Dandruff control Tips: ఏ షాంపులు అవసరం లేదు.. చుండ్రుకు ఇంట్లో దొరికే ఈ 5 పదార్థలతో చెక్‌ పెట్టండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Dandruff control Tips: ఏ షాంపులు అవసరం లేదు.. చుండ్రుకు ఇంట్లో దొరికే ఈ 5 పదార్థలతో చెక్‌ పెట్టండి!

    Dandruff control Tips: ఏ షాంపులు అవసరం లేదు.. చుండ్రుకు ఇంట్లో దొరికే ఈ 5 పదార్థలతో చెక్‌ పెట్టండి!

    September 20, 2023

    నేటి ఆధునిక కాలంలో జుట్టుసమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి చుండ్రు. జుట్టులో చుండ్రు ఉండటం చికాకు పెట్టడమే కాకుండా ఇతర చర్మసమస్యలకు దోహదం చేస్తోంది. చుండ్రును సులభమైన పద్దతితో అది కూడా ఇంట్లో దొరికే పదార్థలతోనే దూరం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలెంటో ఓసారి చూద్దాం.

    చుండ్రు ఎందుకు వస్తుంది?

    మన తల మీద మృత కణాలు పేరుకుపోవడం వల్ల సాధారణంగా చుండ్రు కనిపిస్తుంది. వీటి వల్ల తరుచుగా దురద, ఇబ్బందిగా ఉంటుంది. తల దువ్వేటప్పుడు స్కాల్ప్ నుంచి చుండ్రు రాలుతుంటుంది. ఎక్కువగా జిడ్డుగా ఉన్నా కూడా చుండ్రు వస్తుంది. 

    మెంతులు

    వంటగదిలో దొరికే మెంతుల్లో జుట్టు సమస్యలను నివారించే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.  మెంతులను నీటిలో లేదా పెరుగులో నానబెట్టి పేస్ట్‌గా మార్చుకోవాలి. ఈ పేస్ట్‌ని తలకు రాసుకోవాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉండి జుట్టును ఆరనివ్వండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.  రెగ్యులర్‌గా ఈ ప్యాక్‌ను వాడితే చుండ్రు సమస్యను దూరం పెట్టవచ్చు.

    కొబ్బరి నూనె

    అన్నికంటె బెస్ట్ ఛాయిస్… రెగ్యులర్‌గా జుట్టుకు కొబ్బరి నూనె పెట్టడం. ఇలా ఓ 2 నెలల పాటు రోజూ చేస్తే చుండ్రు తగ్గుతుంది. అయితే కొబ్బరి నూనె విషయంలో జాగ్రత్తపడండి. మార్కెట్‌లో కల్తీ నూనెల పట్ల అప్రమత్తంగా ఉండండి.

    పెరుగు

    చుండ్రును తొలగించడంలో పెరుగు బాగా సహాయపడుతుంది. కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జుట్టుకు సహజ మ్యాశ్చురైజర్‌గా పని చేస్తుంది. ఇందులోని లాక్టిక్ యాసిడ్ జట్లు పెరుగుదలకు, నిగారింపుకు ఉపయోగపడుతుంది. పెరుగులో ఎలాంటి మిశ్రమం కలపకుండా  మీ జట్టుకు సరిపోయే రితీలో పట్టించుకోండి. జుట్టు ఆరిన 15 నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే సరి. ఇలా వారంలో 2 సార్లు నాలుగు వారాలు చేస్తే చుండ్రు దరిచేరదు. 

    బేకింగ్ సోడా

    బేకింగ్ సోడా చుండ్రును అరికట్టడంలో సమర్థంగా పనిచేస్తుంది. కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకుని తడి జుట్టుకు పట్టించండి. అలా 10 నిమిషాలు ఉంచి స్నానం చేయండి. ఇలా నెలలో రెండూ సార్లు చేస్తే చుండ్రు సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.

    వెనిగర్

    వెనిగర్‌తోనూ ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. అందుకోసం ఆరు చెంచాల నీటిలో 2 చెంచాల వెనిగర్ కలిపాలి. ఇప్పుడు షాంపూతో తలస్నానం చేశాక ఆ నీటితో తలని కడగాలి. వారానికి ఓ సారి ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

    ఉసిరి

    జుట్టు సమస్యలను నివారించడంలో ఉసిరి చాలా గొప్పగా పనిచేస్తుంది. ఉసిరిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.  ఉసిరి పొడి, ఉసిరి రసంను ఏదైనా సరే అందులో కాసింత నిమ్మరసం కలిపి జుట్టుకు మర్దన చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల జుట్టు సమస్యలు దరిచేరవు.

    నిమ్మరసం

    పుల్లగా ఉండే పెరుగులో నిమ్మరసం కలిపి తలకు రాసుకోవాలి. 15 నిమిషాలు అలాగే ఉండి ఆరాక తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే తలలోని చుండ్రు దూరమవ్వడమే కాకుండా జుట్టు సహజరంగును సంతరించుకుంటుంది.

    ఆహారం ముఖ్యమే..

    కొన్ని సార్లు మనం తీసుకునే ఆహారం సైతం చుండ్రుకు కారణం అవుతుంది. రోజువారి తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఫైబర్, విటమిన్ ఎ, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు, చేపలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

    వీటికి నో చెప్పండి..

    ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించండి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారానికి నో చెప్పండి. అల్కాహాల్‌కు దూరంగా ఉంటే మంచిది. 

    ఈ జాగ్రత్తలు పాటించండి

    చాలా మంది తమ ఇళ్లల్లో అందరూ ఒకే దువ్వెనతో తల దువ్వుకుంటారు. ఇలా చేయడం వల్ల ఒకరి జుట్టులోని ఇన్ఫెక్షన్లు దువ్వెన ద్వారా మరొకరికి వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఎవరికి వారు సపరేట్ దువ్వెనలు వాడండి. అదే విధంగా.. టవల్స్ కూడా వేర్వేగా వాడటం మరి మంచిది

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version