దేవ్‌ధర్ రోప్ వే యాక్సిడెంట్: కొనసాగుతున్న సహాయక చర్యలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేవ్‌ధర్ రోప్ వే యాక్సిడెంట్: కొనసాగుతున్న సహాయక చర్యలు

    దేవ్‌ధర్ రోప్ వే యాక్సిడెంట్: కొనసాగుతున్న సహాయక చర్యలు

    April 12, 2022
    in India

    Deoghar, Apr 11 (ANI): Indo-Tibetan Border Police (ITBP) and National Disaster Response Force (NDRF) personnel carry out a rescue operation at the incident site where the ropeway trolley accident took place, near Trikut, in Deoghar on Monday. (ANI Photo)

     ఝార్ఖండ్‌లోని దేవ్‌ధర్‌లో ఆదివారం రోప్ వే కేబుల్ కార్ల ప్రమాదం చోటుచేసుకున్న విషయం విధితమే. ఈ ప్రమాదంతో దాదాపు 50 మందికి పైగా కేబుల్ కార్లలో చిక్కుకున్నారు. దీంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 40 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సాంకేతిక కారణంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు.  

    ఇంకా ఐదుగురు ఆపదలోనే..

    ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా ఇంకా ఐదుగురు కేబుల్ కార్లలోనే చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 40 మందిని రక్షించినప్పటికీ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒక మహిళ చికిత్స పొందుతూ మరణించారు.  ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. రెండు Mi-17 విమానాలతో భారత వైమానిక దళ సిబ్బంది కూడ పర్యాటకులను రక్షించే బాధ్యతను తీసుకుంది. ఈ ప్రమాదాన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించి ..ఘటనకు గల కారణాలు ఈనెల 26లోగా తెలపాల్సిందిగా కోరింది.

    దేశంలోనే అత్యంత ఎత్తైన రోప్

    ఈ త్రికూట్ రోప్ వే భారత్ లోనే అత్యంత ఎతైన వర్టికల్ రోప్ వే. త్రికూట పర్వతాల్లోని స్వామి వారిని దర్శించుకోవడానికి, అలాగే సరదాగా గడపడానికి ప్రయాణికులు ఎక్కువగా ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఈ రోప్ వే 766 మీటర్ల పొడవు ఉండగా, 25 క్యాబిన్లు ఉంటాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version