ఆకాశ వీధుల్లో విహరిస్తున్న దక్ష నగార్కర్… ‘రావణాసుర’లో అవకాశం రావడంతో…
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆకాశ వీధుల్లో విహరిస్తున్న దక్ష నగార్కర్… ‘రావణాసుర’లో అవకాశం రావడంతో…

  ఆకాశ వీధుల్లో విహరిస్తున్న దక్ష నగార్కర్… ‘రావణాసుర’లో అవకాశం రావడంతో…

  మనకు ఏదైనా మంచి మంచి అవకాశాలు వస్తే, మనం చేసిన పని విజయవంతమైతే ఎగిరి గంతేస్తాం. ఆకాశంలో తేలుతూ, ఆనంద విహారం చేస్తుంటాం. ఈ తరహాలోనే సినిమా వాళ్ళు సైతం ఏదైనా మంచి అవకాశం అందిపుచ్చుకుంటే తమ ఆనందానికి అవధులు లేకుండా పోతారు. సోషల్ మీడియాలో పోస్టులు, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటారు. అలానే టాలీవుడ్ బ్యూటీ దక్ష నగార్కర్ కూడా ఆనంద విహారంలో తేలుతోంది. హ్యాపీ మూడ్ అంటూ డ్యాన్సులు వేస్తుంది. 

  హుషారు సినిమాతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న దక్ష.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటుంది. కెరీర్ ప్రారంభంలో ఈ అమ్మడికి మంచి హిట్లు పడకపోయినా.. ఈమె అందంతో నటనతో మంచి చాన్సులే కొట్టేసింది. ఆ క్రమంలో హుషారు, జాంబీ రెడ్డి సినిమాల్లో నటించి హిట్ అందుకుంది. దీంతో నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు చిత్రంలో మెరిసింది. ఈ సినిమాలో చైతన్యతో రొమాన్స్ చేసిన ఈ భామ, ఇండస్ట్రీ చూపు తనవైపు పడేలా చేసుకుంది. ఈ సినిమా కూడా హిట్ అవ్వడంతో ఆనందంలో తేలుతుంది.

  ఈ క్రమంలోనే దక్ష నగార్కర్ కు రవితేజ హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ‘రావణాసుర’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఓ వైపు బంగార్రాజు హిట్ అవడంతో పాటు, మరోవైపు రవితేజ సినిమాలో అవకాశం రావడంతో దక్ష ఆకాశంలో సీతాకోకచిలుకలా తేలుతుంది. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ఓ రీల్ చేస్తూ… ఇప్పుడు నా మూడ్ ఇలా ఉంది అని క్యాప్షన్ జోడించింది. ఎంతో సంతోషంగా ఉన్నట్టు రీల్ చేసి, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఈమె అభిమానులు తెగ లైకులు చేస్తున్నారు. ఇంకా మంచి మంచి అవకాశాలు అందుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం ఆనందంలో తేలుతూ.. దక్ష నగార్కర్ చేసిన రీల్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version