Creative Video songs In Tollywood: టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Creative Video songs In Tollywood: టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!

    Creative Video songs In Tollywood: టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!

    March 2, 2024

    టాలీవుడ్‌ ప్రేక్షకులు సంగీత ప్రియులు. సినిమాలోని ఫైట్స్‌, కామెడీ, అడ్వెంచర్‌ సీన్లను ఎలాగైతే ఇష్టపడతారో అదే స్థాయిలో పాటలకు వారు పెద్ద పీట వేస్తుంటారు. అందుకే తెలుగులో చాలా సినిమాలు పాటలతోనే సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఈ కారణం చేతనే మన డైరెక్టర్లు మంచి కథతో పాటు.. అద్భుతమైన పాటలు, డ్యాన్స్ తమ సినిమాల్లో ఉండేలా జాగ్రత్తపడతారు. అయితే కొందరు డైరెక్టర్లు మరో అడుగు ముందుకేసి చాలా క్రియేటివ్‌గా తమ సినిమాల్లోని పాటలను చిత్రీకరించారు. అభిమానులను థ్రిల్‌ చేసి వారి అభిమానాన్ని సంపాదించారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన క్రియేటివ్‌ సాంగ్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    వివాహభోజనంబు

    ‘మాయాబజార్‌’ (1957) సినిమాలోని ‘వివాహభోజనంబు’ పాటను డైరెక్టర్‌ కె.వి. రెడ్డి చాలా వినూత్నంగా తెరకెక్కించారు. పెళ్లి అంటే ఎటువంటి పంచభక్ష్య పరమాన్నాలు ఉండాలో కళ్లకు కట్టాడు. వంటశాలలోకి ప్రవేశించిన నటుడు ఘటోత్కచుడు (ఎస్వీ రంగరావు) పసందైన వంటకాలను పొగుడుతూ ఆరగిస్తాడు. ఈ సాంగ్ తెలుగు వారింట్లో శుభప్రదమైన పాటగా కొనసాగుతోంది. పెళ్లిళ్లలో ఈ సాంగ్ పరిపాటిగా మారింది. 

    ‘సుందరి నీవంటి’

    సాధారణంగా హీరో, హీరోయిన్లతో డైరెక్టర్లు సాంగ్ ప్లాన్‌ చేస్తారు. కానీ ‘మాయాబజార్‌’ సినిమాలోని ‘సుందరి నీవంటి’ ఇందుకు విరుద్ధం. హాస్యనటుడు రేలంగి.. హీరోయిన్‌ సావిత్రితో కలిసి ఈ సాంగ్‌లే నటించాడు. ఆమె అందాలను వర్ణిస్తూ పాడతాడు. అయితే సాంగ్‌ను ఈ జనరేషన్‌ వాళ్లు కూడా అన్వయించుకోవచ్చు. పెళ్లి చూపులకు వెళ్లిన వరుడు.. వధువు అందాలను ఈ స్థాయిలో పొగిడే సాంగ్‌ ఇప్పటివరకూ టాలీవుడ్‌లో రాలేదు. 

    నిలువరా వాలు కనులవాడా

    జంబలకిడి పంబ సినిమాలోని క్లైమాక్స్ సాంగ్‌ చాలా క్రియేటివ్‌గా తెరకెక్కించారు దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ. అన్ని పాటలను స్పూఫ్‌ చేస్తూ తీసిన తొలి తెలుగు సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్‌లో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారి వేషధారణ కనిపించి నవ్వులు పూయిస్తారు. 

    చెప్పమ్మా.. చెప్పమ్మా..

    ‘మురారి’ సినిమాలోని ‘చెప్పమ్మా.. చెప్పమ్మా’ సాంగ్‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. మహేష్‌.. హీరోయిన్‌ను వదిలి కారులో బయల్దేరగా ఆమె జ్ఞాపకాలు అతడ్ని వెంటాడుతాయి. దారి పొడవునా హీరోయిన్‌ కనిపిస్తూ డిస్టర్బ్‌ చేస్తుంది. ఇష్టమైన వారితో ఎడబాటు రాగానే యువతులకు ముందుగా ఈ పాటనే గుర్తుకు వస్తుంది. ప్రియుడు దూరంగా వెళ్తున్న క్రమంలో ఓ యువతి ఎంతగా అతడ్ని మిస్‌ అవుతుందో ఈ సాంగ్‌ కళ్లకు కడుతుంది. 

