Devara Run Time: భయపెడుతున్న ‘దేవర’ రన్‌టైమ్‌..! అదే జరిగితే ఎదురుదెబ్బ తప్పదా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Devara Run Time: భయపెడుతున్న ‘దేవర’ రన్‌టైమ్‌..! అదే జరిగితే ఎదురుదెబ్బ తప్పదా?

    Devara Run Time: భయపెడుతున్న ‘దేవర’ రన్‌టైమ్‌..! అదే జరిగితే ఎదురుదెబ్బ తప్పదా?

    September 4, 2024

    జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా నటించిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సరిగ్గా 23 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైగ్‌ ఆడియన్స్‌ను పలకరించనుంది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఇందులో తారక్‌కు జోడీగా నటిస్తుండగా సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan), బాబీ డియోల్‌ (Bobby Deol) వంటి హిందీ స్టార్‌ నటులు విలన్‌ పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై పెద్ద ఎత్తున బజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా ‘దేవర’ రన్‌టైమ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇది చూసి తారక్ ఫ్యాన్స్‌ అందోళనకు గురవుతున్నారు. 

    రన్‌ టైమ్ ఎంతంటే?

    తారక్‌, కొరటాల కాంబినేషన్‌లో రూపొందిన దేవర చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా రన్‌ టైమ్‌ ఫైనల్‌ అయినట్లు టాక్ వినిపిస్తోంది. మెుత్తంగా 3 గంటల 10 నిమిషాల రన్‌టైమ్‌ను దేవర టీమ్‌ ఫైనల్‌ చేసినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ఎడిటింగ్‌ వర్క్‌ మెుత్తం పూర్తైన అనంతరం ఈ మేరకు నిడివి వచ్చిందని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద నిడివి ‘దేవర’ను ఇబ్బంది పెట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు. 3 గంటలకు పైగా నిడివితో వచ్చిన చాలా వరకు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయని గుర్తుచేస్తున్నారు. అయితే ఈ నిడివే ‘దేవర’కు ఫైనల్‌ అవుతుందని చెప్పలేం. ఎందుకంటే సెన్సార్‌ బోర్డు సమీక్షకు ఈ మూవీ వెళ్లాల్సి ఉంటుంది. బోర్డ్‌ సభ్యులు ఏదైన కత్తెరలు విధిస్తే నిడివి కాస్త తగ్గే అవకాశముంది. 

    కొరటాల మ్యాజిక్‌ చేసేనా?

    సెన్సార్‌ ఎన్ని కత్తెరలు విధించిన ‘దేవర’ నిడివి 3 గంటల కంటే తగ్గే పరిస్థితులు లేవని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల స్క్రీన్‌ప్లే ప్రెజెన్స్‌పై సినిమా సక్సెస్‌ ఆధారపడనుంది. కొరటాల శివ తెరకెక్కించిన ‘మిర్చి’, ‘భరత్‌ అనే నేను’, ‘జనతా గ్యారేజ్‌’, ‘శ్రీమంతుడు’ వంటి చిత్రాలను పరిశీలిస్తే ఆయన డైరెక్షన్‌ స్కిల్స్‌ అర్థమవుతుంది. ఒక చిన్న స్టోరీ లైన్‌కు అద్భుతమైన డ్రామా, స్క్రీన్‌ప్లేను జత చేసి కొరటాల సూపర్‌ సక్సెస్‌ అయ్యారు. ‘దేవర’లోనూ ఈ మ్యాజిక్‌ను రిపీట్‌ అయితే ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన ‘సరిపోదా శనివారం’ కూడా దాదాపుగా 3 గంటల నిడివితో రిలీజైంది. అయినప్పటికీ అద్భుతమైన యాక్షన్ డ్రామా, వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌ స్కిల్స్‌, నాని – ఎస్‌.జే. సూర్య అద్భుతమైన నటనతో నిడివి పెద్దగా సమస్య కాలేదు. 

    నిడివితో దెబ్బతిన్న చిత్రాలు!

    ఇటీవల కాలంలో రిలీజైన ‘భారతీయుడు 2’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలు ఎక్కువ నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. ‘భారతీయుడు  2’ను పక్కన పెడితే మిగిలిన రెండు చిత్రాలు మంచి కంటెంట్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించడంలో అవి విఫలమయ్యాయి. ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో రవితేజ మంచి నటన కనబరిచినప్పటికీ నిడివి ఎక్కువ ఉంటడం వల్ల బాగా సాగదీసిన ఫీలింగ్ ఆడియన్స్‌కు కలిగింది. ‘అంటే సుందరానికి’ విషయంలోనూ ఇదే జరిగింది. విభిన్న మతాలకు చెందిన యువతి, యువకుడు ప్రేమలో పడితే వచ్చే సమస్యలు ఏంటన్న యూనిక్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. కానీ, సుదీర్ఘమైన నిడివి వల్ల సీరియల్‌గా ఉందంటూ విమర్శలు ఎందుర్కొంది. 

    కొత్త పోస్టర్‌ రిలీజ్‌

    దేవర చిత్రం నుంచి నేడు మూడో సాంగ్‌ రిలీజ్‌ కానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ఫియ‌ర్ సాంగ్‌తో పాటు సెకండ్ సింగిల్ చుట్ట‌మ‌ల్లే పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా.. ఈ రెండు పాట‌లు యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ‘దావుడి’ పేరుతో థర్డ్‌ సింగిల్‌ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయంత్రం 5.04 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో తారక్‌, జాన్వీ కపూర్‌ ఇచ్చిన రొమాంటిక్ ఫోజు ఆకట్టుకుంటోంది. 

    ‘దేవర’ స్టోరీ అదేనా?

    ‘దేవర’ చిత్ర కథను కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని దర్శకుడు కొరటాల శివ రాసుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం దళితులపై గతంలో జరిగిన క్రూరమైన హత్యాకాండకు సంబంధించి ఈ మూవీ తెరకెక్కినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న కారంచేడు విషాద ఘటనను ఇందులో చూపించనున్నట్లు సమచారం. 1985లో ఏపీలోని కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో బలయ్యారు. ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ను ‘దేవర’ చిత్రంలో చూపించడానికి కొరటాల శివ ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర’ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్‌ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version