స్మార్ట్ వాచ్‌లలో నాయిస్ కంపెనీకి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో నాణ్యమైన స్మార్ట్ వాచ్‌లను తయారు చేయడం నాయిస్ ధిట్ట. ఇటీవల నాయిస్ నుంచి విడుదలైన నాయిస్(Noise Halo Plus) హాలో ప్లస్ ఎలైట్ స్మార్ట్‌వాచ్ ప్రీమియం ఎడిషన్. ఈ వాచ్‌లో ఫిట్‌నెస్ ట్రాకింగ్, స్లీపింగ్ మానిటర్, 1.46 సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే వంటి ఫీచర్స్ కలిగి ఉంది. అయితే తాజాగా అమెజాన్‌లో ఈ స్మార్ట్ వాచ్‌పై 44శాతం డిస్కౌంట్ నడుస్తోంది. మరి ఈ వాచ్ వాస్తవ ధర, డిస్కౌంట్, ఫీచర్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.
నాయిస్ హాలో ప్లస్ ఎలైట్ ఎడిషన్ స్మార్ట్‌వాచ్ వాస్తవ ధర రూ.8999. కానీ డీల్ ఆఫ్ ది డే ఆఫర్‌లో ఈ స్మార్ట్ వాచ్ కేవలం 4,999 కే లభిస్తోంది. ఎక్స్ఛెంజ్ ఆఫర్ ద్వారా మరో రూ.4700 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఫలితంగా ఈ వాచ్‌ను రూ.299కే కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ ఉన్న మంచి స్మార్ట్ వాచ్ కొనాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఛాయిస్. ఈ స్మార్ట్ వాచ్‌లో దాదాపు కచ్చితమైన హార్ట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, బ్లూటూత్ కాలింగ్, వాల్యూమ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు IP68 వాటర్ రెసిస్టెన్స్‌ను కూడా వాచ్ కలిగింది. వీటితో పాటు 100 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. తద్వారా వర్కౌట్స్ చేయాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్స్: (Noise Halo Plus Specifications)
- 1.46 అంగుళాల (3.7cms) సూపర్ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. AMOLED డిస్‌ప్లే వల్ల లోలైట్, సన్‌లైట్‌లో వాచ్‌టైంతో పాటు ఇతర ట్రాకింగ్ మానిటర్స్‌ను సులువుగా తెలుసుకోవచ్చు.
- గరిష్టంగా 7 రోజుల లాంగ్ లైఫ్ బ్యాటరీని అందిస్తుంది. అయితే బ్రైట్‌నెస్‌ని పెంచడం, హార్ట్ రేట్ మానిటరింగ్, ఫిట్‌నెస్ ట్రాకింగ్‌లను నిరంతరం యూజ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ మారవచ్చు
- ఛార్జింగ్ – స్మార్ట్‌వాచ్ సుమారు 300mAh బ్యాటరీతో వస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 గంటల సమయం పడుతుంది. బ్యాటరీ ఛార్జింగ్‌కు 5W అడాప్టర్ ఉపయోగించాల్సి ఉంటుంది.
- మ్యూజిక్ ప్లేబ్యాక్ – స్మార్ట్‌వాచ్ రిమోట్ మ్యూజిక్ కంట్రోల్‌ని కలిగి ఉంది
- వాల్యూమ్ నియంత్రణ – మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయంలో, కాల్స్‌కు హాజరైనప్పుడు వాల్యూమ్‌ను నియంత్రించవచ్చు.
- బ్లూటూత్ కాలింగ్ – Tru SyncTM పవర్డ్ బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ వల్ల మంచి నాణ్యమైన కాలింగ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు.
- నాయిస్ హెల్త్ సూట్ TM, 100 స్పోర్ట్స్ మోడ్‌లు, IP68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్స్ వల్ల ఈ వాచ్ మీకు మంచి లైఫ్ స్టైల్‌ను అందిస్తుంది.
- అదనపు ఫీచర్లు – వీటితో పాటు 100+ క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లు, రిమైండర్, వెదర్ రిపోర్ట్, కాలిక్యులేటర్, అలారం, టైమర్, వరల్డ్ క్లాక్ వంటి ఫీచర్లను స్మార్ట్ వాచ్ కలిగి ఉంది.
- ఇన్-ది-బాక్స్- ఇన్-ది-బాక్స్ కంటెంట్‌లలో నోయిస్‌ఫిట్ హాలో ప్లస్ స్మార్ట్‌వాచ్, మాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్, స్ట్రాప్ టూల్ కిట్ & యూజర్ మాన్యువల్ ఉంటాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!