    బుగ్గే బంగారమా..

    ‘చందమామ’ సినిమాలోని ఈ పాట.. ఒక ‌అబ్బాయి ఎడబాటుకు అద్దం పడుతుంది. మనసుకు నచ్చిన అమ్మాయి పదే పదే కళ్లకు కనిపిస్తూ తన జ్ఞాపకాలతో మైమరిపిస్తుంటుంది. ప్రేయసి దూరంగా వెళ్లినప్పుడు అబ్బాయిలు ఆమెను గుర్తుచేసుకునేందుకు తరచూ ఈ సాంగ్ వింటూ ఉంటారు.

    ‘అసలేం గుర్తుకు రాదు’

    ‘అంతపురం’లోని ఈ సాంగ్‌.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో ఒకటిగా ఉంది. నచ్చిన వ్యక్తి తోడుంటే పెళ్లికాని యువతులకు ఇక ఏది గుర్తుకు రాదన్న కాన్సెప్ట్‌టో దర్శకుడు ఈ పాటను చిత్రీకరించారు. అప్పట్లో ఈ పాట ట్రెండ్ సెట్టర్‌. దీని తర్వాత ఈ తరహాలో ఎన్నో పాటలు టాలీవుడ్‌లో రావడం గమనార్హం. 

    ‘ఇంకి పింకి పాంకీ’

    సుడిగాలి సినిమాలోని ‘ఇంకి పింకి పాంకి’ చాలా గమ్మత్తుగా ఉంటుంది. తమ ఫ్యామిలీ సాంగ్ అంటూ అల్లరి నరేష్‌ పాడే ఈ సాంగ్ వినటానికి బాగుండటంతో పాటు నవ్వులు పూయిస్తుంది. మీరు ఓసారి వినండి.

    ‘ఊ అంటావా.. ఉ ఊ అంటావా’

    తెలుగులో రీసెంట్‌గా వచ్చిన ఐటెం సాంగ్‌లలో ‘పుష్ప’లోని ‘ఉ అంటావా.. ఉ ఊ అంటావా’ పాట సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. మాస్‌ సాంగ్స్‌లలో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఈ పాట లిరిక్స్‌ చాలా యూనిక్‌గా అనిపిస్తాయి. పైగా ఐటెం సాంగ్ అంటే దద్దరిల్లే మ్యూజిక్‌ అవసరం లేదని దేవిశ్రీ ఈ సాంగ్‌తో నిరూపించాడు. 

    ‘ఐతే’

    ఐదుగురు స్నేహితులు కలిస్తే ఎంత సరదాగా ఉంటారో.. అల్లరి చేస్తారో ‘ఐతే’ సినిమాలోని ‘చిటపట చినుకులు’ సాంగ్‌ కళ్లకు కడుతుంది. క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఒకచోట చేరితే ప్రపంచాన్ని మర్చిపోయి వారు ఎంత సంతోషంగా ఉంటారో ఈ పాట చెప్పేస్తుంది. ఫ్రెండ్స్‌ అంతా కలిసి ట్రిప్‌కు వెళ్లినప్పుడు ముందుగా వారికి ఈ పాటనే గుర్తుకు వస్తుంది. 

    ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌’

    ఒంటరి జీవితమని బాధ పడకుండా దాన్ని ఎంత అందంగా జీవించవచ్చో ‘జాను’ సినిమాలోని ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ తెలియజేస్తుంది. మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉందని కళ్లకు కడుతుంది. డిప్రెషన్‌లో ఉన్న వారు ఒక్కసారి ఈ పాట వింటే వెంటనే దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ తరహా సాంగ్‌ తెలుగులో ఇప్పటివరకూ రాలేదని చెప్పవచ్చు. 

    ‘చెలియా చెలియా’

    ప్రేయసితో సంతోషంగా ఉన్నప్పుడు ముందుగా ‘ఖుషి’లోని ‘చెలియా చెలియా’ పాటనే గుర్తుకు వస్తుంది. నచ్చిన వ్యక్తి  పక్కన ఉంటే  ‘కోపాలు, తాపాలు మనకేలా.. సరదాగా కాలాన్ని గడపాలా’ అంటూ సాగే ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version