Devara Collections Analysis: బాక్సాఫీస్‌ పైకి దూసుకొస్తున్న ‘దేవర’.. తొలి రోజు రూ.125 కోట్లు పక్కా!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Devara Collections Analysis: బాక్సాఫీస్‌ పైకి దూసుకొస్తున్న ‘దేవర’.. తొలి రోజు రూ.125 కోట్లు పక్కా!

    Devara Collections Analysis: బాక్సాఫీస్‌ పైకి దూసుకొస్తున్న ‘దేవర’.. తొలి రోజు రూ.125 కోట్లు పక్కా!

    September 26, 2024

    ‘దేవర’ (Devara: Part 1) రాకకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. తారక్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు (సెప్టెంబర్‌ 27) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇందులో తారక్‌కు జోడీగా శ్రీదేవి కూతురు, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటించింది. ప్రముఖ హిందీ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా చేయడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా బజ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500లకు పైగా ప్రీమియర్స్‌తో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇక వరల్డ్‌ వైడ్‌గా దేవర అడ్వాన్స్‌ బుకింగ్‌ ట్రెండ్స్‌ చూస్తుంటే తొలి రోజు ఈజీగానే రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఎలా సాధ్యమో ఈ కథనంలో తెలుసుకుందాం. 

    తొలి రోజు రూ.125 కోట్లు పక్కా!

    తారక్‌ నటించిన ‘దేవర’ చిత్రం రిలీజ్‌కు ముందే పలు రికార్డులను కొల్లకొడుతూ భారీ హైప్‌ సంపాదించుకుంది. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతి సైతం ఇచ్చాయి. అటు ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో ప్రీసేల్స్‌ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవర తొలి రోజున రూ.125 కోట్లకు పైగా గ్రాస్‌ పక్కాగా సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా రూ.10-15 కోట్లు ఎక్కువ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ప్రీ బుకింగ్స్‌ను బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.65 కోట్లు దేవర రాబట్టొచ్చని సమాచారం. హిందీలో రూ.8-10 కోట్లు దేవర ఖాతాలో పడొచ్చు. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ, రెస్ట్‌ ఆఫ్ ఇండియా మెుత్తం కలిపి రూ.10-15 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఓవర్సీస్‌లో మాత్రం దేవర దుమ్మురేపడం ఖాయమని అంటున్నారు. తొలిరోజు ఈజీగానే రూ.30-35 కోట్లు కొల్లగొట్టే పరిస్థితులు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఏ రకంగా చూసుకున్న తొలిరోజు దేవర ఖాతాలో రూ.125 కోట్లు + పడటం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

    బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఎంతంటే?

    ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్‌లో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు విక్రయించారని సమాచారం. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్​లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్​లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్‌ వసూలు చేస్తే బ్రేక్‌ ఈవెన్ అవుతుంది. 

    ’దేవర’పై అనిరుధ్‌ ఫస్ట్ రివ్యూ

    ‘దేవర’ చిత్రానికి యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుద్‌ రవిచందర్‌ (Anirudh Ravichander) సంగీతం సమకూర్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిరుద్‌ ‘దేవర’పై హైప్‌ వచ్చే కామెంట్స్‌ చేశారు. ‘బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించే సమయంలో నేను ఆశ్చర్యపోయాను. ఇంత గొప్పగా సినిమాను ఎలా తెరకెక్కించారని ఆలోచిస్తూనే ఉన్నా. ఇది అద్భుతమైన యాక్షన్ డ్రామా. ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతం అందించాలంటే మంచి ప్రయోగాలు చేయొచ్చు. ప్రేక్షకులకు ఫ్రెష్‌ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో 95 శాతం రీరికార్డింగ్ పనులను విదేశాల్లోనే పూర్తి చేశాం. దేవర చూస్తున్నప్పుడు మీకు అవెంజర్స్‌, బ్యాట్‌మ్యాన్‌ వంటి హాలీవుడ్‌ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది. ఇందులో ఎమోషన్‌, డ్రామా, యాక్షన్‌, ఆవేశం, అన్నీ ఉన్నాయి. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఈ సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్‌ షో చూడాలనుకుంటున్నా’ అని అనిరుద్‌ అన్నారు. 

    సైఫ్‌ భార్యగా తెలుగు నటి

    దేవరలో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భార్యగా తెలుగు సీనియర్‌ నటి చైత్ర రాయ్‌ నటించింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగుతోంది. ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీఖాన్‌ లాంటి స్టార్లతో కలిసి నటించే అవకాశం దొరకడం తన అద్భుష్టమని చైత్ర అంటోంది. సెట్‌లో తొలిసారి తారక్‌, సైఫ్‌ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పుకొచ్చింది. కాగా, ‘అష్టా చమ్మా’ సీరియల్‌తో చైత్ర బుల్లితెరకు పరిచయమైంది. ప్రస్తుతం ‘రాధకు నీవేరా ప్రాణం’ సీరియల్‌లో నటిస్తోంది. దేవరతో మంచి గుర్తింపు లభిస్తే సినిమాల్లోనూ బిజీ కావచొచ్చని చైత్ర భావిస్తోంది. 

    ఆ రెండు దేశాల్లో అరుదైన ఘనత

    ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘దేవర’ ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ యాక్షన్‌ డ్రామా తాజాగా మరో ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్‌మోస్‌ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ (Devara) నిలిచింది. ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్స్‌లో, న్యూజిలాండ్‌లో 3 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఇటీవలే నార్త్‌ అమెరికా టికెట్ల ప్రీసేల్‌లో దేవర రికార్డు సృష్టించింది. ప్రీ సేల్‌ టికెట్ల విక్రయాల్లో అత్యంత వేగంగా 1 మిలియన్‌ డాలర్ల మార్క్‌ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version