Daku Maharaj: ఫ్యాన్ వార్‌, దబిడి దిబిడి ట్రోల్స్‌పై బాలయ్య డైరెక్టర్ క్లారిటీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Daku Maharaj: ఫ్యాన్ వార్‌, దబిడి దిబిడి ట్రోల్స్‌పై బాలయ్య డైరెక్టర్ క్లారిటీ

    Daku Maharaj: ఫ్యాన్ వార్‌, దబిడి దిబిడి ట్రోల్స్‌పై బాలయ్య డైరెక్టర్ క్లారిటీ

    January 8, 2025

    నందమూరి బాలకృష్ణ (Balakrishna), జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) మధ్య విబేధాలు తలెత్తినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4 షోకు ‘డాకూ మహారాజ్‌’ (Daku Maharaj) టీమ్‌ వెళ్లగా మరోమారు ఈ వివాదం చర్చకు వచ్చింది. దర్శకుడు బాబీ పనిచేసిన హీరోల్లో తారక్‌ను సైడ్‌ చేసి మిగతా వారి గురించి బాలయ్య ప్రశ్నలు అడగడంతో జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. దీనిపై తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ‘డాకూ మహారాజ్‌’ డైరెక్టర్‌ బాబీ మాట్లాడారు. అలాగే ‘దబిడి దిబిడి’ పాటపై వస్తోన్న ట్రోల్స్‌పైనా స్పందించారు. 

    తారక్ గురించి బాలయ్య మాట్లాడారు: బాబీ

    బాలకృష్ణ హీరోగా డైరెక్టర్‌ కొల్లి బాబీ రూపొందించిన ‘డాకూ మహారాజ్‌’ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్‌ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా అన్‌స్టాపబుల్‌ షో కేంద్రంగా రాజుకున్న బాలయ్య – తారక్ ఫ్యాన్‌ వార్‌పై డైరెక్టర్‌ బాబీకి ప్రశ్న ఎదురైంది. ‘మీ షోలో తారక్‌కు సంబంధించిన ప్రస్తావన రావద్దని ముందుగానే చెప్పారట నిజమేనా? అని డైరెక్టర్‌ బాబీని రిపోర్టర్‌ ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ ‘అంత డ్రామా జరగలేదు. స్లైడ్ చేస్తూ వచ్చిన సినిమా పోస్టర్స్ గురించి ఆయన (బాలయ్య) మాట్లాడారంతే. తారక్ గురించి బాలయ్య 2, 3 సార్లు నాతో మాట్లాడారు. తారక్ సినిమాల్లో అది బాగుంటుంది.. ఇది బాగుంటుందని మాట్లాడుకున్నాం. ముఖ్యంగా జై లవకుశ సినిమా అంటే బాలకృష్ణ గారికి చాలా ఇష్టం. మనమే ఏదో ఊహించుకుని ఒక ఫ్యామిలీ ఇష్యూని పెద్దగా చేసి చూస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు. 

    దబిడి దిబిడి ట్రోల్స్‌పైనా..

    బాలయ్య, ఊర్వశి రౌతేలా కలిసి స్టెప్పులేసిన ‘దబిడి దిబిడి’ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో ఇటీవల విడుదలయ్యింది. అది విడదలయిన వెంటనే దానిపై ట్రోల్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్‌ వెనుక భాగంపై బాలయ్య కొడుతూ వేసే స్టెప్‌పై విమర్శలు వచ్చాయి. దీనిపై కూడా దర్శకుడు మాట్లాడారు. ‘మాకు సర్‌ప్రైజ్‌ ఏంటంటే అనంత్‌ శ్రీరామ్ బ్యూటీఫుల్‌గా రాసిన ‘చిన్ని చిన్ని’ పాట 3 మిలియన్ల వద్ద ఆగిపోయింది. ఇదేమో (దబిడి దిబిడి సాంగ్‌) 14 మిలియన్లు దాటిపోయింది. ఇంకా సాగిపోతోంది. దీనికి తోడు దబిడి దిబిడి సూపర్‌ అన్న అంటూ ఫ్యాన్స్‌ నన్ను ట్యాగ్ చేస్తున్నారు. నాకు తెలిసి ప్రోమోలు, ట్రైలర్‌లలో క్లాసిక్‌ టచ్ ఇచ్చి.. సడెన్‌గా ‘దబిడి దిబిడి’ రిలీజ్‌ చేసే సరికి డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది. క్రాస్‌ అప్రోచ్‌తో వెళ్తూ టక్‌ మనీ ఊరమాస్‌ స్టెప్పులు వచ్చేసరికి కనెక్ట్ కావడానికి సమయం తీసుకుంది ‘ అని అన్నారు.

    ఊర్వశీకి వింత అనుభవం..

    బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలాకు సైతం దబిడి దిబిడి ట్రోల్స్‌ సెగ తగిలింది. చాలా మంది ఆమె ట్యాగ్‌ చేస్తూ పాటలపై విమర్శలు చేశారు. అయితే తెలుగు తెలియని ఊర్వశి తనను ట్యాగ్‌ చేస్తుండే సరికి పాటలో స్టెప్పులు బాగా వేశావని పొగుడుతున్నారని భావించింది. తనపై వచ్చిన ట్రోల్స్‌ అన్నింటిని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. తనపై వచ్చిన తిట్లను కూడా ఇలా స్టేటస్ పెట్టిందేంటని తలలు పట్టుకున్నారు. దీనిపై మాట్లాడిన నిర్మాత నాగవంశీ.. తెలుగు అర్ధంకాక తెలుగు అర్ధం కాక పొరపాటున ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్ పెట్టేసిందని అన్నారు. తాను, బాబీ వెంటనే ఆమెకు చెప్పి స్టేటస్‌ తీసేయించినట్లు చెప్పారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version