Daku Maharaj: ‘మేం చూడం.. సారీ బ్రదర్‌’.. తారక్‌ ఫ్యాన్స్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Daku Maharaj: ‘మేం చూడం.. సారీ బ్రదర్‌’.. తారక్‌ ఫ్యాన్స్!

    Daku Maharaj: ‘మేం చూడం.. సారీ బ్రదర్‌’.. తారక్‌ ఫ్యాన్స్!

    January 4, 2025

    ప్రస్తుతం సోషల్ మీడియాలో జూ.ఎన్టీఆర్ (Jr NTR), బాలయ్య (Nandamuri Balakrishna) ఫ్యాన్స్‌ మధ్య ఓ రేంజ్‌లో ఫైట్ జరుగుతోంది. వరుసకు బాబాయ్‌ – అబ్బాయి అయిన ఈ హీరోలకు గత కొంతకాలంగా అసలు పడట్లేదని టాక్‌. దీంతో చాలా రోజుల నుంచి వారి అభిమానుల కోల్డ్ వార్‌ నడుస్తోంది. తాజాగా బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ 4 షోతో ఫ్యాన్స్‌ మధ్య మరోమారు అగ్గిరాజుకుంది. ‘డాకూ మహాారాజ్‌’ టీమ్‌ వెళ్లడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. షోలో బాలయ్య చేసిన పనిపై జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. అతడి సినిమాను బాయ్‌కాట్‌ చేస్తామంటూ మండిపడుతున్నారు. దీంతో నిర్మాత నాగవంశీ పరోక్షంగా అభిమానులకు సర్దిచెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 

    అసలేం జరిగిందంటే?

    నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4’ మంచి వ్యూస్ సాధిస్తూ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో దూసుకుపోతోంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బాలయ్య నటించిన డాకూ మహారాజ్‌ టీమ్‌ ఈ షోలో అడుగుపెట్టింది. దర్శకుడు బాబీతో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌, నిర్మాత నాగవంశీ పాల్గొన్న ఈ ఎపిసోడ్‌ను శుక్రవారం ఆహా టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఎపిసోడ్‌ మధ్యలో దర్శకుడు వారీతో కాసేపు సరదాగా మాట్లాడిన బాలయ్య దర్శకుడు బాబీని అతను పనిచేసిన‌ హీరోల గురించి ఒక మాటలో చెప్పమని అడుగుతాడు. ఎదురుగా ఉన్న LED స్క్రీన్స్‌పై అతడు వర్క్‌ చేసిన హీరోల ఫొటోలను ప్రదర్శించాడు.  బాబి పనిచేసిన‌ హీరోలందరూ ఫోటోలు వేస్తారు కానీ ఎన్టీఆర్ ఫోటోని మాత్రం వేయలేదు. దీంతో తారక్ ఫ్యాన్స్ దీనిపై పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. 

    తారక్‌ను అవమానిస్తారా?

    నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ ఫొటో ప్రదర్శించకుండా అతడ్ని అవమానించారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తారక్‌తో తీసిన ‘జై లవకుశ’ చిత్రం బాబీ కెరీర్‌లోనే గొప్ప ఫిల్మ్‌ అని పేర్కొంటున్నారు. అటువంటి ఫిల్మ్‌ను, అందులో నటించిన తారక్‌ను కావాలనే సైడ్‌ చేశారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు అన్‌స్టాపబుల్‌ మెుదటి సీజన్‌ నుంచి ప్రస్తుత నాల్గో సీజన్‌ వరకూ ఒక్కసారిగా కూడా తారక్‌ ప్రస్తావన రాలేదని గుర్తు చేస్తున్నారు. ఈ షోలో తారక్‌ ప్రస్తావన వద్దని తొలి సీజన్‌ ప్రారంభంలోనే ఆహా వర్గాలకు బాలయ్య తెగేసి చెప్పారని ఆరోపిస్తున్నారు. తమ హీరోను పదే పదే అవమానిస్తున్నందున బాలయ్య అప్‌కమింగ్‌ చిత్రం  ‘డాకూ మహారాజ్‌’ను తాము బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు తారక్ ఫ్యాన్స్ నెట్టింట ఆరోపిస్తున్నారు. 

    ‘మీ సపోర్ట్ కావాలి’

    బాలయ్యపై తారక్‌ ఫ్యాన్స్‌కు ఉన్న కోపం ‘డాకూ మహారాజ్‌’ (Daku Maharaj) పైకి మళ్లుతుండటంతో నిర్మాత నాగవంశీ అప్రమత్తమయ్యారు. జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను బుజ్జగించేలా పరోక్షంగా ఎక్స్ వేదికగా ట్వీట్‌ పెట్టారు. ‘ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతిపెద్ద బ్లాక్ బాస్టర్‌ సక్సెస్‌ అవ్వటానికి ప్రయత్నిద్దాం’ అంటూ రాసుకొచ్చారు. అయితే నాగవంశీ ట్వీట్‌కు తారక్ ఫ్యాన్స్ గట్టి కౌంటర్ ఇస్తున్నారు. మీ కోసం కావాలంటే ఓటీటీలో చూస్తామని సెటైర్లు వేస్తున్నారు. ఈ సినిమాకు మాత్రం ‘సారీ బ్రదర్‌’ అంటూ పోస్టులు పెడుతున్నారు. 

    బాలయ్యపై ట్రోల్స్‌..

    బాలయ్య హీరోగా చేసిన ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj) చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ‘దబిడి దిబిడి’ అనే ఐటెం సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్ చేశారు. అయితే ఇందులో స్టెప్పులు మరి బోల్డ్‌గా ఉండటంపై నెటిజన్లు మండిపతున్నారు. ముఖ్యంగా ఉర్వశీ రౌతేలా హిప్‌పై బాలయ్య ‘దడిబి దిబిడి’ అంటూ కొట్టే స్టెప్‌ను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ సాంగ్‌ను కొరియోగ్రాఫ్‌ శేఖర్ మాస్టర్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బ్రీ గ్రేడ్ స్టెప్పులు ఎవరైనా కంపోజ్‌ చేస్తారా? అంటూ నిలదిస్తూన్నారు. ఇటీవల ‘పుష్ప 2’ చిత్రంలోని ‘పీలింగ్స్‌’ పాటను సైతం శేఖర్‌ మాస్టరే కంపోజ్‌ చేయగా దానిపై కూడా ఇంతే స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version