ఎన్టీఆర్ (NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కించిన చిత్రం ‘దేవర’ (Devara). ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. పార్ట్ 1 ఈ నెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలను ‘దేవర’ (Devara: Part 1) పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్‌టైమ్‌ను కూడా సెన్సార్ సభ్యులు ఫిక్స్ చేశారు. సుదీర్ఘమైన ఈ సినిమా నిడివిని చూసి అభిమానుల్లో కొత్త టెన్షన్ మెుదలైంది. తెలిసి కూడా దేవర టీమ్ రిస్క్ చేస్తున్నారా? అన్న కామెంట్స్ నెట్టింట వినిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సెన్సార్ క్లియర్
జూ.ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన దేవర చిత్రం సెన్సార్ పనులను కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా నిడివిని 2 గంటల 57 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. అంటే దాదాపుగా మూడు గంటల నిడివితో దేవర థియేటర్లలో అడుగుపెట్టబోతోంది. సాధారణంగా మూడు గంటలు అంటే పెద్ద నిడివే అని చెప్పవచ్చు. అయితే, దేవర మూవీలో యాక్షన్ సీక్వెన్సులు ఎక్కువగా ఉండడం, కథను కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉండటంతో ఎక్కువ నిడివికే మేకర్స్ నిర్ణయించుకున్నారు.
తెలిసే రిస్క్ చేస్తున్నారా?
దేవర చిత్రాన్ని దాదాపు మూడు గంటల నిడివితో తీసుకొస్తుండటం పెద్ద రిస్కే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు గంటల పాటు ప్రేక్షకులను సీట్‌లో కూర్చోపెట్టడం అంటే మాములు విషయం కాదని అంటున్నారు. కథ ఏమాత్రం ల్యాగ్ అనిపించినా, అనసవర సన్నివేశాలు వచ్చినా అది సినిమాపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుందని తేల్చి చెబుతున్నారు. గతంలో వచ్చిన పలు చిత్రాల విషయంలో ఇదే జరిగిందని గుర్తు చేస్తున్నారు. కథ ఎంత బాగున్నప్పటికీ నిడివి కారణంగా ఆ సినిమాలు దెబ్బతిన్నాయని గుర్తుచేస్తున్నారు. కాబట్టి ‘దేవర’ విషయంలో ఏమాత్రం అంచనాలు మిస్ అయినా భారీ ఎదురుదెబ్బ తప్పదని హెచ్చరిస్తున్నారు. అటు కొందరు తారక్ ఫ్యాన్స్ సైతం నిడివి విషయంలో నెట్టింట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిడివితో దెబ్బతిన్న చిత్రాలు!
ఇటీవల కాలంలో రిలీజైన ‘భారతీయుడు 2’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలు ఎక్కువ నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ‘భారతీయుడు 2’ను పక్కన పెడితే మిగిలిన రెండు చిత్రాలు మంచి కంటెంట్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించడంలో అవి విఫలమయ్యాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’లో రవితేజ మంచి నటన కనబరిచినప్పటికీ నిడివి ఎక్కువ ఉంటడం వల్ల బాగా సాగదీసిన ఫీలింగ్ ఆడియన్స్‌కు కలిగింది. ‘అంటే సుందరానికి’ విషయంలోనూ ఇదే జరిగింది. విభిన్న మతాలకు చెందిన యువతి, యువకుడు ప్రేమలో పడితే వచ్చే సమస్యలు ఏంటన్న యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. కానీ, సుదీర్ఘమైన నిడివి వల్ల సీరియల్‌గా ఉందంటూ విమర్శలు ఎందుర్కొంది.
కొరటాల పైనే భారం!
గత చిత్రాల్లో లాగా కొరటాల శివ మ్యాజిక్ చేయగలిగితే నిడివి పెద్ద సమస్య కాదని చెప్పవచ్చు. తారక్ యాక్టింగ్‌తో పాటు కథ, కథనం, మేకింగ్‌తో కొరటాల కట్టిపడేస్తే ‘దేవర’ రన్‌టైమ్ బిగ్ ప్లస్‌గా మారే అవకాశం లేకపోలేదు. కొరటాల శివ తెరకెక్కించిన ‘మిర్చి’, ‘భరత్ అనే నేను’, ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’ వంటి చిత్రాలను పరిశీలిస్తే ఆయన డైరెక్షన్ స్కిల్స్ అర్థమవుతుంది. ఒక చిన్న స్టోరీ లైన్‌కు అద్భుతమైన డ్రామా, స్క్రీన్‌ప్లేను జత చేసి కొరటాల సూపర్ సక్సెస్ అయ్యారు. ‘దేవర’లోనూ ఈ మ్యాజిక్‌ను రిపీట్ అయితే ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన ‘సరిపోదా శనివారం’తో పాటు అంతకుముందు వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’, యానిమల్ ‘సలార్’, యానిమల్ చిత్రాలు కూడా మూడు గంటల నిడివితో వచ్చే సక్సెస్ అయ్యాయి. కొరటాల శివ గతంలో మాదిరి దేవర విషయంలోనూ మ్యాజిక్ చేయగలిగితే ఈ సినిమా సకెస్స్‌ను ఎవరూ అడ్డుకోలేరు.
రాజమౌళి ఫ్లాప్ భయం!
‘దేవర’ చిత్రాన్ని మరో భయం కూడా వెంటాడుతోంది. దర్శక ధీరుడు రాజమౌళితో పనిచేసిన హీరోలు తమ తర్వాతి చిత్రాల్లో భారీ ఫ్లాప్స్‌ను అందుకున్నారు. రవితేజ, ప్రభాస్, రామ్‌చరణ్ విషయాల్లో ఇదే రుజువైంది. అంతేందుకు రాజమౌళితో చేసిన ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’ వంటి హిట్ చిత్రాల తర్వాత తారక్ చేసిన మూవీస్ డిజాస్టర్లుగా నిలిచాయి. సుబ్బు, ఆంధ్రావాలా అతడి కెరీర్‌లో మాయని మచ్చలా మారిపోయాయి. తారక్ గత చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన నేపథ్యంలో ‘దేవర’పై ఆందోళన వ్యక్తంమవుతోంది. దేవర విషయంలో ఈ సెంటిమెంట్ రిపీట్ అయితే ఏంటి పరిస్థితి అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ‘దేవర’తో ఈ సెంటిమెంట్‌ను బద్దలు కొడతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.