన మెుబైల్‌ లేదా గాడ్జెట్‌ (సాంకేతిక పరికరం)గా ‘ఫాల్కన్‌ సూపర్‌నోవా ఐ ఫోన్ 6 పింక్‌ డైమండ్‌’ (Falcon Supernova iPhone 6 Pink Diamond) నిలిచింది. ఈ ఫోన్‌ విలువ 48.5 మిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఈ ఫోన్‌ ఖరీదు రూ. 402.34 కోట్లు. ఈ ఫోన్‌ బాడీని ప్లాటినం పూతతో తయారు చేసారు. ‌అలాగే ఈ ఫోన్‌ వెనుక భాగంలో అతి ఖరీదైన పింక్‌ డైమండ్‌ను ఫిక్స్‌ చేశారు. అందుకే ఈ ఫోన్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైనది. 

     

    2. iPhone 5 Black Diamond

    వరల్డ్‌లోనే రెండో అతి విలువైన గ్యాడ్జెట్‌గా ‘ఐఫోన్‌ 5 బ్లాక్‌ డైమండ్‌’ (iPhone 5 Black Diamond) నిలిచింది. ఈ ఫోన్‌ విలువ 15 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో రూ.124.43 కోట్లు ‌అన్నమాట. ఈ మెుబైల్‌ను 135 గ్రాముల 24 క్యారెట్స్‌ గోల్డ్‌తో రూపొందించారు. అలాగే 600 వైట్‌  డైమండ్స్‌ ఆకర్షణీయంగా ఫిక్స్‌ చేశారు. హోమ్‌ బటన్‌గా బ్లాక్‌ డైమండ్‌ను అమర్చారు.  

    3. iPad 2 Gold History Edition 

    ‘ఐపాడ్‌ 2 గోల్డ్‌ హిస్టరీ ఎడిషన్‌’ (iPad 2 Gold History Edition)ను స్టువర్ట్ హ్యూస్ డిజైన్‌ చేశాడు. దీని వాల్యూ 7.8 మిలియన్‌ డాలర్లు. ఒకవేళ భారతీయులు దీన్ని కొనుగోలు చేయాలంటే రూ. 64.70 కోట్లు చెల్లించాల్సిందే. ఈ ఐపాడ్‌ ఫ్రంట్‌ ఫ్రేమ్‌ను 65 మిలియన్ సంవత్సరాల నాటి టి-రెక్స్ షేవింగ్‌లతో తయారు చేశారు. బ్యాక్‌ ప్యానెల్‌ను స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారంతో అభివృద్ధి చేశారు. వరల్డ్‌లోనే ఖరీదైన ఐపాడ్‌గా ఇది గుర్తింపు పొందింది.

    4. Hart Audio D&W Aural Pleasure loudspeakers

    ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లౌడ్‌ స్పీకర్స్‌గా ‘హార్ట్‌ ఆడియో డి & డబ్ల్యూ ప్లెసర్‌ లౌడ్‌ స్పీకర్స్‌’ (Hart Audio D&W Aural Pleasure loudspeakers)ను చెబుతారు. దీని విలువ 4.7 మిలియన్‌ డాలర్లు. అంటే రూ.38.98 కోట్లు. 18 క్యారెట్ల గోల్డ్‌తో దీన్ని తయారు చేశారు. ఇది అత్యుత్తమమైన సౌండ్‌ క్వాలిటీని అందిస్తుంది. 

    5. Triton Personal Submarine 3300-3

    సముద్ర గర్భంలో అన్వేషణ సాగించాలని కోరుకునేవారి కోసం ‘ట్రిటన్‌ పర్సనల్‌ సబ్‌మెరైన్‌ 3300-3’ తయారు చేశారు. దీని విలువ 2 మిలియన్‌ డాలర్లు. ఇండియన్‌ కరెన్సీకి అన్వయిస్తే రూ. 16.58 కోట్లు. దీని ద్వారా సముద్రం ఉపరితలం నుంచి 3,280 అడుగుల లోతు వరకూ ప్రయాణించవచ్చు. ఇది విలాసవంతమైన థ్రిల్లింగ్‌ అడ్వెంచర్‌ అనుభవాన్ని అందిస్తుంది.  

    6. Camael Diamonds iPad

    ‘కామెల్ డైమండ్స్ ఐప్యాడ్’ (Camael Diamonds iPad) ఆరో అతి ఖరీదైన గాడ్జెట్‌గా గుర్తింపు పొందింది. ఈ ఐప్యాడ్‌ ప్యానల్‌ను 18 క్యారెట్ల బంగారం పూతతో, 300 డైమండ్స్‌తో ‌అందంగా తీర్చిదిద్దారు. దీని బరువు కిలోకి పైనే. విలువ 1.2 మిలియన్ డాలర్లు (రూ.9.95 కోట్లు).

    7. Jarre iPod and iPad Docks

    జారే ఐపాడ్ & ఐప్యాడ్ డక్స్ (Jarre iPod and iPad Docks)ను సంగీత కారుడు జీన్‌ మైఖేల్‌ తయారు చేశాడు. దీని విలువ 5,60,000 డాలర్లు (రూ. 4.64 కోట్లు).

    8. Book Air Supreme Platinum Edition 

    ‘ఐపాడ్‌ 2 గోల్డ్‌ హిస్టరీ ఎడిషన్‌’ రూపొందించిన స్టువర్ట్‌ హ్యూస్‌ ‘బుక్‌ ఎయిర్‌ సుప్రీం ప్లాటినమ్‌ ఎడిషన్‌’ను కూడా తయారు చేశాడు. దీనికోసం 7 కిలోల ప్లాటినమ్‌ ఉపయోగించాడు. కేవలం ఐదు యూనిట్లను మాత్రమే నిర్మించారు. దీని విలువ రూ.4.14 కోట్లుగా ఉంది. 

    9. Nintendo Wii Supreme

    ఇదొక అద్భుతమైన గేమింగ్‌ కన్సోల్‌. 22 క్యారెట్ల సాలిడ్‌ గోల్డ్‌తో పాటు డైమాండ్స్‌తో దీన్ని తయారు చేశారు. Nintendo Wii Supreme విలువ రూ. 4.12 కోట్లు. ప్రస్తుతం దీని ఉత్పత్తి జరగడం లేదు.

     

    10. Sony PlayStation 3 Supreme

    ‘సోనీ ప్లేస్టేషన్‌ 3 సుప్రీమ్‌’ను 22 క్యారెట్ల గోల్డ్‌, డైమాండ్స్‌తో ఆకర్షణీయంగా నిర్మించారు. దీన్ని దక్కించుకోవాలంటే రూ. 2.74 కోట్లు చెల్లించాలి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version