Deadpool & Wolverine Review: గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్‌ సీక్వెన్స్‌.. ‘డెడ్‌పూల్‌ & వాల్వెరైన్‌’ ఎలా ఉందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Deadpool & Wolverine Review: గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్‌ సీక్వెన్స్‌.. ‘డెడ్‌పూల్‌ & వాల్వెరైన్‌’ ఎలా ఉందంటే?

    Deadpool & Wolverine Review: గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్‌ సీక్వెన్స్‌.. ‘డెడ్‌పూల్‌ & వాల్వెరైన్‌’ ఎలా ఉందంటే?

    July 26, 2024

    నటీనటులు : ర్యాన్‌ రేనాల్డ్స్‌, హ్యూ జాక్‌మన్‌, ఎమ్మా కొరిన్‌, మోరెనా బాక్రియన్‌, రామ్‌ డెలనే, లస్లీ ఉగ్గమ్స్‌, ఆరోన్‌ స్టాన్‌ఫోర్డ్‌ తదితరులు

    దర్శకత్వం : షాన్‌ లెవీ

    సినిమాటోగ్రఫీ: జార్జ్ రిచ్‌మండ్

    సంగీతం : రాబ్‌ సిమన్‌సెన్‌

    ఎడిట‌ర్ : డీన్ జిమ్మెర్‌మాన్, షేన్ రీడ్

    నిర్మాణ సంస్థ : మార్వెల్‌ స్టూడియోస్‌, మ్యాక్జిమమ్‌ ఎఫర్ట్‌, 21 ల్యాప్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

    విడుదల తేదీ : 26 జులై, 2024

    మార్వెల్‌ (Marvel) చిత్రాల సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయి క్రేజ్‌ ఉందో అందరికీ తెలిసిందే. భారత్‌లోనూ మార్వెల్‌ చిత్రాలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో సూపర్‌ హీరో కామిక్‌ సంస్థ మార్వెల్‌ స్టూడియోస్‌ నుంచి రూపొందిన మరో చిత్రమే ‘డెడ్‌పూల్‌ & వాల్వెరైన్‌’ (Deadpool & Wolverine). ఇద్దరు సూపర్‌ హీరోల కలయికతో రూపొందిన ఈ చిత్రం కోసం ఎంతోకాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ జులై 26న వరల్డ్‌ వైడ్‌గా విడుదలైంది. మరి ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    డెడ్‌పూల్‌ అలియాస్‌ వేడ్‌ విల్సన్‌ (ర్యాన్‌ రేనాల్డ్స్‌) సెకండ్‌ హ్యాండ్‌ కార్ల సేల్స్‌ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. గర్ల్ ఫ్రెండ్ వెనేసాతో బ్రేకప్ తర్వాత డెడ్‌పూల్ తన డ్రస్‌ తీసేసి తీసేస్తాడు. ఈ క్రమంలో ఓ రోజున టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు డెడ్‌పూల్‌ను ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616లో జాయిన్ అవ్వమంటారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వాల్వెరైన్‌ (హ్యూ జాక్‌మన్‌) సాయం అవసరం అవుతుంది. ఈ క్రమంలో వాల్వెరైన్‌తో కలిసి డెడ్‌పూల్‌ ఏం చేశాడు? మల్టీవెర్స్‌లో వీరిద్దరూ ఎలాంటి సాహసాలు చేశారు? పారాడాక్స్‌ను ఎలా ఎదిరించారు? అతడి ఎత్తులను ఎలా చిత్తు చేశారు? టైమ్ వేరియెన్స్ అథారిటీలో చివరకు ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ.

    ఎవరెలా చేశారంటే?

    డెడ్‌పూల్‌ పాత్రలో ర్యాన్‌ రెనాల్డ్స్‌ తనదైన నటనతో అదరగొట్టాడు. పూర్తిగా వినోదాన్ని పండిస్తూ యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్ములేపాడు. వాల్వెరైన్‌తో కలిసి యాక్ట్‌ చేసిన సన్నివేశాలను అద్భుతంగా పండించాడు. లెజండరీ నటుడు హ్యూ జాక్‌మాన్‌ వాల్వెరైన్ పాత్రలో అద్భుతం చేశాడు. తన సాలిడ్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఫ్యాన్స్‌కు గ్రాండ్‌ ట్రీట్‌ ఇచ్చాడు. కసండ్రా పాత్రలో ఎమ్మా కోరిన్ ఆకట్టుకుంది. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తూ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. మిగిలిన నటీనటులు తమ రోల్స్‌లో మెప్పించారు. తమ ఎంపిక సరైందని నిరూపించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు షాన్‌ లెవీ అదిరిపోయే యాక్షన్‌ సీక్వెన్స్‌లతో పాటు ఎంతో వినోదాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఫన్‌ వేలో కథను నడిపించడం సినిమాకు బాగా కలిసొచ్చింది. డెడ్‌పూల్‌ మాటలు, సెటైర్స్‌, వన్‌లైనర్‌ డైలాగ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికే సరిపోగా సెకండాఫ్‌ నుంచి అసలైన కథలోకి ఆడియన్స్‌ను తీసుకెళ్లారు. సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. ప్రీ క్లైమాక్స్‌ నుంచి ఎండ్‌ టైటిల్స్‌ వరకూ అదరహో అనిపిస్తుంది. అయితే సాలిడ్ ఎమోషన్స్‌ కూడా జోడించి ఉంటే సినిమా ఇంకా అదిరిపోయేది.  ఓవరాల్‌గా ఒక మంచి సూపర్‌ హీరోల చిత్రాన్ని చూడాలనుకునేవారికి డెడ్‌పూల్‌ అండ్‌ వాల్వెరైన్‌ మంచి అనుభూతిని పంచుతుంది. ముఖ్యంగా తెలుగులోని డైలాగ్స్‌ నవ్వులు పూయిస్తాయి. 

    టెక్నికల్‌గా..

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే  నేపథ్య సంగీతం చాలా బాగుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను BGM బాగా ఎలివేట్‌ చేసింది. అలాగే  తెలుగు డబ్బింగ్‌ అదిరిపోయింది. పరిస్థితులకు డైలాగ్స్‌ బాగా సింక్‌ అయ్యాయి. అటు గ్రాఫిక్స్‌ టీమ్‌ మంచి పనితీరును కనబరించింది. ఎడిటింగ్‌ వర్క్‌ బాగుంది.  నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • ర్యాన్‌ రేనాల్డ్స్‌, హ్యూ జాక్‌మన్‌
    • యాక్షన్‌ సీక్వెన్స్‌
    • డైలాగ్స్‌

    మైనస్‌ పాయింట్స్‌

    • అక్కడక్కడ బోరింగ్‌ సీన్స్‌
    • ఎమోషనల్ టచ్‌ లేకపోవడం

    Telugu.yousay.tv Rating : 3.5/5  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version