Devara: కొరియన్‌ మూవీని చూసి దేవర కాపీ? వీడియో వైరల్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Devara: కొరియన్‌ మూవీని చూసి దేవర కాపీ? వీడియో వైరల్!

    Devara: కొరియన్‌ మూవీని చూసి దేవర కాపీ? వీడియో వైరల్!

    October 24, 2024

    జూ.ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. కలెక్షన్స్‌ సునామి సృష్టించి తారక్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీలో వచ్చే సముద్రపు ఫైట్‌ సీక్వెన్స్‌ ఆడియన్స్‌ను ఎంతగానో అలరించాయి. కొరటాల శివ క్రియేటివిటీ అద్భుతమంటూ కామెంట్స్‌ సైతం వినిపించాయి. అయితే అవన్నీ కొరటాల శివ సొంత ఆలోచనల నుంచి పుట్టినవి కావని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఓ కొరియన్‌ సినిమా సీన్లను మక్కీకి మక్కీ దించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇదిగో ఆధారాలంటూ ఓ వీడియోను సైతం ట్రెండ్‌ చేస్తున్నారు. 

    అసలేం జరిగిందంటే?

    ‘దేవర’ ఇంట్రడక్షన్‌, ఇంటర్వెల్‌ సీన్స్‌ను గమనిస్తే ఎవరికైనా గూస్‌బంప్స్‌ రావాల్సిందే. ఒక తెలుగు  డైరెక్టర్‌ సముద్రంలో ఆ స్థాయి యాక్షన్‌ సీక్వెన్స్‌ తీస్తారని ఎవరు ఊహించలేదు. సముద్రపు ఓడలోని ఆయుధాలను దోచుకునేందుకు హీరో తన గ్యాంగ్‌తో కలిసి వెళ్లడం, గన్స్‌తో ఉన్న పెట్టెలను సముద్రంలో పడేయటం మూవీలో చూడవచ్చు. అప్పటికే నాటు పడవలతో సిద్ధంగా ఉన్న హీరో గ్యాంగ్‌లోని మరికొందరు ఆ బాక్స్‌లను తమ నాటు పడవల్లోకి ఎక్కించుకొని నావీ అధికారుల కళ్లుకప్పి స్మగ్లింగ్‌ చేస్తారు. అయితే అచ్చం ఇలాంటి సీనే కొరియన్‌ మూవీలో ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ సీన్‌నే దర్శకుడు కొరటాల శివ కాపీ కొట్టారని ఆరోపిస్తున్నారు. ఆడియన్స్‌ను భలే బురిడి కొట్టించావంటూ దర్శకుడిపై మండిపతున్నారు. ఆ కొరియన్‌ మూవీ సీన్‌ను మీరు ఓసారి చూసేయండి. 

    ఆ సీన్‌ కూడా అంతే!

    ‘దేవర’ సినిమాలో తారక్‌ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. తొలుత విలన్‌ గ్యాంగ్‌తో పాటు స్మగ్లింగ్‌లో పాల్గొన్న ‘దేవర’ కొన్ని బలమైన కారణాలతో మంచిగా మారతాడు. అదే సమయంలో సముద్రంలోకి స్మగ్లింగ్‌ చేయడానికి వస్తోన్న తన వారిలో భయం కలిగిస్తాడు. ఈ క్రమంలో కత్తులతో ఉన్న కుర్చీని తీరం వెంబడి దర్శకుడు చూపించారు. అయితే ఈ సీన్‌ను కూడా కాపీ కొట్టారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. హాలీవుడ్‌ చిత్రం ‘వికింగ్స్‌’ (Vikings)లోని ఓ సన్నివేశం కూడా అచ్చం అలాగే ఉందంటూ ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు.

    దేవర కథ కూడా కాపీనా?

    దేవర కథను కాపీ రైట్‌ ఉన్న నవల నుంచి తీసుకున్నట్లు రిలీజ్‌కు ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాను కాపీరైట్ కొనుగోలు చేసిన ఒక నవలలోని కీలక సీన్స్‌ ఓ సినిమాలో చూసి బాధపడుతున్నానని తమిళ డైరెక్టర్‌ శంకర్‌ ఇటీవల ఆరోపించారు. క్రియేటర్స్‌ దగ్గర ఉన్న రైట్స్‌ గౌరవించాలని, అధికారం లేకుండా సీన్స్‌ను కాపీ కొట్టడం మానుకోవాలని శంకర్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఆయన ఏ సినిమా గురించి ప్రస్తావించారో క్లారిటీ ఇవ్వలేదు. కానీ, శంకర్‌ ప్రస్తావించిన తమిళ నవల వీరయుగ న్యాయ వేల్పరి కథకు దగ్గరగా దేవర స్టోరీ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

    శ్రీమంతుడు విషయంలోనూ..

    కథను కాపీ చేశారన్న ఆరోపణలు కొరటాల శివపై రావడం ఇదే తొలిసారి కాదు. మహేష్‌తో చేసిన ‘శ్రీమంతుడు’ (Srimanthudu) మూవీ విషయంలోనూ ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తన స్టోరీని కాపీ కొట్టాడంటూ రచయిత శరత్‌ చంద్ర కోర్టుకు సైతం వెళ్లారు. అప్పట్లో విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 2012లో ‘చచ్చేంత ప్రేమ’ పేరుతో స్వాతి మాస పత్రికలో తన స్టోరీ ప్రచురితమైందని రచయిత తెలిపారు. దానిని సినిమా చేద్దామని అనుకుంటున్న క్రమంలోనే కొరటాల శివ ‘శ్రీమంతుడు’ తీసేశాడని ఆరోపించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version